ETV Bharat / business

మహిళగా మీరు ఆర్థిక స్వేచ్ఛ సాధించాలా? ఈ బెస్ట్​ టిప్స్ మీ కోసమే! - Financial Independence for Women

Financial Independence for Women : భారతీయ మహిళలు ఉన్నత శిఖరాలను అధిరోహిస్తున్నారు. మెరుగైన భవిష్యత్తును సాధించే దిశగా అన్ని రంగాల్లోనూ తమ సత్తా చాటుతున్నారు. ఆర్థిక స్వేచ్ఛను సాధించేందుకు ఉన్న అడ్డంకులను అధిగమిస్తున్నారు. మహిళ దినోత్సవం సందర్భంగా మహిళలను ఆర్థికంగా మరింత బలోపేతం చేసేందుకు నిపుణులు ఎలాంటి సూచనలు ఇస్తున్నారో చూద్దాం.

Financial Independence for Women
Financial Independence for Women
author img

By ETV Bharat Telugu Team

Published : Mar 8, 2024, 11:14 AM IST

Financial Independence for Women : మహిళలు ఈ మధ్య కాలంలో మగవాళ్లకు పోటీగా అన్నీ రంగాల్లో సత్తా చాటుతూ ఉన్నత శిఖరాలను అధిరోహిస్తున్నారు. అవిశ్రాంతంగా శ్రమిస్తూ, మెరుగైన భవిష్యత్తును సాధించే దిశగా ముందుకు సాగుతున్నారు. దేశ ఆర్థిక వ్యవస్థపైనా, ప్రజల జీవితాలపైనా తమ ప్రభావాన్ని చూపిస్తున్నారు. ఇదే సమయంలో వ్యక్తిగత ఆర్థిక స్వేచ్ఛను సాధించేందుకు గతంలో ఉన్న అడ్డంకులను కూడా అధిగమిస్తున్నారు. మహిళా దినోత్సవం సందర్భంగా మహిళలు తమనుతాము మరింత బలోపేతం చేసుకునేందుకు ఎలాంటి ప్రణాళికలు చేసుకోవాలో ఇప్పుడు తెలుసుకుందాం.

సొంత ప్రణాళిలు అవసరం
వేగంగా అభివృద్ధి చెందుతున్న ప్రపంచంలో మహిళలు సొంత ఆర్థిక భవిష్యత్తును నిర్మించుకోవడం చాలా కీలకం. వీటిని సాధించే దిశగా కొన్ని ప్రయత్నాలు చేయాలని ఇండియాఫస్ట్‌ లైఫ్‌ ఇన్సూరెన్స్‌ ఎండీ, సీఈఓ ఆర్​ఎమ్ విశాఖ తెలిపారు.

"మహిళలు తమ సొంత ఆర్థిక ప్రణాళికలను రూపొందించుకోవాలి. తమ అవసరాలు, ప్రాధాన్యతలు తమ కంటే ఎవరూ మెరుగ్గా అర్థం చేసుకోలేరనే విషయాన్ని గమనించాలి. ఆర్థిక విషయాలను నిర్వహించే సామర్థ్యం లేదు అనే భావన నుంచి బయటకు రావాలి. వ్యూహాత్మక ఆర్థిక ప్రణాళికలను రచించుకోవాలి. ఉద్యోగం చేస్తున్నా, వ్యాపారంలో ఉన్నా, గృహిణులుగా ఉన్నా తమ సొంత జీవిత లక్ష్యాలను నెరవేర్చుకునేందుకు ఈ ప్రణాళిక తోడ్పడాలి. దీనికోసం కొంచెం సమయం కేటాయించాలి. మీ ఆర్థిక భవిష్యత్​ కోసం సొంతంగా పెట్టుబడి పెట్టేందుకు అవసరమైన అవగాహన పెంచుకోవాలి. "

- విశాఖ ఆర్‌ఎం, ఎండీ-సీఈఓ, ఇండియాఫస్ట్‌ లైఫ్‌ ఇన్సూరెన్స్‌

కుటుంబ ఆర్థిక నిర్ణయాల్లో చురుకైన పాత్ర
'ఆర్థిక స్వేచ్ఛ ఉన్నప్పటికీ 59 శాతం మంది మహిళలు సొంత నిర్ణయాలు తీసుకోవడం లేదని గణాంకాలు వెల్లడిస్తున్నాయి. కుటుంబ శ్రేయస్సు కోసం వారు రాజీ పడుతుంటారు. నగదును తెలివిగా, సమర్థంగా నిర్వహించడం ద్వారా మీ ఆర్థిక విలువను కాపాడుకోవాలి. మహిళలు కుటుంబ నిర్వహణ కోసం ఎన్నో ఖర్చులను నిర్వహించే బాధ్యత తీసుకుంటారు. ఇదే విధానాన్ని మీ పెట్టుబడులకూ వర్తింపజేయాలి. నగదు, బంగారం, ఫిక్స్‌డ్‌ డిపాజిట్లకు మించి ఆలోచించాలి. స్వల్పకాలిక, దీర్ఘకాలిక పెట్టుబడి సాధనాలు ఇప్పుడు ఎన్నో అందుబాటులో ఉన్నాయి. వీటి గురించి తెలుసుకోవాలి. మ్యూచువల్‌ ఫండ్ల నుంచి షేర్ల వరకూ మీ పెట్టుబడులు విస్తరించాలి. కుటుంబ ఆర్థిక నిర్ణయాల్లో చురుకైన పాత్ర పోషించాలి. ఆర్థిక లక్ష్యాలను సాధించేలా పెట్టుబడులను ఎంచుకోవడంలాంటివి మీరు ఎంతో సమర్థంగా చేయగలరు. ఆర్థిక విశ్వాసం పెరగడం వల్ల జీవితంపై సానుకూల దృక్పథం ఏర్పడుతుంది. వ్యక్తిగత సాధికారతకు దోహదం చేస్తుంది. ఆర్థిక విషయాల్లో పట్టు సాధించేందుకు ఇప్పుడు ఎన్నో మార్గాలున్నాయి. వాటిపై కాస్త దృష్టి పెడితే చాలు. మీ ఆదాయాన్ని, అవసరాలను విశ్లేషించుకోవాలి. అవసరమైతే నిపుణుల సహాయాన్ని తీసుకోవాలి. ఆర్థిక స్వేచ్ఛను మనమే సాధించుకోవాలి' అని విశాఖ ఆర్​ఎం తెలిపారు.

ఈ పాలసీలు ఉండాలి
మహిళలు తమ ఆర్థిక రక్షణ కోసం కొన్ని రకాల సాధారణ బీమా పాలసీలను తీసుకోవాల్సిన అవసరం ఉందని బజాజ్‌ అలియాంజ్‌ జనరల్‌ ఇన్సూరెన్స్‌, చీఫ్ టెక్నికల్ ఆఫీసర్ టీఏ రామలింగం చెబుతున్నారు. అవి ఏమిటంటే?

  • ఆరోగ్య బీమా : కుటుంబం అంతటికీ వర్తించేలా ఆరోగ్య బీమా పాలసీ తీసుకోవాలి. కొన్ని బీమా పాలసీలు ప్రసూతి ఖర్చులను చెల్లిస్తాయి. కొత్తగా వివాహం అయిన వారు ఇలాంటి పాలసీలను పరిశీలించాలి. డెలివరీకి 90 రోజుల ముందు నుంచీ, ఆ తర్వాత 90 రోజుల వరకూ ఏదైనా చికిత్స తీసుకుంటే ఆ ఖర్చులను పాలసీలు చెల్లిస్తాయి.
  • తీవ్ర వ్యాధులకు : కొన్ని జీవన శైలి వ్యాధులు, తీవ్రమైన వ్యాధులు వచ్చినప్పుడు ఆర్థిక రక్షణ కల్పించేలా పాలసీలు తీసుకోవాలి. ముఖ్యంగా రొమ్ము క్యాన్సర్‌, అండాశయ క్యాన్సర్‌ లాంటివి మహిళలకు మాత్రమే వస్తాయి. ఇలాంటి వ్యాధులను గుర్తించినప్పుడు క్రిటికల్‌ ఇల్‌నెస్‌ పాలసీలు ఒకేసారి 100 శాతం పాలసీ విలువను చెల్లిస్తాయి. అనారోగ్యం వల్ల ఉద్యోగం చేయలేని పరిస్థితుల్లో 3 నెలల జీతాన్ని అందించే ఏర్పాటూ ఇందులో ఉంటుంది. పిల్లల చదువులకూ అవసరమైన ఆర్థిక సహాయాన్నిచ్చేలా 'చిల్డ్రన్‌ ఎడ్యుకేషన్‌ బోనస్‌' లాంటివి తోడుంటాయి.
  • సైబర్‌ బీమా : డిజిటల్‌ ప్రపంచంలో సైబర్‌ నేరాలు పెరిగిపోతున్నాయి. వీటి బారినపడి, ఆర్థికంగా నష్టపోయినప్పుడు రక్షణ కల్పించేలా సైబర్‌ ఇన్సూరెన్స్‌ పాలసీ తప్పనిసరి. ముఖ్యంగా మహిళలు ఈ పాలసీని తీసుకోవడంలో నిర్లక్ష్యం చేయవద్దు.
  • వాహన బీమా : మీకు వాహనం ఉంటే, దానికి కచ్చితంగా వాహన బీమా ఉండేలా చూసుకోండి. కనీసం థర్డ్‌ పార్టీ బీమా పాలసీ లేకుండా వాహనాన్ని నడపకూడదు. పూర్తి స్థాయి వాహన బీమా తీసుకోవడం ఎప్పుడూ మంచిది.
  • వ్యక్తిగత ప్రమాద పాలసీ : ప్రమాదం ఎప్పుడు ఏ రూపంలో వస్తుందో చెప్పలేం. అందువల్ల వ్యక్తిగత ప్రమాద బీమా పాలసీ ఒక తప్పనిసరి అవసరం. ఉద్యోగం చేసే వారు కూడా దీన్ని మర్చిపోకూడదు. చాలా తక్కువ ప్రీమియంతో ఈ పాలసీ అందుబాటులో ఉంటుంది.

ఒంటరి మహిళలకు తప్పనిసరిగా బీమా
మహిళలకు సంబంధించిన ఆర్థిక విషయాల్లో తండ్రి, జీవిత భాగస్వామి పాత్ర అధికంగా ఉండటం చూస్తుంటాం. దీని నుంచి బయటకు రావాల్సిన అవసరం ఉందని ఏగాన్ లైఫ్ ఇన్సూరెన్స్ శ్రీనిధి షమా రావు తెలిపారు.

"జీవిత బీమా పాలసీలు పురుషులకే అనే అపోహ చాలామందిలో ఉంటుంది. ఆర్జించే వ్యక్తులందరికీ బీమా పాలసీ ఉండాల్సిందే. మహిళలు తీసుకునే బీమా పాలసీలకు చెల్లించే ప్రీమియంలో రాయితీలూ ఉంటాయి. జీవిత భాగస్వామి తీసుకున్న పాలసీల్లో మీ పేరు నామినీగా ఉండేలా చూసుకోండి. గృహిణిగా ఉన్నా కుటుంబంలో ఆర్జించే వ్యక్తి బీమా పాలసీలను నిర్లక్ష్యం చేయకుండా మీరు బాధ్యత తీసుకోవాలి. ఒంటరి మహిళలు తమపై ఆధారపడిన వారున్నప్పుడు తప్పనిసరిగా బీమా పాలసీ తీసుకోవాల్సిన అవసరం ఉంటుంది"

-శ్రీనిధి షమా రావు, చీఫ్‌ స్ట్రాటజీ ఆఫీసర్‌, ఏగాన్‌ లైఫ్‌ ఇన్సూరెన్స్‌

ఇలా సిద్ధం అవ్వాలి
ఎప్పుడు ఎలాంటి సందర్భం వచ్చినా మహిళలు ఆర్థికంగా దాన్ని ఎదుర్కొనేందుకు సిద్ధంగా ఉండాలని బ్యాంక్​బజార్ సీఈఓ అధిల్ శెట్టి అంటున్నారు. చిన్న చిన్న విషయాలతో ఆర్థిక ప్రణాళికలను ప్రారంభించాలని, ముందుగా కనీసం 3-6 నెలల ఖర్చులకు సరిపడా మొత్తం ఎప్పుడూ మీకు అందుబాటులో ఉండేలా చూసుకోవాలని సూచిస్తున్నారు. ఉద్యోగం చేస్తుంటే మీ వేతన ఖాతా ఉన్న బ్యాంకు నుంచి క్రెడిట్‌ కార్డు తీసుకుని, ఏదైనా కొనుగోలు చేసినప్పుడు రుణంతో కొనుగోలు చేయాలని చెబుతున్నారు. వీటిని క్రమశిక్షణతో చెల్లించాలని, అప్పుడే మీకు క్రెడిట్‌ స్కోరు పెరుగుతుందని అధిల్ శెట్టి అంటున్నారు.

'సొంతంగా తామూ ఒక ఇల్లు కొనాలనే ఆలోచన మహిళల్లో పెరుగుతుందని నివేదికలు చెబుతున్నాయి. ఇంటి కోసం ముందుగా 30-50 శాతం వరకూ పెట్టుబడిని సమకూర్చుకోండి. మిగతాది రుణం తీసుకోవచ్చు. పిల్లల చదువులకు అవసరమైన మొత్తాన్ని జమ చేసేందుకు వీలైనంత తొందరగా పెట్టుబడులు పెట్టండి. మ్యూచువల్‌ ఫండ్లు, సుకన్య సమృద్ధి యోజన, పీపీఎఫ్‌ లాంటి వాటిని ఎంచుకోవాలి. సూచీ ఫండ్లలో నెలకు రూ.5,000 మదుపు చేసేందుకు ప్రయత్నించండి. అప్పుడే 18 ఏళ్లలో 12 శాతం వార్షిక రాబడితో రూ.38లక్షల వరకూ జమ అవుతాయి. అదే ఏటా 10 శాతం పెంచితే రూ.72 లక్షలు చేతికి వస్తాయి. పదవీ విరమణ ప్రణాళికలకు ప్రాధాన్యం ఇవ్వండి. పదవీ విరమణ నాటికి మీ వార్షికాదాయానికి 25 రెట్ల వరకూ మీ చేతిలో ఉండాలి' అని అధిల్ శెట్టి తెలిపారు.

రూ.కోటి ఉద్యోగం వదులుకుని 500మిలియన్ డాలర్ల బిజినెస్- ఎంతో మంది మహిళలకు ఉపాధి- ఎవరీ వినీతాసింగ్?

పేదలకు గుడ్​న్యూస్​- రూ.100 తగ్గిన వంట గ్యాస్ ధర, మహిళలకు మోదీ ఉమెన్స్ డే గిఫ్ట్

ETV Bharat Logo

Copyright © 2025 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.