ETV Bharat / business

చిరు వ్యాపారులకు ఉపయోగపడే టాప్​-5 టూ-వీలర్స్ ఇవే! - Bike For Business Purpose

Bike For Business Purpose : మీరు చిరు వ్యాపారులా? బిజినెస్ కోసం మంచి టూ-వీలర్ కొనాలని అనుకుంటున్నారా? అయితే ఇది మీ కోసమే. ప్రస్తుతం మార్కెట్లో అతి తక్కువ ధరలో, మంచి మైలేజ్​ ఇచ్చే, చిరు వ్యాపారాలకు బాగా ఉపయోగపడే టాప్​-5 టూ-వీలర్స్ గురించి తెలుసుకుందాం.

Fantastic bike for business purpose
TVS BIKE (ETV Bharat)
author img

By ETV Bharat Telugu Team

Published : Jul 16, 2024, 1:35 PM IST

Bike For Business Purpose : చిరు వ్యాపారులకు టూ-వీలర్స్​తో చాలా పని ఉంటుంది. ముఖ్యంగా తమ వ్యాపారానికి అవసరమైన సరకులను, వస్తువులను సులువుగా రవాణా చేయడానికి ఇవి అవసరం అవుతాయి. అందుకే తక్కువ ధరలో, మంచి మైలేజ్ ఇచ్చే టూ-వీలర్​ కొనాలని చాలా మంది ఆశపడుతుంటారు. ఇలాంటి వారిని టార్కెట్ చేసుకుని ప్రముఖ ఆటోమొబైల్ కంపెనీలు చాలా తక్కువ ధరలో, మంచి డ్రైవింగ్ కంఫర్ట్ ఉండే బైక్స్​ను మార్కెట్లోకి విడుదల చేశాయి. వాటి గురించి ఇప్పుడు వివరంగా తెలుసుకుందాం.

1. Kinetic Green E-Luna : భారతదేశంలో అత్యంత ఆదరణ పొందిన ద్విచక్ర వాహనాల్లో కెనటిక్ లూనా ఒకటి. తక్కువ బరువుతో, మంచి మైలేజ్​తో ఇది వస్తుంది. వస్తువులను రవాణా చేయడానికి కూడా ఇది ఎంతో బాగుంటుంది. అందుకే ఈ కంపెనీ ఇప్పుడు ఎలక్ట్రిక్​ బైక్​ను కూడా మార్కెట్లోకి తెచ్చింది. అదే కెనటిక్ గ్రీన్ ఈ-లూనా.

కెనటిక్ గ్రీన్ ఈ-లూనా కేవలం 3-4 గంటల్లోనే ఫుల్ ఛార్జ్ అవుతుంది. గంటకు 52 కి.మీ వేగంతో వెళుతుంది. దీని రేంజ్​ 90 కి.మీ. కనుక చిరువ్యాపారులకు చాలా ఉపయోగకరంగా ఉంటుంది. ఈ కెనటిక్ గ్రీన్ ఈ-లూనా 2 వేరియంట్లలో, 5 రంగుల్లో లభిస్తుంది.

Kinetic Green E-Luna Price :

  • కెనటిక్ గ్రీన్ ఈ-లూనా X1 ధర రూ.69,990 (ఎక్స్​-షోరూం) ఉంటుంది.
  • కెనటిక్ గ్రీన్ ఈ-లూనా X2 ధర రూ.79,990 (ఎక్స్​-షోరూం) ఉంటుంది.

2. TVS XL 100 Comfort : భారత మార్కెట్లో ఉన్న మరో మంచి టూ-వీలర్​ 'టీవీఎస్ ఎక్స్ఎల్​ 100 కంఫర్ట్'. రూ.50,000 లోపు మంచి బైక్ కొనాలని అనుకునేవారికి ఇది బెస్ట్ ఛాయిస్ అని చెప్పుకోవచ్చు. ఈ టీవీఎస్​ బండి బ్లూ, బ్రౌన్ కలర్లలో లభిస్తుంది. దీని బాడీ చాలా స్ట్రాంగ్​గా ఉంటుంది. కనుక గతుకల రోడ్లపై కూడా ఎంత లోడ్​తో అయినా హాయిగా వెళ్లిపోవచ్చు.

TVS XL 100 Comfort Features :

  • ఇంజిన్ కెపాసిటీ : 99.7 సీసీ
  • మైలేజ్​ : 55 కి.మీ/ లీటర్​
  • ట్రాన్స్​మిషన్​ : ఆటోమేటిక్​
  • కెర్బ్​ వెయిట్​ : 86 కేజీలు
  • ఫ్యూయెల్ ట్యాంక్ కెపాసిటీ : 4 లీటర్లు

TVS XL 100 Comfort Price : ఈ బండిలో రెండు వేరియంట్లు ఉన్నాయి. వాటి ధరలు ఎలా ఉంటాయంటే?

  • టీవీఎస్​ 100 కంఫర్ట్​ కిక్ స్టార్ట్​ ధర రూ.46,714 (ఎక్స్​-షోరూం ధర) ఉంటుంది.
  • టీవీఎస్​ 100 కంఫర్ట్​ ఐ-టచ్​ స్టార్ట్​ ధర రూ.60,728 (ఎక్స్​-షోరూం ధర) ఉంటుంది

3. TVS XL 100 Heavy Duty : హైవీ లోడ్స్​ తీసుకెళ్లే చిరు వ్యాపారులకు ఈ టీవీఎస్​ బండి చాలా అనుకూలంగా ఉంటుంది. పైగా దీని ధర చాలా తక్కువ. ఇది హెవీ డ్యూటీ బండి కనుక గతుకుల రోడ్లపై కూడా, ఎంత లోడ్​నైనా చాలా ఈజీగా తీసుకెళ్లవచ్చు. కేటరింగ్, లాజిస్టిక్స్ బిజినెస్ చేసేవారికి, చిన్న చిన్న కిరాణా షాపులు నడిపేవారికి ఇది చాలా ఉపయోగకరంగా ఉంటుంది. దీనిని మెయింటైన్​ చేయడం కూడా చాలా సులువు.

TVS XL 100 Heavy Duty Features :

  • ఇంజిన్ కెపాసిటీ : 99.7 సీసీ
  • మైలేజ్​ : 52 కి.మీ/ లీటర్​
  • ట్రాన్స్​మిషన్​ : ఆటోమేటిక్​
  • కెర్బ్​ వెయిట్​ : 88 కేజీలు
  • ఫ్యూయెల్ ట్యాంక్ కెపాసిటీ : 4 లీటర్లు

TVS XL 100 Heavy Duty Price : ఇది 4 వేరియంట్లలో లభిస్తుంది. వాటి ధరలు ఎలా ఉన్నాయంటే?

  • టీవీఎస్​ 100 హెవీ డ్యూటీ కిక్ స్టార్ట్​ ధర రూ.44,133 (ఎక్స్​-షోరూం ధర) ఉంటుంది.
  • టీవీఎస్​ 100 హెవీ డ్యూటీ ఐ-టచ్​ స్టార్ట్​-ఎస్​ఈ​ ధర రూ.50,043 (ఎక్స్​-షోరూం ధర) ఉంటుంది.
  • టీవీఎస్​ 100 హెవీ డ్యూటీ ఐ-టచ్​ స్టార్ట్​ ధర రూ.57,801 (ఎక్స్​-షోరూం ధర) ఉంటుంది.
  • టీవీఎస్​ 100 హెవీ డ్యూటీ విన్నర్ ఎడిషన్​​ ధర రూ.60,991 (ఎక్స్​-షోరూం ధర) ఉంటుంది.

4. Okinawa Dual-100 : కెనటిక్ లూనాకు పోటీగా వచ్చిన ఎలక్ట్రిక్​ బైక్ ఇది. ఈ కమర్షియల్ వెహికల్ సింగిల్ వేరియంట్​లో మాత్రమే లభిస్తుంది.

  • రేంజ్​ - 129 కి.మీ/ ఛార్జ్​
  • బ్యాటరీ కెపాసిటీ - 3.12 కిలోవాట్​
  • టాప్​ స్పీడ్​ - 60 కి.మీ/ గంట
  • మోటార్ పవర్​ - 3 కిలోవాట్స్​
  • బ్యాటరీ వారెంటీ - 3 సంవత్సరాలు
  • మోటార్​ - బీఎల్​డీసీ

Okinawa Dual-100 Price : మార్కెట్లో ఈ ఒకినావా డ్యూయల్-100 ధర సుమారుగా రూ.1,19,085 (ఎక్స్​-షోరూం) ఉంటుంది.

5. Odysse Trot : భారతదేశంలో అందుబాటులో ఉన్న మరో కమర్షియల్ వెహికల్​ ఒడిస్సే ట్రోట్​. దీనిని మంచి యుటిలిటేరియన్ డిజైన్​తో రూపొందించారు.

  • రేంజ్​ - 75 కి.మీ/ ఛార్జ్​
  • స్పీడ్​ - 25 కి.మీ/ గంట
  • కెర్బ్​ వెయిట్​ - 110 కేజీలు
  • బ్యాటరీ ఛార్జింగ్ టైమ్ - 4 గంటలు

Odysse Trot Price : మార్కెట్లో ఈ ఒడిస్సే ట్రోట్​ ధర సుమారుగా రూ.99,999 (ఎక్స్​-షోరూం) ఉంటుంది.

జోరు పెంచుతున్న మారుతి సుజుకి - వరుసగా 12 కార్లు లాంఛ్ చేసేందుకు సిద్ధం! - Upcoming Maruti Cars In India

వర్షాకాలంలో ఉపయోగపడే టాప్​-10 కార్​ & బైక్ డ్రైవింగ్​ టిప్స్ ఇవే! - Monsoon Driving Tips

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.