ETV Bharat / business

ఆస్తి కొంటున్నారా? ఈ 10 విషయాలు తెలుసుకోవడం మస్ట్! లేకుంటే ఇక అంతే! - Property Buying Tips - PROPERTY BUYING TIPS

Factors To Keep In Mind While Buying Property : ఏ ఆస్తి అయినా కొనే ముందు, అమ్మే వారికి ఉన్న హక్కులు గురించి తెలుసుకోవాలి. అలాగే వారి వద్ద ఉన్న యాజమాన్యాన్ని నిరూపించే పత్రాలు చూడాలి. ఇంకా ఆస్తి కొనేటప్పుడు ఏయే విషయాలు తెలుసుకోవాలో ఇప్పుడు చూద్దాం.

Check Legal Documents Before Buying A Property
Buying a house? 10 things to keep in mind (ETV Bharat)
author img

By ETV Bharat Telugu Team

Published : Jun 30, 2024, 1:14 PM IST

Factors To Keep In Mind While Buying Property : ఆస్తులు కొనేటప్పుడు 'రిజిస్ట్రేషన్​' చేసుకోవడం తప్పనిసరి. అందుకే అందరూ స్టాంప్​ కాగితాల మీద రాసిన దస్తావేజును రిజిస్ట్రేషన్​ చేసుకుంటారు. తరువాత తమకు సర్వ హక్కులు వచ్చినట్టు భావిస్తారు. అయితే నిజంగానే దీనికి తిరుగులేదా? ఒక్కసారి ఆస్తి మీ పేరున రిజిస్ట్రేషన్​ చేయించుకుంటే, దాని గురించి ఆలోచించాల్సిన పని లేదా? అనేది తెలుసుకుందాం.

1. న్యాయపరమైన చిక్కులు
ఆస్తి కొనడం, దాన్ని మన పేరు మీదకి మార్పించుకోవడమనేది అనుకున్నంత తేలికైన వ్యవహారం కాదు. న్యాయపరమైన చిక్కులు వచ్చినప్పుడు కానీ తెలియదు అందులో ఎన్ని లోటుపాట్లు ఉన్నాయో!

మీ పేరున రిజిస్టర్​ అయిన స్థలం, మరొకరి పేరుపై కూడా రిజిస్టర్ అయ్యుండవచ్చు. లేదా మీ స్థలాన్ని ఇతరులు కబ్జా చేయవచ్చు. లేదా ఆ స్థలంతో ఏమాత్రం సంబంధంలేని వ్యక్తులు మీపై దావా వేయవచ్చు. ఇలాంటి క్లిష్ట పరిస్థితులు వచ్చినప్పుడు వ్యవస్థను నిందించడం వల్ల ఎలాంటి ఫలితం ఉండదు. అందుకే ఆస్తి కొనేటప్పుడే తగు జాగ్రత్తలు తీసుకోవాలి.

2. అమ్మేవారికి అన్ని హక్కులు ఉన్నాయా?
ఆస్తులు కొనాలనుకునే చాలా మంది సదరు స్థలం/ ప్లాట్​ ధర గురించి మాత్రమే ఆలోచిస్తారు. కానీ అమ్మేవారి హక్కుల గురించి తెలుసుకోరు. ఇక్కడ గమనించాల్సిన విషయం ఏమిటంటే, అధిక ధర పెట్టి కొన్నంత మాత్రాన ఆ ఆస్తి మనకు సొంతం అయిపోతుందని చెప్పలేం. ఇందుకంటే, చాలా సార్లు ఆస్తులపై తగిన హక్కులు లేనివారు, మోసపూరితంగా ఇతరులకు వాటిని అమ్మేస్తుంటారు. అందుకే అమ్మేవారికి సదరు ఆస్తిపై పూర్తి హక్కులు ఉన్నాయో, లేదో ముందుగానే తెలుసుకోవాలి.

3. అమ్మే హక్కు ఉందా?
ఏ ఆస్తి అయినా కొనే ముందు, అమ్మే వారికి అన్ని హక్కులు ఉన్నాయో, లేదో చెక్ చేసుకోవాలి. ఇందుకోసం కొన్ని ప్రశ్నలు వేయాలి. అవి ఏమిటంటే?

  • అమ్ముతున్న వారికి సదరు ఆస్తి ఎలా వచ్చింది?
  • వారసత్వం అయితే వారసులు అందరూ సంతకాలు పెడుతున్నారా?
  • మైనర్లు ఉంటే కోర్టు అనుమతి తీసుకున్నారా?
  • తండ్రి/తల్లి/ సంరక్షకులు తమ అధికార పరిధిలోనే వ్యవహరిస్తున్నారా?
  • ఇతర హామీలు ఏవైనా ఇస్తారా?
  • అసలు యజమాని నుంచి అమ్మేవారికి హక్కులు సరిగ్గానే సంక్రమించాయా?
  • అమ్మేవాళ్లు చూపించిన రిజిస్టర్డ్​ దస్తావేజులు సరైనవేనా?
  • సదరు ఆస్తిని ఎక్కడైనా తనఖా పెట్టారా?
  • ఆస్తి ఇంతకు ముందే ఎవరికైనా అమ్మరా?
  • ప్రభుత్వం/ప్రభుత్వ సంస్థలకు చెందిన ఆస్తా? లేదా ప్రభుత్వ సంస్థలు ఆ భూమిని తీసుకునే అవకాశం ఉందా?
  • సదరు ఆస్తిపై ఏమైనా దావాలు, తగాదాలు ఉన్నాయా?
  • నిర్మాణాలకు, ఇళ్ల స్థలాలకు సరైన అనుమతులు ఉన్నాయా?
  • ఆస్తులు ఎవరి స్వాధీనంలో ఉన్నాయి?

ఇలాంటి అనేక విషయాలు కచ్చితంగా వాకబు చేయాలి. ఎలాంటి మొహమాటం లేకుండా సదరు ఆస్తికి సంబంధించిన అన్ని పత్రాలను అడగి చూడాలి. వాటిని అనుభవజ్ఞులైన న్యాయవాదులకు చూపించి, తగిన సలహాలు తీసుకోవాలి. ఆ తరువాతనే సదరు ఆస్తి కొనాలా? లేదా? అనేది నిర్ణయించుకోవాలి. కొనాలనుకుంటే, సరైన రైటర్​తో దస్తావేజును రాయించుకోవాలి.

4. సమస్యలేమీ ఉండవా?
ఆస్తుల కొనుగోలు విషయంలో అన్ని జాగ్రత్తలు తీసుకున్నప్పటికీ, సమస్యలు ఏమీ రావని కచ్చితంగా చెప్పడానికి వీలుండదు. కాకపోతే అనవసర సమస్యలు ఎక్కువగా రాకుండా ఉంటాయి. పైగా చట్టం మీకు అదనపు రక్షణ కల్పిస్తుంది. అంటే, మీరు సొమ్ము చెల్లించి ఆస్తి కొన్నారు కాబట్టి, నిజాయతీగా ఆస్తి పొందిన వ్యక్తిగా మిమ్మల్ని న్యాయస్థానాలు పరిగణిస్తాయి. మీ హక్కులను కాపాడతాయి.

5. అది ఎప్పుడంటే?

  • మీరు కచ్చితంగా డబ్బు లేదా ప్రతిఫలం ఇచ్చి ఆస్తి పొందినవారు అయ్యుండాలి.
  • ఆస్తిపై ఇతరులకు ఉన్న హక్కులు గురించి మీకు తెలిసి ఉండకూడదు.

ఈ రెండింటిలో ఏది వర్తించకపోయినా, మీరు సదుద్దేశంతో ఆస్తి కొన్న వారు కాదని న్యాయస్థానాలు భావిస్తాయి. తెలిసి ఉండటం అంటే నోటీసు కలిగి ఉండటం అని అర్థం. చట్టం దీన్ని చాలా స్పష్టంగా, విపులంగా విశదీకరించి చెప్పింది. మనకున్న హక్కుల్ని కాదని, ఎవరైనా మన ఆస్తి అమ్మాలని కానీ, ఇతరులకు బదిలీ చేయాలని గానీ ప్రయత్నిస్తే, కొనేవాళ్లకు నేరుగా గానీ, పత్రికా ముఖంగా గానీ తెలియజేయాలి. ఒక ఆస్తిని మనం కొనాలనుకున్నా, పత్రికా ముఖంగా ప్రకటన ఇవ్వవచ్చు. ఇవన్నీ మన సదుద్దేశాన్ని చూపించే చర్యలు అవుతాయి. మన హక్కుల్ని చెప్పినా లెక్క చేయకుండా ఎవరైనా కొన్నారనుకోండి, మనం చేపట్టే చర్యలకు వాళ్లు బాధ్యులు అవుతారు. అమాయకపు నటన చేయడానికి వీలుండదు. కోర్టు తుది ఉత్తర్వు (డిక్రీ)లకు లోబడే అన్ని లావాదేవీలు ఉంటాయని మనం గమనించాలి.

6. బుకాయించినంత మాత్రాన ఫలితం ఉండదు!
చాలా మంది తెలిసి కూడా, తెలియదని బుకాయిస్తుంటారు. అయితే ఎదురుగా ఉన్న దాన్ని తెలియదని బుకాయిస్తే చట్టం ఒప్పుకోదు. అది ఎలా అంటే?

7. కావాలని వాకబు చేయకపోవడం!
స్థిరాస్తికి సంబంధించిన వివరాలను కచ్చితంగా ముందే తెలుసుకోవాలి. రిజిస్టరు దస్తావేజులను, రెవెన్యూ రికార్డులను పరిశీలించాలి. అది మీ బాధ్యత. ఒక వేళ మీరు పొరపాటున తెలుసుకోకపోయినా, అది మీకు తెలిసినట్టే చట్టం భావిస్తుంది. మీకు వచ్చిన రిజిస్టర్​ కవర్ మీరు తీసుకోకుండా తిరిగి పంపించినా, అందులోని విషయాలు మీకు తెలిసినట్టే కోర్టు భావిస్తుంది.

8. నిర్లక్ష్యం
మీరు నిర్లక్ష్యంగా ఉండడం, అనుమానం ఉన్నా దానిని విస్మరించడం లాంటివి చేస్తే, అది మీ తప్పే అవుతుంది. ఉదాహరణకు, మీరు చూసిన దస్తావేజుల్లో కోర్టు సీలు ఉందనుకోండి. అది ఎందుకు వచ్చిందో, ఆ దావా సంగతులు ఏమిటో, ఉత్తర్వులు ఏమిటో, దరిమిలా ఆ హక్కులు ఎవరికి ఉన్నాయో తెలుసుకోవాలి. ఇవేవీ నాకు తెలీదు అంటే కుదరదు.

9. రిజిస్టరు దస్తావేజులు
రిజిస్టర్ అయ్యి, ఇండెక్స్​ పుస్తకాల్లో పొందుపర్చిన అంశాలను ప్రతి వ్యక్తీ తెలుసుకున్నట్టే చట్టం భావిస్తుంది. అందుకే రిజిస్ట్రార్ ఆఫీసులో ఇచ్చే మొక్కుబడి పుస్తకాల మీద ఆధార పడకూడదు. ఇండెక్స్ పుస్తకాల్ని కచ్చితంగా పరిశీలించాలి.

10. స్వాధీనం
ఆస్తి ఎవరి స్వాధీనంలో ఉందో, ఆ వ్యక్తికి ఉన్న హక్కుల్ని గురించి తెలుసుకోవాలి. ఎందుకంటే, అలాంటి వ్యక్తులకు యాజమాన్య హక్కుల పురోభావన ఉంటుంది. అందుకే, ఎవరి స్వాధీనంలో ఉన్నా, వారి హక్కుల గురించి విచారణ చేయాల్సి ఉంటుంది.

ఫిక్స్​డ్​ Vs ఫ్లోటింగ్ హోమ్ లోన్ వడ్డీ రేటు - వీటిలో ఏది బెస్ట్ ఆప్షన్​? - How To Choose Best Home Loan

రూ.7 లక్షల్లో మంచి మైలేజ్​ ఇచ్చే కారు కొనాలా? టాప్​-10 మోడల్స్​ ఇవే! - Best Cars Under 7 Lakh

ETV Bharat Logo

Copyright © 2025 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.