ETV Bharat / business

ప్లాట్‌ లేదా ఫ్లాట్‌ కొనాలా? తప్పనిసరిగా చెక్‌ చేయాల్సిన డాక్యుమెంట్స్‌ ఇవే! - Property Documents Checklist - PROPERTY DOCUMENTS CHECKLIST

Property Documents Checklist : మీరు భూమి, ఫ్లాట్‌ను కొనుగోలు చేయాలని అనుకుంటున్నారా? అయితే ఈ ఇది కోసమే. ఆస్తి కొనుగోలు చేసేటప్పుడు తప్పకుండా పరిశీలించాల్సిన పత్రాలు ఏమిటో ఈ ఆర్టికల్‌ ద్వారా తెలుసుకుందాం.

Real Estate
List of Documents Required for Buying a Property (ETV Bharat)
author img

By ETV Bharat Telugu Team

Published : Aug 17, 2024, 12:52 PM IST

Property Documents Checklist : ప్రస్తుత కాలంలో రియల్ ఎస్టేట్ రంగం బాగా వృద్ధి చెందుతోంది. వివాదాలు కూడా అలానే పెరుగుతున్నాయి. ముఖ్యంగా ప్లాట్‌ (స్థలం), ఫ్లాట్‌ల కొనుగోలు సమయంలో చాలా వివాదాలు తలెత్తుతున్నాయి. మరీ ముఖ్యంగా రిజిస్ట్రేషన్ సమయంలో చాలా ఇబ్బందులు ఎదురవుతున్నాయి. అందుకే ఆస్తి కొనుగోలు చేసేటప్పుడు తప్పకుండా పరిశీలించాల్సిన 17 రకాల డాక్యుమెంట్స్ గురించి ఈ ఆర్టికల్‌లో తెలుసుకుందాం.

  1. టైటిల్ డీడ్ : టైటిల్‌ డీడ్‌ అంటే యాజమాన్య ధ్రువీకరణ పత్రం. ఆస్తికి సంబంధించి యజమానికి ఉన్న చట్టపరమైన హక్కును ఇది తెలియజేస్తుంది. ఇల్లు, స్థలం, వ్యవసాయ భూమి ఇలా ఏ స్థిరాస్తి కొనుగోలు చేసినా, ఆస్తి యాజమాన్య హక్కులను కొనుగోలుదారునికి బదిలీ చేయడంలో టైటిల్‌ డీడ్‌ ముఖ్య పాత్ర పోషిస్తుంది.
  2. మదర్ డీడ్ : మదర్ డీడ్ అనేది ఆస్తి మూలాన్ని కనుక్కోవడానికి ఉపయోగపడుతుంది. ఆస్తి ప్రస్తుత యజమాని నుంచి పాత యజమాని వరకు మొత్తం వివరాలను తెలుసుకోవచ్చు. మదర్ డీడ్‌ అనేది ఆస్తి యాజమాన్య చరిత్రను తెలుసుకోవడానికి ఉపయోగపడుతుంది.
  3. ఎన్‌కంబరెన్స్ సర్టిఫికెట్ : ఎన్‌కంబరెన్స్ సర్టిఫికెట్ ఆస్తికి సంబంధించిన అన్ని ఆర్థిక లావాదేవీల సమగ్ర రికార్డుగా పనిచేస్తుంది. మీరు కొనుగోలు చేయబోయే ఆస్తిపై తనఖాలు, తాత్కాలిక హక్కులు లేదా చట్టపరమైన దావాలు లాంటివి ఉంటే, ఈ ఎన్‌కంబరెన్స్ సర్టిఫికెట్ ద్వారా వాటి గురించి తెలుసుకోవచ్చు. ఈ పత్రానికి చట్టపరంగా ప్రాముఖ్యత ఉంటుంది.
  4. ప్రాపర్టీ ట్యాక్స్ రిసిప్ట్స్ : ఆదాయ పన్ను చట్టం ప్రకారం ఇల్లు, భవనం, కార్యాలయం, గోదాం, స్థలాలను ప్రోపర్టీగానే పరిగణిస్తారు. అందుకే విక్రేత నుంచి ప్రాపర్టీ ట్యాక్స్ రసీదులను అడిగి, వాటిని జాగ్రత్తగా పరిశీలించండి. అన్ని పన్నులు సకాలంలో చెల్లించినట్లైతే ఏం ఇబ్బంది లేదు. లేకుంటే వాటిని క్లియర్ చేయమని చెప్పాలి.
  5. అప్రూవ్డ్ బిల్డింగ్ ప్లాన్ : హౌసింగ్ సొసైటీలలో అపార్ట్‌మెంట్ నిర్మాణం చేయాలంటే, బిల్డర్ - బిల్డింగ్ ప్లాన్ కోసం స్థానిక మున్సిపల్ లేదా డెవలప్‌మెంట్ అథారిటీ అప్రూవల్ తీసుకోవాలి. ఈ ఆమోదం నిర్మాణ మార్గదర్శకాలు, నిబంధనలకు కట్టుబడి నిర్మాణం చేశారో, లేదో తెలియజేస్తుంది.
  6. కంప్లీషన్ సర్టిఫికెట్ : కొత్తగా నిర్మించిన అపార్ట్‌మెంట్‌కు, బిల్డర్ లేదా డెవలపర్ సంబంధిత అథారిటీ నుంచి కంప్లీషన్ సర్టిఫికెట్ పొందారో, లేదో వెరిఫై చేయండి. అప్రూవల్ ప్లాన్‌కు అనుగుణంగా భవనం నిర్మించారో, లేదో ఈ సర్టిఫికెట్‌ తెలియజేస్తుంది.
  7. ఆక్యుపెన్సీ సర్టిఫికెట్ : ఆక్యుపెన్సీ స‌ర్టిఫికెట్‌ను స్థానిక అధికారులు జారీచేస్తారు. ఒక భ‌వ‌నం దానికి నిర్ధేశించిన ప‌రిధిలో, ఆమోదించిన ప్ర‌ణాళిక ప్ర‌కారం, స్థానిక చ‌ట్టాల‌కు అనుగుణంగా నిర్మిత‌మైందా, లేదా అనే అంశాల ద్వారా ఈ స‌ర్టిఫికెట్‌ను జారీ చేస్తారు.
  8. నో అబ్జెక్షన్ సర్టిఫికెట్‌ : ఆస్తి ఉన్న ప్రదేశం, రకాన్ని బట్టి సొసైటీ లేదా బిల్డర్ ఎన్ఓసీ సర్టిఫికెట్లు తీసుకోవాలి.
  9. పవర్ ఆఫ్ అటార్నీ : మీరు పవర్ ఆఫ్ అటార్నీ పొందిన వ్యక్తి నుంచి ఆస్తి కొనుగోలు చేస్తుంటే, ఒక విషయం కచ్చితంగా గుర్తుంచుకోవాలి. పవర్ ఆఫ్ అటార్నీ పత్రం ప్రామాణికత, చెల్లుబాటును నిర్ధరణ చేసుకోవాలి. లేకుంటే చట్టపరమైన సమస్యలు ఎదురవుతాయి.
  10. సేల్ అగ్రిమెంట్ : కొనుగోలుదారుడు, విక్రేత ఇద్దరూ కలిసి సేల్ డీడ్ అగ్రిమెంట్‌ను చేసుకుంటారు. ఇందులో ఆస్తి విక్రయ ధర, చెల్లింపు షెడ్యూల్, స్వాధీనం తేదీ, తదితర వివరాలు ఉంటాయి.
  11. పట్టా & చిట్టా : పట్టా అనేది ఆస్తికి చట్టపరమైన యాజమాన్యాన్ని కల్పించే అధికారిక పత్రం. చిట్టా అనేది ఆస్తి సరిహద్దులు, యాజమాన్య సమాచారం, పన్ను మదింపు వంటి ముఖ్యమైన వివరాలను కలిగి ఉన్న ప్రభుత్వం నిర్వహించే రికార్డు.
  12. బ్యాంక్ రిలీవింగ్ లెటర్ : కొందరు ఆస్తిని లేదా భూమిని బ్యాంకులో తాకట్టు పెట్టి లోన్ తీసుకుంటారు. అయితే లోన్ బాకీ కట్టేశాక బ్యాంకుకు రుణం చెల్లించేశారని, ఎటువంటి బకాయి లేరని పేర్కొంటూ బ్యాంకు నుంచి ఒక రిలీవింగ్ లెటర్‌ను పొందాల్సి ఉంటుంది.
  13. సొసైటీ డాక్యుమెంట్స్ : అపార్ట్‌మెంట్‌ను కొనుగోలు చేసేటప్పుడు షేర్ సర్టిఫికెట్, సొసైటీ రిజిస్ట్రేషన్ సర్టిఫికెట్, మెయింటెనెన్స్ బిల్లులు, సొసైటీ ఎన్‌ఓసీ సహా సొసైటీ డాక్యుమెంట్‌లను పరిశీలించాలి.
  14. కరెంట్‌ బిల్లులు : అపార్ట్‌మెంట్ లేదా సైట్‌లో విద్యుత్ వాడినందుకు నెలకొకసారి కరెంట్ బిల్లు వస్తుంది. ఈ బిల్లులు విద్యుత్ వినియోగానికి సాక్ష్యంగా పనికొస్తాయి. విక్రేత సరైన విద్యుత్ కనెక్షన్‌ను కలిగి ఉన్నారో, లేదో ధ్రువీకరించడానికి ఇది ఉపయోగపడుతుంది.
  15. రసీదులు : ఆస్తి కొనుగోలుకు సంబంధించిన రసీదులు, చెల్లింపు రసీదులు, ముందస్తు చెల్లింపులు, వాయిదాల రసీదులు వంటివి కొనుగోలుదారుడు, విక్రేత మధ్య జరిగిన ఆర్థిక లావాదేవీలకు రుజువుగా ఉపయోగపడే పత్రాలుగా ఉంటాయి.
  16. మెయింటెనెన్స్ బకాయిలు : బిల్డింగ్ సొసైటీ లేదా రెసిడెన్షియల్ కాంప్లెక్స్‌లోని ఫ్లాట్‌కు లేదా ఆస్తికి మెయింటెనెన్స్ ఛార్జీలు కట్టాల్సి ఉంటుంది. విక్రేత వీటిని కట్టారో, లేదో కచ్చితంగా మీరు తెలుసుకోవాలి.
  17. కీస్ : యాజమాన్యాన్ని నిర్ధరణ చేసుకోవడానికి, ప్రధాన ప్రవేశ ద్వారానికి చెందిన తాళం, గేట్ తాళం, ఇలా ఆస్తికి సంబంధించిన తాళాలు అన్నింటినీ మీరు ముందుగానే తీసుకోవాలి.

నోట్‌ : విధంగా అన్ని పత్రాలను, అంశాలను సమగ్రంగా పరిశీలించన తర్వాత మాత్రమే ఆస్తిని కొనుగోలు చేయాలి. ఈ ఆర్టికల్‌లో చెప్పిన అంశాలు కేవలం మీ అవగాహన కోసం మాత్రమే. సమగ్రమైన సమాచారం కోసం రియల్ ఎస్టేట్ నిపుణులను, న్యాయ నిపుణులను సంప్రదించడం మంచిది.

'పన్ను చెల్లింపుదారులకు అలర్ట్ - ఫేక్ కాల్స్, మెసేజ్‌ల పట్ల జర జాగ్రత్త' - ఐటీ శాఖ హెచ్చరిక - ITR Refund Scam

రూ.2లక్షల్లో మంచి టూ-వీలర్​ కొనాలా? త్వరలో లాంఛ్ కానున్న టాప్-10 మోడల్స్ ఇవే! - Upcoming Bikes Under 2 Lakh

ETV Bharat Logo

Copyright © 2025 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.