ETV Bharat / business

50 ఏళ్లకే పెన్షన్​ - రిటైర్​మెంట్​ వరకు ఆగాల్సిన పనిలేదు - ఈ EPS రూల్​ మీకు తెలుసా? - EPS Pension Rules - EPS PENSION RULES

EPS Pension Rules : మీరు ఈపీఎఫ్ ఖాతాదారులా? అయితే ఇది మీ కోసమే. ఈపీఎఫ్​ ఖాతాదారులకు 58 ఏళ్లు నిండిన తరువాత పెన్షన్ రావడం సహజమే. అయితే మీరు కోరుకుంటే 50 ఏళ్లకే పెన్షన్ పొందవచ్చు. అది ఎలాగంటే?

pension
pension (ETV Bharat)
author img

By ETV Bharat Telugu Team

Published : Sep 4, 2024, 3:33 PM IST

EPS Pension Rules : ఎంప్లాయీస్ ప్రావిడెంట్ ఫండ్​ ఆర్గనైజేషన్​ (ఈపీఎఫ్​ఓ) 1995 నవంబర్​లో 'ఎంప్లాయీస్​ పెన్షన్​ స్కీమ్​ 95' (EPS 95) స్కీమ్​ను లాంఛ్ చేసింది. దీనిని ప్రధానంగా ప్రైవేట్ కంపెనీల్లో పనిచేసే ఉద్యోగుల కోసం తీసుకురావడం జరిగింది. ఈపీఎస్​ స్కీమ్​లో చేరిన వారికి 58 ఏళ్లు పూర్తయిన తరువాత పెన్షన్ వస్తుంది. కానీ మీరు కోరుకుంటే 50 ఏళ్లకే పెన్షన్ పొందే ఛాన్స్ ఉంది. అది ఎలాగంటే?

ఒక వ్యక్తి ఉద్యోగంలో చేరిన తరువాత ఈపీఎఫ్ ఖాతా ఓపెన్ చేయవచ్చు. ఈపీఎఫ్​ ఖాతాలో యాజమాన్యం వాటాగా ఉద్యోగి బేసిక్​ సాలరీ+ డియర్​నెస్​ అలవెన్స్​లో 12 శాతాన్ని జమ చేయడం జరుగుతుంది. దాదాపు ఇంతే మొత్తాన్ని ఉద్యోగి కూడా చెల్లించాల్సి ఉంటుంది. ఇక్కడ ఉద్యోగి చెల్లించిన సొమ్ము మొత్తం ప్రావిడెంట్ ఫండ్​కి జమ అవుతుంది. కానీ ఈపీఎఫ్ఓ నియమాల ప్రకారం, యాజమాన్యం చెల్లించిన 12 శాతం కంట్రిబ్యూషన్​లో 3.67 శాతం ప్రావిడెంట్ ఫండ్​లోకి జమ అవుతుంది. మిగతా 8.33 శాతం ఎంప్లాయీస్ పెన్షన్ స్కీమ్​లోకి వెళుతుంది. మీరు రిటైర్ అయిన తరువాత ఈ ఈపీఎస్​ కార్పస్​ నుంచే మీకు పెన్షన్ అందిస్తారు.

కండిషన్స్ వర్తిస్తాయి!
ఈపీఎస్​ కింద మీకు పెన్షన్ రావాలంటే, మీరు కనీసం 10 ఏళ్లపాటు ఉద్యోగం చేసి ఉండాలి. అప్పుడే మీరు మినిమం పెన్షన్ పొందడానికి అర్హులు అవుతారు. ప్రస్తుతం ఉన్న నిబంధనల ప్రకారం, ఒక ఉద్యోగి కనిష్ఠంగా రూ.1000 నుంచి గరిష్ఠంగా రూ.7500 వరకు పెన్షన్ పొందే అవకాశం ఉంది.

పెన్షన్​ కాలిక్యులేషన్​
కనీసం 10 ఏళ్లు సర్వీస్​ చేసిన ఉద్యోగి ఈపీఎఫ్ ఎర్లీ పెన్షన్ పొందడానికి అవకాశం ఉంటుంది. అయితే సదరు ఉద్యోగి వయస్సు 50-58 ఏళ్ల మధ్య ఉండాలి. 50 ఏళ్ల కంటే తక్కువ వయస్సున్నవారు పెన్షన్ పొందడానికి వీలుండదు.

ఇక్కడ గుర్తుంచుకోవాల్సిన అంశం ఏమింటే? 58 ఏళ్ల కంటే ముందే మీరు పెన్షన్ తీసుకోవాలని అనుకుంటే, మీకు వచ్చే పింఛన్​ ఒక్కో ఏడాదికి 4 శాతం చొప్పున తగ్గుతుంది. ఉదాహరణకు మీరు 57 ఏళ్ల వయస్సులో పెన్షన్ తీసుకోవాలంటే 4 శాతం పింఛన్ తగ్గుతుంది. అదే మీరు 56 ఏళ్ల వయస్సులోనే పింఛన్ తీసుకోవాలంటే 4%+4% పెన్షన్ తగ్గుతుంది. ఇలా మీకు వచ్చే పెన్షన్ బాగా తగ్గిపోతూ ఉంటుంది.

ఒక వేళ మీరు 60 ఏళ్ల తరువాత పింఛన్ తీసుకోవాలని నిర్ణయించుకుంటే, ఏడాదికి 4 శాతం చొప్పున మీకు వచ్చే పెన్షన్ పెరుగుతుంది.

Types Of EPS Pensions
ఈపీఎస్ స్కీమ్​లో అనేక రకాల పెన్షన్​లు ఉంటాయి. అవి:

  • వితంతు పింఛన్​ (విడో పెన్షన్​​)
  • పిల్లల పింఛన్​ (చైల్డ్ పెన్షన్)​
  • అనాథ పింఛన్​ (ఆర్ఫన్ పెన్షన్​)

ఈపీఎఫ్​ చందాదారుడు మరణిస్తే అతని భార్యకు వితంతు పింఛన్ ఇస్తారు. అతని పిల్లలకు చైల్డ్​ పెన్షన్ అందిస్తారు. ఒక వేళ చందాదారుడు, అతని భార్య ఇద్దరూ మరణిస్తే, వారి పిల్లలకు అనాథ పింఛన్​ లభిస్తుంది.

How To Check Your EPS Amount?

  • ముందుగా మీరు EPFO అధికారిక వెబ్​సైట్ ఓపెన్ చేయాలి.
  • Services సెక్షన్​లోకి వెళ్లి, డ్రాప్​డౌన్​ మెనూలోని For Employees ఆప్షన్​పై క్లిక్ చేయాలి.
  • Member Passbookపై క్లిక్​, UAN వివరాలు నమోదు చేసి లాగిన్ కావాలి.
  • తరువాత Passbookపై ట్యాప్​ చేసి, మీ 'మెంబర్ఐ డీ'ని సెలెక్ట్ చేసుకోవాలి.
  • వెంటనే Passbook Overviewలో మీ ఈపీఎస్​ ఖాతాలో ఎంత డబ్బు ఉందో కనిపిస్తుంది.
  • మీరు కావాలని అనుకుంటే పీడీఎఫ్ ఫార్మాట్​లో దీనిని డౌన్​లోడ్​ చేసుకోవచ్చు కూడా.

ప్రైవేట్​ ఉద్యోగులకు గుడ్ న్యూస్ - ఇకపై ఈజీగా EPS విత్​డ్రా - సర్వీస్​ లేకపోయినా నో ప్రోబ్లమ్​!

చందాదారులకు గుడ్ న్యూస్​ - పర్సనల్ డీటైల్స్ మార్చుకునే అవకాశం! - EPFO New Rules

ETV Bharat Logo

Copyright © 2025 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.