ETV Bharat / business

పీఎఫ్​ ఖాతాదారులకు గుడ్​న్యూస్​ - మారిన విత్​ డ్రా రూల్స్​! ఇక ఎవరిపై ఆధారపడకుండానే! - PF Withdraw Rules Changed

EPFO: ప్రస్తుత కాలంలో చాలా కంపెనీలు తమ ఉద్యోగులకు పీఎఫ్ సౌకర్యాన్ని అందిస్తున్నాయి. ఉద్యోగుల భవిష్య నిధిలో భవిష్యత్తు కోసం దాచుకున్న సొమ్ము విత్​ డ్రా కు సంబంధించిన రూల్స్​ ప్రస్తుతం మారాయి. ఆ వివరాలు ఇప్పుడు చూద్దాం..

PF Withdraw Rules Changed
PF Withdraw Rules Changed
author img

By ETV Bharat Telangana Team

Published : Apr 20, 2024, 4:01 PM IST

PF Withdraw Rules Changed: ఉద్యోగుల భవిష్య నిధి సంస్థ (EPFO) తమ ఖాతాదారులకు గుడ్​న్యూస్​ చెప్పింది. ఇక నుంచి పీఎఫ్​ అకౌంట్​ ఖాతాదారులు వైద్య అవసరాల కోసం ఎవరిపైనా ఆధారపడకుండా.. తమ ఖాతా నుంచి లక్ష రూపాయల వరకు విత్‌డ్రా చేసుకునే అవకాశాన్ని కల్పించింది. ఈ మార్పును సెంట్రల్ ప్రావిడెంట్ ఫండ్ కమిషన్ (CPFC) కూడా ఆమోదించింది.

EPFO తాజా నిర్ణయం ​​ఉద్యోగులకు పెద్ద ఉపశమనాన్ని అందిస్తోంది. ఉద్యోగుల భవిష్య నిధి సంస్థ వైద్య సంబంధిత అడ్వాన్సుల ఉపసంహరణ నిబంధనలను ​​మార్చింది. గతంలో వైద్య అవసరాల కోసం నిధి నుంచి క్లెయిమ్ పరిమితి 50 వేల రూపాయలు మాత్రమే ఉండేది. తాజాగా.. ఏప్రిల్ 16న జారీ చేసిన సర్క్యులర్ ప్రకారం ఈ విత్ డ్రా పరిమితిని రూ.లక్షకు పెంచినట్లు ఈపీఎఫ్‌వో స్పష్టం చేసింది. అంటే.. చందా దారులు ఇప్పుడు రూ.లక్ష విత్‌డ్రా చేసుకోవచ్చు. ఈపీఎఫ్‌వో ఫారమ్ 31లోని పారా 68J కింద ఉపసంహరణ పరిమితిని రెట్టింపు చేసింది.

మీ PF బ్యాలెన్స్​ తెలుసుకోవాలా? ఈ సింపుల్ స్టెప్స్​ ఫాలో అవ్వండి! - How To Check PF Balance

68J నిబంధన ప్రకారం.. ఈపీఎఫ్ఓ ఖాతాదారులు తమ పీఎఫ్ ఖాతా నుంచి తమ పర్సనల్​, ఫ్యామిలీ సభ్యుల వైద్య చికిత్స ఖర్చుల కోసం రూ.లక్ష వరకూ విత్ డ్రా చేసుకోవచ్చు. కనీసం నెల రోజులుగా ఆసుపత్రిలో చికిత్స పొందుతున్నా, శస్త్రచికిత్స చేయించుకున్నా క్లెయిమ్ చేసుకోవచ్చు. క్షయ, పక్షవాతం, క్యానర్, గుండె సంబంధ వ్యాధుల చికిత్స కోసం కూడా నగదు విత్ డ్రా చేసుకోవచ్చు.

అయితే.. ఉద్యోగి ప్రభుత్వ ఆసుపత్రిలో గానీ, ప్రభుత్వానికి అనుబంధంగా ఉన్న ఏదైనా ఆసుపత్రిలో గానీ చికిత్స కోసం చేరాలి. ఒకవేళ రోగిని ప్రైవేట్ ఆసుపత్రిలో చేర్చినట్లయితే.. చికిత్స తర్వాత పీఎఫ్​ సొమ్మును క్లెయిమ్ చేసుకోవచ్చు. ఉద్యోగుల ఆరు నెలల బేసిక్ వేతనం ప్లస్ డీఏ గానీ, ఈపీఎఫ్ లో ఉద్యోగి వాటా ప్లస్ వడ్డీల్లో ఏది తక్కువైతే అది విత్ డ్రా చేసుకోవడానికి వీలు ఉంటుంది. అయితే.. ఈ క్లెయిమ్​ కోసం మెడికల్ సర్టిఫికెట్లు సబ్మిట్ చేయాల్సిన అవసరం లేదు. సెల్ఫ్ డిక్లరేషన్​తోనే దరఖాస్తు చేసుకోవచ్చు.

హోమ్ లోన్ తీర్చేందుకు EPF ఫండ్స్​ వాడుతున్నారా? అయితే ఈ విషయాలు తెలుసుకోండి! - PF Withdrawal For Home Loan

ఫారమ్​ 31 ఏమిటి: ఫారమ్ 31 పాక్షిక ఉపసంహరణ కోసం వినియోగిస్తారు. అనేక కారణాల వల్ల ముందస్తు విత్​ డ్రా కోసం ఈ ఫారమ్ ఉపయోగించబడుతుంది. దీని ద్వారా ఇల్లు కట్టుకోవడానికి, ఇల్లు కొనడానికి, పెళ్లి చేసుకోవడానికి, వైద్యం చేయించుకోవడానికి డబ్బు తీసుకోవచ్చు.

PF డబ్బులు తీయాలా? - ఇలా చేయకపోతే క్లెయిమ్ రిజెక్ట్ అవుతుంది!

How to Check PF Balance in Easy Way : క్షణాల్లో పీఎఫ్ బ్యాలెన్స్ తెలుసుకోండి.. UAN, ఇంటర్నెట్ కూడా అవసరం లేదు..!

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.