ETV Bharat / business

కొత్త EV పాలసీకి కేంద్రం ఆమోదం - టెస్లా ఎంట్రీకి మార్గం సుగమం! - Electric Vehicle Policy Of India

Electric Vehicle Policy Of India : కొత్త (ఎలక్ట్రిక్​ వెహికల్)​ ఈవీ పాలసీకి కేంద్ర ప్రభుత్వం ఆమోదం తెలిపింది. దీంతో ఎన్నాళ్ల నుంచో దేశంలోకి అడుగుపెట్టాలని చూస్తున్న టెస్లా కంపెనీకి మార్గం సుగమమైంది.

India electric vehicle policy
Electric Vehicle Policy Of India
author img

By ETV Bharat Telugu Team

Published : Mar 15, 2024, 5:16 PM IST

Electric Vehicle Policy Of India : భారతదేశంలో ఎలక్ట్రిక్ వాహనాల (EV) తయారీని ప్రోత్సహించేందుకుగాను కేంద్ర ప్రభుత్వం ఇ-వెహికల్‌ పాలసీని (E-Vehicle Policy) ఆమోదించినట్లు కేంద్ర వాణిజ్య మంత్రిత్వ శాఖ తెలిపింది. దీనివల్ల ఇండియా విద్యుత్ వాహనాల (ఈవీ) తయారీకి గమ్యస్థానంగా మారుతుందని పేర్కొంది. అంతేకాదు దీని వల్ల ప్రముఖ అంతర్జాతీయ ఈవీ కంపెనీలు మన దేశంలో పెట్టుబడులు పెట్టేందుకు వీలు కలుగుతుందని స్పష్టం చేసింది.

India EV Policy Minimum Investment :
కేంద్ర ప్రభుత్వ తీసుకువచ్చిన ఈ కొత్త ఈవీ పాలసీ ప్రకారం, ఏదైనా ఆటోమొబైల్​ కంపెనీ కనీసం రూ.4,150 కోట్లను (5 వేల మిలియన్‌ డాలర్లు) ఇండియాలో పెట్టుబడి పెడితే, పలు రాయితీలు కల్పిస్తారు. ఈ పాలసీ వల్ల భారతీయులకు కొత్త తరహా సాంకేతికత అందుబాటులోకి వస్తుందని, తద్వారా మేకిన్‌ ఇండియాకు మంచి ఊతం లభిస్తుందని వాణిజ్య మంత్రిత్వశాఖ పేర్కొంది. పైగా ఈ న్యూ ఈవీ పాలసీ వల్ల పర్యావరణానికి ఎంతో మేలు చేకూరుతుందని తెలిపింది. విద్యుత్ వాహనాల వల్ల క్రూడ్ ఆయిల్​ దిగుమతులు తగ్గుతాయని, తద్వారా వాణిజ్య లోటు కూడా భారీగా తగ్గుతుందని స్పష్టం చేసింది.

టెస్లా ఎంట్రీకి ఓకే!
ఎలాన్ మస్క్​కు చెందిన టెస్లా కంపెనీ ఇండియాలోకి ప్రవేశించాలని ఎప్పటి నుంచో ప్రయత్నిస్తోంది. తాజాగా కేంద్ర ప్రభుత్వం కొత్త ఈవీ పాలసీకి ఆమోదం తెలపడం వల్ల, ఇండియాలోకి ప్రవేశించడానికి టెస్లా కంపెనీకి మార్గం సుగమమైంది.

ఎంత పెట్టుబడి పెట్టాలంటే?
న్యూ ఈవీ పాలసీ ప్రకారం, ఏదైనా కంపెనీ ఇండియాలో 500 మిలియన్‌ డాలర్లు పెట్టుబడి పెట్టి, మూడేళ్లలో తయారీ కేంద్రాన్ని నెలకొల్పాలి. దీనితో పాటు విద్యుత్ వాహనాల తయారీకి వినియోగించే విడి భాగాలను 25% వరకు స్థానికంగానే సమీకరించాలి. ఈ నిబంధనలు పాటించిన కంపెనీలు 35 వేల డాలర్ల కంటే అధిక ధర కలిగిన కార్లను 15 శాతం సుంకంతో దిగుమతి చేసుకోవచ్చు. అది కూడా ఏటా 8 వేల ఈవీ కార్ల వరకు మాత్రమే. ప్రస్తుతం మన దేశంలో కార్ల ధరను బట్టి 70-100 శాతం వరకు దిగుమతి సుంకాలు వసూలు చేస్తున్నారు. ఇది టెస్లా కంపెనీ ఎంట్రీకి అడ్డంకిగా మారింది. దీంతో సుంకాలు తగ్గించాలని ఆ కంపెనీ ఎప్పటి నుంచో భారత ప్రభుత్వాన్ని కోరుతోంది. తాజాగా కేంద్ర ప్రభుత్వం న్యూ ఈవీ పాలసీకి ఆమోదం తెలపడం వల్ల టెస్లా ఎంట్రీకి మార్గం సుగమమైంది.

వేసవిలో వీటిని కారులో ఉంచొద్దు - చాలా ప్రమాదకరం!

రోజువారీ ఖర్చులకు డబ్బులు కావాలా? 'హాస్పిటల్​ డైలీ క్యాష్' పాలసీపై ఓ లుక్కేయండి!

ETV Bharat Logo

Copyright © 2025 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.