ETV Bharat / business

ఫస్ట్-పార్టీ ఇన్సూరెన్స్ Vs థర్డ్​-పార్టీ కార్​ ఇన్సూరెన్స్​ - వీటిలో ఏది బెస్ట్ ఆప్షన్​! - Car Insurance

First-Party Insurance Vs Third-party Car Insurance : మీరు మొదటిసారిగా కారు కొనాలని అనుకుంటున్నారా? ఫస్ట్-పార్టీ ఇన్సూరెన్స్​, థర్డ్​-పార్టీ ఇన్సూరెన్స్​ మధ్య తేడా తెలియక కన్ఫ్యూజ్​ అవుతున్నారా? అయితే ఇది మీ కోసమే. ఈ రెండు కారు బీమా పథకాల మధ్య ఉన్న ప్రధానమైన బేధాలు ఏమిటి? ఏది బెస్ట్ ఆప్షన్ అవుతుందో ఇప్పుడు చూద్దాం.

vehicle insurance importance
car insurance importance (ETV Bharat)
author img

By ETV Bharat Telugu Team

Published : May 8, 2024, 4:57 PM IST

First-Party Insurance Vs Third-party Car Insurance : కారు కొనాలని అనుకునేవాళ్లు కచ్చితంగా ఫస్ట్-​పార్టీ ఇన్సూరెన్స్, థర్డ్-పార్టీ ఇన్సూరెన్స్ గురించి తెలుసుకోవాలి. ఎందుకంటే ఈ వెహికల్ ఇన్సూరెన్స్​లు ప్రమాదాలు జరిగినప్పుడు లేదా నష్టం సంభవించినప్పుడు పాలసీదారులకు ఆర్థిక రక్షణ కల్పిస్తాయి. అయితే వీటి పరిధి, ప్రయోజనాలు, ప్రీమియంలు చాలా భిన్నంగా ఉంటాయి. అందుకే ఈ రెండు రకాల బీమా పథకాల గురించి ప్రతి కారు ఓనర్​ కచ్చితంగా తెలుసుకోవాలి.

What Is Car Insurance?
ప్రమాదం, దొంగతనం, నష్టం (డ్యామేజ్) జరిగినప్పుడు పాలసీదారుకు ఆర్థిక రక్షణ కల్పించేదే కారు ఇన్సూరెన్స్. ఈ బీమా పాలసీల్లో ప్రధానంగా మూడు పార్టీలవారు ఉంటారు. వారు ఎవరంటే?

1. ఫస్ట్​ పార్టీ : వెహికల్ ఇన్సూరెన్స్ కొనుగోలు చేసిన వ్యక్తినే 'ఫస్ట్ పార్టీ' అని అంటారు. సాధారణంగా వాహనం కొనుగోలు చేసిన వ్యక్తులే, బీమా పాలసీ కూడా తీసుకుంటారు. కనుక ఈ ఫస్ట్​ పార్టీ వారే బీమా పాలసీ ప్రీమియం చెల్లిస్తారు. అవసరమైనప్పుడు క్లెయిమ్ చేసుకుని, పరిహారం పొందుతారు.

2. సెకెండ్ పార్టీ : ఇన్సూరెన్స్ కంపెనీని సెకెండ్ పార్టీగా పేర్కొంటారు. పాలసీదారు నుంచి ప్రీమియం తీసుకుని ఈ బీమా కంపెనీలు వెహికల్ ఇన్సూరెన్స్​ను అందిస్తూ ఉంటాయి. ఒకవేళ పాలసీదారుని వాహనానికి ఏదైనా డ్యామెజ్ జరిగితే, దానికి పరిహారం చెల్లించాల్సిన బాధ్యత ఇన్సూరెన్స్ కంపెనీకి ఉంటుంది.

3. థర్డ్ పార్టీ : ఫస్ట్ పార్టీ, సెకెండ్ పార్టీ వారు కాకుండా, వాహన ప్రమాదంలో నష్టపోయిన ఇతరులను థర్డ్ పార్టీ అంటారు.

Primary Insurance Categories
వాహన బీమాలో రెండు ప్రాథమిక కేటగిరీలు ఉంటాయి. అవి: ఫస్ట్ పార్టీ ఇన్సూరెన్స్, థర్డ్ పార్టీ ఇన్సూరెన్స్​. వీటి గురించి ఇప్పుడు వివరంగా తెలుసుకుందాం.

First-Party Car Insurance : ఫస్ట్ పార్టీ ఇన్సూరెన్స్​నే 'కాంప్రిహెన్సివ్ ఇన్సూరెన్స్' అని కూడా అంటారు. ఇది ప్రమాదానికి గురైన వాహనానికి, అందులో ఉన్నవారికి జరిగిన నష్టాన్ని కవర్ చేస్తుంది.

  • వాహనాలు పరస్పరం ఢీకొనప్పుడు జరిగిన నష్టానికి ఫస్ట్-పార్టీ ఇన్సూరెన్స్​ పరిహారం అందిస్తుంది.
  • వాహనం దొంగతనానికి గురైనా, విధ్యంసంలో పాడైపోయినా, ప్రకృతి వైపరీత్యాల వల్ల దెబ్బతిన్నా పరిహారం అందిస్తుంది.
  • ప్రమాదానికి గురైన డ్రైవర్​కు వైద్య ఖర్చులను కూడా చెల్లిస్తుంది. దీని వల్ల పాలసీదారునికి ఆర్థిక రక్షణ లభిస్తుంది.
  • ఫస్ట్-పార్టీ ఇన్సూరెన్స్​లో రోడ్​సైడ్​ అసిస్టెన్స్​, రెంటల్ కార్ రీయింబర్స్​మెంట్​, జీరో డిప్రిసియేషన్, ఇంజన్ ప్రొటెక్షన్​, ఇన్​వాయిస్ రిటర్న్​, ఎన్​సీబీ ప్రొటెక్షన్​ ఉంటాయి. అంతేకాదు వాహనంలో ఉన్న వ్యక్తిగత వస్తువులకు కూడా కవరేజ్​ పొందవచ్చు. అయితే ఈ అదనపు ప్రయోజనాల కోసం కాస్త ఎక్కువ ప్రీమియం చెల్లించాల్సి ఉంటుంది.
  • విస్తృతమైన కవరేజ్​ ఉండడం వల్ల థర్డ్-పార్టీ బీమాతో పోలిస్తే ఈ ఫస్ట్​-పార్టీ ఇన్సూరెన్స్ ప్రీమియం అనేది చాలా ఎక్కువగా ఉంటుంది.
  • వాస్తవానికి ఈ ఫస్ట్ పార్టీ ఇన్సూరెన్స్ అనేది ఒక ఆప్షనల్​. కనుక వాహనదారులు తమ బడ్జెట్​కు, అవసరాలకు అనుగుణంగా ఈ కాంప్రిహెన్సివ్​ ఇన్యూరెన్స్​ను తీసుకోవాల్సి ఉంటుంది.

Third-Party Car Insurance : ఈ థర్డ్ పార్టీ ఇన్సూరెన్స్​ను 'లయబిలిటీ ఇన్సూరెన్స్' అని కూడా అంటారు.

  • భారతదేశంలో వాహనం రిజిస్టర్ చేయాలన్నా, దానిని రోడ్లపై నడపాలన్నా కచ్చితంగా థర్డ్​-పార్టీ ఇన్సూరెన్స్ తీసుకోవాల్సిందే.
  • వాహనాన్ని నడిపే వ్యక్తివల్ల ప్రమాదానికి గురైన థర్డ్ పార్టీ వ్యక్తులకు ఈ పాలసీ కింద​ పరిహారం లభిస్తుంది.
  • వాహన ప్రమాదం జరిగినప్పుడు, పాలసీదారునకు ఫస్ట్​-పార్టీ ఇన్సూరెన్స్ వల్ల పరిహారం లభిస్తుంది. కానీ సదరు పాలసీదారు వల్ల జరిగిన యాక్సిడెంట్​లో గాయపడిన వారికి, ఆర్థికంగా నష్టపోయిన వారికి థర్డ్ పార్టీ ఇన్సూరెన్స్ ద్వారా పరిహారం అందుతుంది.
  • ప్రమాదం వల్ల నష్టపోయిన వాళ్లు కోర్టులో దావా వేస్తే, అందుకు అయ్యే చట్టపరమైన ఖర్చులను (లీగల్​ ఫీజులను) కూడా అందిస్తుంది.
  • ఫస్ట్-పార్టీ ఇన్సూరెన్స్​తో పోలిస్తే, థర్డ్-పార్టీ ఇన్సూరెన్స్ అనేది పరిమితమైన కవరేజ్​ను అందిస్తుంది.

బెస్ట్ స్కీమ్​ - రోజుకు రూ.13 కడితే చాలు - జీవితాంతం నెలకు రూ.5000 పెన్షన్! - Atal Pension Yojana

మంచి​ ఎలక్ట్రిక్ కార్ కొనాలా? లాంగెస్ట్ రేంజ్ కలిగిన టాప్​-5 మోడల్స్ ఇవే! - Top Range Electric Cars

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.