ETV Bharat / business

వేల మంది ఉద్యోగులను తొలగించిన డెల్ & బెల్​- కారణం ఇదే! ​ - DELL LAYOFFS - DELL LAYOFFS

Dell layoffs : టెక్ కంపెనీలు భారీ స్థాయిలో ఉద్యోగులను తొలగిస్తున్నాయి. డెల్ కంపెనీ 2023లో ఏకంగా 6650 మంది ఉద్యోగులను తొలగించింది. మరోవైపు బెల్ కంపెనీ 10 నిమిషాల వీడియో కాల్​లో వందలాది మంది ఉద్యోగులను జాబ్స్​ నుంచి తీసేసింది.

Dell layoffs
Dell layoffs
author img

By ETV Bharat Telugu Team

Published : Mar 26, 2024, 6:59 PM IST

Updated : Mar 26, 2024, 9:06 PM IST

Dell layoffs : ఐటీ కంపెనీలు వరుస లేఆఫ్​లతో ఉద్యోగులను బెంబేలెత్తిస్తున్నాయి. డెల్ టెక్నాలజీస్​ కంపెనీ 2023లో ఏకంగా 6650 మంది ఉద్యోగులను తొలగించింది. డెల్ పర్సనల్ కంప్యూటర్స్​కు ఉన్న డిమాండ్​ భారీగా తగ్గుతున్న నేపథ్యంలో, నిర్వహణ ఖర్చులను తగ్గించుకునేందుకు ఉద్యోగులను క్రమంగా తొలగిస్తూ వస్తోంది.

ఖర్చులు తగ్గించుకోవడమే లక్ష్యంగా!
గత రెండేళ్లుగా డెల్ పర్సనల్ కంప్యూటర్లకు ఉన్న డిమాండ్ బాగా తగ్గింది. దీనితో గత నెల విడుదల చేసిన నాలుగో త్రైమాసిక ఫలితాల్లో కంపెనీ రెవెన్యూ 11 శాతం తగ్గిపోయినట్లు పేర్కొంది. అందుకే టెక్ ఉత్పత్తుల తయారీ ఖర్చులు భారీగా తగ్గించాలని డెల్ లక్ష్యంగా పెట్టుకుంది. అందులో భాగంగానే తమ దగ్గర ఉన్న 1,26,000 మంది ఉద్యోగుల్లో 6000 మందిని జాబ్స్ నుంచి తొలగించింది.

వర్క్ ఫ్రమ్ హోమ్ చేసేవారికి నో ప్రమోషన్​
డెల్​ కంపెనీ తమ ఉద్యోగులను ఆఫీస్​కు వచ్చి పనిచేయాలని స్పష్టం చేసింది. ఇంటి దగ్గర ఉండి పని (వర్క్​ ఫ్రమ్ హోమ్​) చేసే వాళ్లకు ప్రమోషన్​లు ఉండవని తేల్చి చెప్పింది. అయితే ఇప్పటికీ హైబ్రిడ్​ విధానంలో వర్క్ చేసే అవకాశం కల్పిస్తోంది.

వీడియో కాల్ ద్వారా ఉద్యోగుల తొలగింపు
మరోవైపు, బెల్ కంపెనీ 10 నిమిషాల వీడియో కాల్ చేసి, ఏకంగా 400 మంది ఉద్యోగులను తొలగించింది. తమ కంపెనీలో అధికంగా (సర్​ప్లస్​గా) ఉద్యోగులు ఉన్నారనే నెపంతో, ఉద్యోగులను తొలగించింది. ఇది చాలా సిగ్గుచేటైన వ్యవహారమని ఉద్యోగులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు.

Mass Layoffs In IT Companies : మనదేశంలో కూడా తొలగింపులు జోరందుకున్నాయి. టీసీఎస్, ఇన్ఫోసిస్, విప్రో, హెచ్‌సీఎల్ టెక్ వంటి దిగ్గజ ఐటీ కంపెనీలు ఫ్రెషర్ల రిక్రూట్‌మెంట్లలో దూకుడును తగ్గించాయి. ఇంజినీరింగ్ పూర్తి చేసిన ఫ్రెషర్స్‌ను రిక్రూట్ చేసుకోవడాన్ని తగ్గించేశాయి. తాజా నివేదిక ప్రకారం 2022-23 ఆర్థిక సంవత్సరంతో పోలిస్తే 2023-24లో భారతీయ ఐటీ కంపెనీలు 32 శాతం తక్కువ మంది ఇంజనీరింగ్ గ్రాడ్యుయేట్లను నియమించుకున్నాయి.

2022-23 ఆర్థిక సంవత్సరంలో 2.30 లక్షల మందిని ఫ్రెషర్లను రిక్రూట్ చేసుకోగా 2023-24లో ఆ సంఖ్య కాస్త తగ్గిపోయి 1.55 లక్షలకు చేరింది. కాస్త వెనక్కి వెళ్తే 2023-24లో దేశంలోనే అతిపెద్ద సాఫ్ట్‌వేర్ సేవల సంస్థ టీసీఎస్‌లో ఉద్యోగుల సంఖ్య 10,669 తగ్గింది. ఇన్ఫోసిస్‌ కంపెనీలో అత్యధికంగా 24,182 మంది సంఖ్య తగ్గగా విప్రోలో 18,510 మంది, హెచ్‌సీఎల్ టెక్‌లో 2,486 మంది ఉద్యోగులు తగ్గారు. మొత్తం మీద గత ఆర్థిక సంవత్సరం(2023-24)లో ఈ నాలుగు దిగ్గజ ఐటీ కంపెనీలు దాదాపు 55వేల మందికిపైగా ఉద్యోగులకు గుడ్ బై చెప్పాయి.

ఆసియా శ్రీమంతుల రాజధానిగా ముంబయి - బీజింగ్​ను అధిగమించి టాప్​లోకి! - Mumbai surpasses Beijing

Last Updated : Mar 26, 2024, 9:06 PM IST
ETV Bharat Logo

Copyright © 2025 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.