ETV Bharat / business

బ్లూ, రెడ్‌, గ్రీన్ - రైల్‌ కోచ్‌ల కలర్​కు ప్రత్యేక కారణం! రంగు బట్టి లగ్జరీలో తేడా!

ఇండియన్ రైల్‌ కోచ్‌లకు ప్రత్యేకమైన కలర్‌ కోడ్స్‌ - ఎందుకు? పసుపు, తెలుపు, ఊదా, గోధుమ రంగు, ఆరెంజ్‌, క్రీమ్‌ అండ్ బ్లూ కలర్‌ కోచ్‌లకు అర్థం ఏమిటి?

Indian Railways
Indian Railways (ANI)
author img

By ETV Bharat Telugu Team

Published : Oct 21, 2024, 5:17 PM IST

Indian Railway Coaches Colours : భారతీయ రైల్వే ప్రతి రోజూ కొన్ని కోట్ల మందిని తమ గమ్యస్థానాలకు చేరుస్తూ ఉంటుంది. ప్రయాణికులు సౌకర్యవంతంగా ప్రయాణించడానికి అనువుగా అనేక సౌకర్యాలు కల్పిస్తూ ఉంటుంది. అయితే మీరు ఎప్పుడైనా గమనించారా? భారతీయ రైలు కోచ్‌లు రకరకాల రంగుల్లో ఉంటాయని.

వాస్తవానికి రైలు కోచ్‌లకు ఇన్ని రకాల రంగులు వేయడానికి కారణం అందం కోసం కాదు. ఈ కలర్ కోడ్‌లకు ప్రత్యేకమైన అర్థం ఉంది. ఈ రంగులు కోచ్ రకాన్ని, అందులో అందించే సౌకర్యాల స్థాయిని తెలియజేస్తాయి. అంటే రంగులను బట్టి సాధారణ స్థాయి నుంచి ఎయిర్‌కండిషన్‌ సహా అత్యంత విలాసవంతమైన సౌకర్యాలు ఉన్న కోచ్‌ల మధ్య ఉన్న తేడాలను మనం గుర్తించవచ్చు.

నీలం రంగు కోచ్‌లు
ఈ నీలం రంగు కోచ్‌లు ప్రధానంగా రాజధాని, శతాబ్ది ఎక్స్‌ప్రెస్‌ లాంటి రైళ్లలో కనిపిస్తుంటాయి. వేగంగా, సౌకర్యవంతంగా ప్రయాణించడం కోసం వీటిని రూపొందించారు. ఈ నీలం రంగు కోచ్‌లు ఉన్న ట్రైన్‌లు గంటకు 70-140 కి.మీ వేగంతో ప్రయాణిస్తుంటాయి. ఈ కోచ్‌లను ఉక్కుతో తయారు చేస్తారు. వీటికి ఎయిర్‌ బ్రేక్‌లు ఉంటాయి. ఈ బ్లూ కోచ్‌ల్లో సీట్లు విశాలంగా, సౌకర్యవంతంగా ఉంటాయి. క్యాటరింగ్ సర్వీస్‌ కూడా ఉంటుంది. సౌకర్యవంతమైన ప్రయాణం కోరుకునేవారికి ఈ బ్లూ కోచ్‌లు అనువుగా ఉంటాయి. కానీ వీటి టికెట్ ధర కాస్త ఎక్కువగానే ఉంటుంది.

ఎరుపు రంగు కోచ్‌లు
ఎరుపు రంగు కోచ్‌లను లింక్ హాఫ్‌మన్ బుష్ కోచ్‌లు అని కూడా అంటారు. 2000 ప్రారంభంలో ఈ కోచ్‌లను ఇండియన్ ట్రైన్స్‌లో ఏర్పాటు చేయడం ప్రారంభించారు. పంజాబ్‌లోని కపుర్తలాలో ఈ రెడ్ కోచ్‌లను నిర్మిస్తుంటారు. అల్యూమినియంతో తయారు చేసిన ఈ కోచ్‌లు చాలా తేలికగా ఉంటాయి. ఇవి గంటకు 200 కి.మీ వేగంతో ప్రయాణిస్తాయి. ఆధునిక సౌకర్యాలు ఉండే ఈ కోచ్‌లకు, డిస్క్ బ్రేక్‌లు ఉంటాయి. ఈ ఎరుపు రంగు కోచ్‌ల్లో ప్రీమియం సర్వీస్‌లు అందిస్తారు. సాధారణంగా రాజధాని, శతాబ్ది ట్రైన్లలో ఈ కోచ్‌లు ఉంటాయి. లగ్జరీగా, సౌకర్యవంతంగా, వేగంగా ప్రయాణించాలని అనుకునేవారికి ఈ రెడ్ కోచ్‌లు అనువుగా ఉంటాయి.

ఆకుపచ్చ రంగు కోచ్‌లు
ఎరుపు, నీలం రంగు కోచ్‌ల్లానే ఈ గ్రీన్‌ కోచ్‌ల్లోనూ ఏసీ ఉంటుంది. కానీ మిగతా వాటితో పోల్చి చూస్తే, ఈ ఆకుపచ్చ రంగు కోచ్‌ల్లో ప్రయాణానికి అయ్యే ఖర్చు కాస్త తక్కువగా ఉంటుంది. ఈ గ్రీన్‌ కోచ్‌లు వివిధ ఎక్స్‌ప్రెస్‌ ట్రైన్లలో కనిపిస్తాయి. తక్కువ బడ్జెట్లో సౌకర్యవంతంగా రైలు ప్రయాణం చేయాలని అనుకునేవారికి ఈ ఆకుపచ్చ రంగు కోచ్‌లు అనువుగా ఉంటాయి.

ఈ రంగులకు అర్థం ఏమిటి?
భారతీయ రైళ్లలో ఇంకా అనేక రంగుల కోచ్‌లు ఉన్నాయి. పసుపు రంగు కోచ్‌ల్లో ఎయిర్ కండిషన్ ఉండదు. కనుక వీటి టికెట్ ధర తక్కువగా ఉంటుంది. గోధుమ రంగు (బ్రౌన్‌) కోచ్‌లు స్లీపర్ బెర్త్‌ కలిగి ఉండి, రాత్రిపూట ప్రయాణం చేయడానికి అనువుగా ఉంటాయి. ఉదా (పర్పుల్‌) రంగు కోచ్‌లు ఎక్కువగా తేజస్ ఎక్స్‌ప్రెస్‌లో కనిపిస్తుంటాయి. వీటిలో అత్యాధునిక సౌకర్యాలు ఉంటాయి. తెలుపు రంగు కోచ్‌లు సాధారణంగా అధ్యాత్మక ప్రాముఖ్యం ఉన్న ప్రదేశాలకు ప్రయాణిస్తుంటాయి. ఆరెంజ్ కలర్ కోచ్‌లు నగరాలు, పట్టణాల్లోని తక్కువ దూరంలోని స్టేషన్ల వరకు ప్రయాణించడానికి అనువుగా ఉంటాయి. క్రీమ్ అండ్ బ్లూ కోచ్‌లు సెకెండ్-క్లాస్‌ వసతి సౌకర్యాలు కలిగి ఉంటాయి. తక్కువ బడ్జెట్లో ప్రయాణించాలని అనుకునేవారికి ఇవి ఉపయోగపడతాయి. ఈ కలర్ కోడ్‌లు గురించి తెలుసుకుంటే, మనకున్న బడ్జెట్‌లో, ఎలాంటి కోచ్‌లో ఎక్కితే, సౌకర్యవంతంగా ప్రయాణించగలమో తెలుసుకోగలుగుతాం.

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.