Cheapest Diesel Cars In India 2024 : డీజిల్ ఇంజిన్ కారులు తక్కువ ఇంధనంతో ఎక్కువ దూరం ప్రయాణించడానికి అనువుగా ఉంటాయి. అందుకే వీటిని కొనుగోలు చేయడానికి ఎక్కువ మంది ఇష్టపడతారు. మరి మీకు కూడా డీజిల్ కార్లు అంటే ఇష్టమా? అయితే అత్యంత సరసమైన ధరల్లో లభిస్తున్న డీజిల్, ఎస్యూవీ కార్లుపై ఓ లుక్కేద్దాం రండి.
1. Tata Altroz Diesel Car Features : భారతదేశంలో అత్యంత సరసమైన ధరకు లభిస్తున్న ఏకైక డీజిల్ పవర్డ్ హ్యాచ్‌బ్యాక్ ఇది. ఈ టాటా ఆల్ట్రోజ్ కారులో 1.5 లీటర్, ఫోర్-సిలిండర్ టర్బో-డీజిల్ ఇంజిన్ ఉంది. ఇది 90 హెచ్‌పీ పవర్, 200 ఎన్ఎం టార్క్ జనరేట్ చేస్తుంది. ఇది 5-స్పీడ్ మాన్యువల్ గేర్‌బాక్స్‌తో అనుసంధానమై పనిచేస్తుంది. ఈ కారు ప్యూయెల్ ఎఫీషియన్సీ 23.6 kmpl. ఈ టాటా ఆల్ట్రోజ్ ధర సుమారుగా రూ.8.9 లక్షల నుంచి రూ.10.8 లక్షల వరకు ఉంటుంది.
- " class="align-text-top noRightClick twitterSection" data="">
2. Kia Sonet Diesel Car Features : ఈ కియా సోనెట్ అనేది మోస్ట్ పాపులర్ కాంపాక్ట్ ఎస్యూవీ. ఇది పెట్రోల్, టర్బో-పెట్రోల్, టర్బో-డీజిల్ ఇంజిన్ వేరియంట్లలో లభిస్తుంది. 1.5 లీటర్, ఫోర్-సిలిండర్ టర్బో-డీజిల్ ఇంజిన్ 116 హెచ్‌పీ పవర్, 250 ఎన్ఎం టార్క్ జనరేట్ చేస్తుంది. ఇది 6-స్పీడ్ ఆటోమేటిక్/ 6-స్పీడ్ మాన్యువల్ గేర్‌బాక్స్‌తో ఆప్షన్లతో వస్తుంది. ఈ కియా సోనెట్ ధర సుమారుగా రూ.9.79 లక్షల నుంచి రూ.15.69 లక్షల వరకు ఉంటుంది.
- " class="align-text-top noRightClick twitterSection" data="">
3. Mahindra Bolero Neo Diesel Car Features : మహీంద్రా బొలెరొ నియో అనేది ఒక బెస్ట్ ఎస్యూవీ. దీనిలో 1.5 లీటర్, త్రీ-సిలిండర్ టర్బో-డీజిల్ ఇంజిన్ ఉంది. ఇది 100 హెచ్‌పీ పవర్, 260 ఎన్ఎం టార్క్ జనరేట్ చేస్తుంది. ఇది 5-స్పీడ్ మాన్యువల్ గేర్ బాక్స్‌తో అనుసంధానమై పనిచేస్తుంది. అయితే రియల్ డ్రైవింగ్ ఎమిషన్స్ నిబంధనలకు అనుగుణంగా ఈ మహీంద్రా బొలెరో నియోను అప్డేట్ చేయలేదు. అయినప్పటికీ మంచి డీజిల్ వెహికల్ కొనాలని అనుకునేవారికి ఇది బెస్ట్ ఆప్షన్ అవుతుంది. మార్కెట్లో ఈ కారు ధర సుమారుగా రూ.9.90 లక్షల నుంచి రూ.12.15 లక్షల వరకు ఉంటుంది.
- " class="align-text-top noRightClick twitterSection" data="">
4. Mahindra Bolero Diesel Car Features : భారతదేశంలో అత్యంత పాపులర్ అయిన కార్లలో మహీంద్రా బొలెరో ఒకటి. గత 20 ఏళ్లుగా ఇది బెస్ట్ సెల్లింగ్ కారుగా కొనసాగుతోంది. ఈ కారులో 1.5 లీటర్, త్రీ-సిలిండర్ టర్బో-డీజిల్ ఇంజిన్ ఉంది. ఇది 76 హెచ్‌పీ పవర్, 210 ఎన్ఎం టార్క్ జనరేట్ చేస్తుంది. దీనికి అనుసంధానంగా ఉన్న 5-స్పీడ్ మాన్యువల్ గేర్‌బాక్స్ వెనుక చక్రాలకు పవర్ అందిస్తుంది. మార్కెట్లో దీని ధర సుమారుగా రూ.9.90 లక్షల నుంచి రూ.11 లక్షల వరకు ఉంటుంది.
- " class="align-text-top noRightClick twitterSection" data="">
5. Mahindra XUV300 Diesel Car Features : ఈ మహీంద్రా ఎక్స్‌యూవీ300 కారుకు 5-స్టార్ గ్లోబల్ ఎన్సీఏపీ రేటింగ్ ఉంది. ఈ కారులో 1.5 లీటర్, ఫోర్-సిలిండర్ టర్బో-డీజిల్ ఇంజిన్ ఉంది. ఇది 117 హెచ్‌పీ పవర్, 300 ఎన్ఎం టార్క్ ఉత్పత్తి చేస్తుంది. 6-స్పీడ్ మాన్యువల్/ ఏఎంటీ గేర్ బాక్స్ ద్వారా ఫ్రంట్ వీల్‌కు పవర్ డెలివరీ అవుతుంది. డీజిల్ కారు కొనాలని అనుకునేవారికి ఈ కాంపాక్ట్ మహీంద్రా ఎస్యూవీ కారు మంచి ఆప్షన్ అవుతుంది. మార్కెట్లో దీని ధర సుమారుగా రూ.9.92 లక్షల నుంచి రూ.14.76 లక్షలు ఉంటుంది.
- " class="align-text-top noRightClick twitterSection" data="">
6. Hyundai Venue Diesel Car Features : ఈ హ్యుందాయ్ వెన్యూ అనేది కియా సోనెట్‌కు కజిన్. ఈ హ్యుందాయ్ వెన్యూ కారు అనేక వేరియంట్లలో లభిస్తుంది. అయితే ఈ కారులోని 1.5 లీటర్, ఫోర్-సిలిండర్ టర్బో-డీజిల్ ఇంజిన్ 116 హెచ్‌పీ పవర్, 250 ఎన్ఎం టార్క్ జనరేట్ చేస్తుంది. అయితే సోనెట్ కారులా కాకుండా, ఈ కారులో కేవలం 6-స్పీడ్ మాన్యువల్ గేర్ బాక్స్ మాత్రమే ఉంది. మార్కెట్లో ఈ హ్యుందాయ్ వెన్యూ కారు ధర సుమారుగా రూ.10.71 లక్షల నుంచి రూ.13.44 లక్షలు వరకు ఉంటుంది.
- " class="align-text-top noRightClick twitterSection" data="">
7. Tata Nexon Diesel Car Features : భారతదేశంలోని బెస్ట్ సెల్లింగ్ ఎస్‌యూవీల్లో టాటా నెక్సాన్ ఒకటి. దీనికి 5-స్టార్ గ్లోబల్ ఎన్సీఏపీ రేటింగ్ ఉంది. కనుక ప్రయాణికుల భద్రతకు హామీ ఉంటుంది. ఇది టర్బో పెట్రోల్, టర్బో డీజిల్ ఇంజిన్ ఆప్షన్లతో వస్తుంది. 1.5 లీటర్, ఫోర్-సిలిండర్ టర్బో-డీజిల్ ఇంజిన్ 115 హెచ్‌పీ పవర్, 260 ఎన్ఎం టార్క్ జనరేట్ చేస్తుంది. పైగా ఇది 6-స్పీడ్ మాన్యువల్, ఆటోమేటిక్ ట్రాన్స్మిషన్ గేర్‌బాక్స్‌తో అనుసంధానమై ఉంటుంది. పట్టణాల్లో ప్రయాణించడానికి ఈ కారు అనువుగా ఉంటుంది. మార్కెట్లో ఈ కారు ధర సుమారుగా రూ.11.10 లక్షల నుంచి రూ.15.60 లక్షలు వరకు ఉంటుంది.
- " class="align-text-top noRightClick twitterSection" data="">
8. Mahindra Thar Diesel Car Features : ఈ మహీంద్రా థార్ రెండు డీజిల్ ఇంజిన్ ఆప్షన్లతో వస్తుంది. 1.5 లీటర్, ఫోర్-సిలిండర్ టర్బో-డీజిల్ ఇంజిన్ 118 హెచ్‌పీ పవర్, 300 ఎన్ఎం టార్క్ జనరేట్ చేస్తుంది. 2.2 లీటర్ ఫోర్-సిలిండర్ టర్బో-డీజిల్ ఇంజిన్ 132 హెచ్‌పీ పవర్, 300 ఎన్ఎం టార్క్ జనరేట్ చేస్తుంది. మొదటి ఇంజిన్ 6-స్పీడ్ మాన్యువల్ గేర్‌బాక్స్‌తో అనుసంధానమై పనిచేస్తుంది. రెండో ఇంజిన్ 6-స్పీడ్ మాన్యువల్ & ఆటోమేటిక్ గేర్‌బాక్స్ ఆప్షన్లు రెండూ కలిగి ఉంటుంది. ఈ మహీంద్రా థార్ ధర సుమారుగా రూ.11.25 లక్షల నుంచి రూ.17.20 లక్షల వరకు ఉంటుంది.
- " class="align-text-top noRightClick twitterSection" data="">
9. Kia Seltos Diesel Car Features : ఈ కియా సెల్టోస్‌లో చాలా పవర్ట్రైన్ ఆప్షన్లు ఉన్నాయి. వీటిలో 1.5 లీటర్, ఫోర్-సిలిండర్ టర్బో-డీజిల్ ఇంజిన్ 116 హెచ్‌పీ పవర్, 250 ఎన్ఎం టార్క్ జనరేట్ చేస్తుంది. ఇది 6-స్పీడ్ మాన్యువల్, 6-స్పీడ్ ఏటీ గేర్‌బాక్స్ ఆప్షన్లతో వస్తుంది. దూర ప్రయాణాలు చేయాలని అనుకునేవారికి ఇది మంచి ఛాయిస్ అవుతుంది. మార్కెట్లో ఈ కియా సెల్టోస్ కారు ధర సుమారుగా రూ.12 లక్షల నుంచి రూ.20.30 లక్షలు ఉంటుంది.
- " class="align-text-top noRightClick twitterSection" data="">
10. Hyundai Creta Diesel Car Features : మిడ్‌సైజ్ ఎస్‌యూవీల్లో డీజిల్ ఇంజిన్లు ఉన్న కార్లు హ్యుందాయ్ క్రెటా, కియా సెల్టోస్ మాత్రమే. హ్యుందాయ్ క్రెటాలో 1.5 లీటర్, ఫోర్-సిలిండర్ టర్బో-డీజిల్ ఇంజిన్ ఉంది. ఇది 116 హెచ్‌పీ, 250 ఎన్ఎం టార్క్ జనరేట్ చేస్తుంది. దీనికి 6-స్పీడ్ మాన్యువల్, 6-స్పీడ్ ఆటోమేటిక్ గేర్‌బాక్స్ అనుసంధానమై ఉంటుంది. ఇది స్మూత్ డ్రైవింగ్ ఎక్స్‌పీరియన్స్‌ను ఇస్తుంది. మార్కెట్లో హ్యుందాయ్ క్రెటా కారు ధర సుమారుగా రూ.12.35 లక్షల నుంచి రూ.20.15 లక్షల వరకు ఉంటుంది.
- " class="align-text-top noRightClick twitterSection" data="">
అప్డేటెడ్ వెర్షన్స్ - ధరలు : వాహన ఉద్గారాలను తగ్గించాలనే ఉద్దేశంతో తీసుకువచ్చిన 'భారత్ స్టేజ్ 6 ఫేజ్ 2 ఉద్గారాల నిబంధనలు' (రియల్ డ్రైవింగ్ ఎమిషన్స్) 2023 ఏప్రిల్ 1 నుంచి అమలులోకి వచ్చాయి. దీనిలో భాగంగా అప్డేటెడ్ డీజిల్ ఇంజిన్లను మార్చడానికి ఆటోమొబైల్ కంపెనీలు అన్నీ కృషి చేస్తున్నాయి. కానీ దీని వల్ల డీజిల్ కార్ల ధరలు భారీగా పెరిగే అవకాశం ఉంది.
బైక్ ఇన్సూరెన్స్ తీసుకోవాలా? ఈ విషయాలు కచ్చితంగా తెలుసుకోండి!
HDFC నుంచి 4 కొత్త బిజినెస్ క్రెడిట్ కార్డులు - బెనిఫిట్స్ చూస్తే ఫిదా అవ్వాల్సిందే!