ETV Bharat / business

రూ.7 లక్షల్లో మంచి కారు కొనాలా? టాప్-10 ఆప్షన్స్ ఇవే! - Cars Under 7 Lakh

author img

By ETV Bharat Telugu Team

Published : Jul 24, 2024, 1:51 PM IST

Cars Under 7 Lakh : మీరు కొత్త కారు కొనాలనుకుంటున్నారా? మీ బడ్జెట్ రూ.7 లక్షలేనా? అయితే ఈ స్టోరీ మీ కోసమే. ప్రస్తుతం భారత మార్కెట్లో మంచి మైలేజ్, ఫీచర్లతో రూ.7 లక్షల బడ్జెట్లో లభిస్తున్న టాప్-10 కార్లపై ఓ లుక్కేద్దాం రండి.

upcoming cars under 7 lakh
top 10 Cars Under 7 Lakh (ETV Bharat)

Cars Under 7 Lakh : ప్రస్తుత కాలంలో కుటుంబంతో కలిసి ఎక్కడికైనా వెళ్లాలంటే కారు తప్పనిసరి అయిపోయింది! ఎందుకంటే బైక్​పై ఇద్దరు లేదా ముగ్గురు కంటే ఎక్కువ మంది ప్రయాణించలేరు. అందుకే తక్కువ బడ్జెట్లో మంచి మైలేజ్, ఫీచర్లు ఉన్న కారు కొనాలని చాలా మంది ఆశపడుతుంటారు. ఇలాంటి వారి కోసం ప్రస్తుతం ఇండియన్​ మార్కెట్లో రూ.7 లక్షల బడ్జెట్​​లో మంచి ఈవీ, పెట్రోల్, డీజిల్​ కార్లు లభిస్తున్నాయి. అవేంటో ఈ స్టోరీలో తెలుసుకుందాం.

1. Tata Nano EV : భారత మార్కెట్లోకి త్వరలో 'టాటా నానో ఈవీ' లాంఛ్ కానుంది. ఈ కారు ధర రూ.5 లక్షల వరకు ఉండొచ్చని అంచనా.

  • సీటింగ్ కెపాసిటీ - 4
  • ఫ్యూయల్ టైప్ - ఎలక్ట్రిక్
  • బ్యాటరీ కెపాసిటీ - 40kWh
  • రేంజ్ - 300 కి.మీ
  • ఎయిర్ బ్యాగులు - 2
  • ఫీచర్లు - ఎయిర్ కండిషనర్, పవర్ విండోస్, ఫ్రంట్ వీల్ డ్రైవ్, యాంటీ లాక్ బ్రేకింగ్ సిస్టమ్

2. Renault KWID : రెనో క్విడ్ కారు ధర రూ.4.7 లక్షల నుంచి రూ.6.45 లక్షల వరకు ఉంటుంది. ఈ కారులో 999 సీసీ పెట్రోల్​ ఇంజిన్ ఉంటుంది. ఇది 67.07bhp పవర్, 91Nm టార్క్​ను ఉత్పత్తి చేస్తుంది. ఒక లీటరు పెట్రోల్​కు 22.3 కి.మీ మైలేజ్ ఇస్తుంది.

  • సీటింగ్ కెపాసిటీ - 5
  • ఫ్యూయల్ టైప్ - పెట్రోల్
  • ఇంజిన్ కెపాసిటీ - 999 సీసీ
  • ఎయిర్ బ్యాగులు - 2
  • ఫీచర్లు - ఆండ్రాయిడ్ ఆటోప్లే, 8అంగుళాల ఇన్ఫోటైన్​మెంట్ సిస్టమ్, ఆండ్రాయిడ్ ఆటో, టైర్ ప్రెజర్ మానిటరింగ్ సిస్టమ్, ఫోల్డబుల్ రియర్ సీట్, కీలెస్ ఎంట్రీ, రివర్స్ కెమెరా, ఎలక్ట్రానిక్ స్టెబిలిటీ ప్రోగ్రామ్

3. Maruti Suzuki Alto K10 : మారుతి సుజుకి కారు ధర రూ.3.99 లక్షల నుంచి రూ.5.96 లక్షల వరకు ఉంటుంది. ఈ కారులో 998 సీసీ పెట్రోల్​ ఇంజిన్ ఉంటుంది. ఇది 65.71 bhp పవర్, 89Nm టార్క్‌ ఉత్పత్తి చేస్తుంది. ఒక లీటరు పెట్రోల్​కు 24.9 కి.మీ మైలేజ్ ఇస్తుంది.

  • సీటింగ్ కెపాసిటీ - 5
  • ఫ్యూయల్ టైప్ - పెట్రోల్
  • ఇంజిన్ కెపాసిటీ - 998 సీసీ
  • ఎయిర్ బ్యాగులు - 2
  • ఫీచర్లు - ఆండ్రాయిడ్ ఆటోప్లే, కీలెస్ ఎంట్రీ, 7అంగుళాల ఇన్ఫోటైన్​మెంట్ సిస్టమ్, ఎయిర్ కండిషనర్

4. Hyundai Casper : హ్యుందాయ్ కాస్పర్​ కారు ధర రూ.6 లక్షల వరకు ఉంటుంది. ఈ కారులో 999 సీసీ పెట్రోల్​ ఇంజిన్ ఉంటుంది. ఇది 99.24 bhp పవర్, 172 Nm టార్క్‌ ఉత్పత్తి చేస్తుంది. బడ్జెట్​లో కారు కొనాలకునేవారికి ఇది మంచి ఆప్షన్ అవుతుంది.

  • సీటింగ్ కెపాసిటీ - 5
  • ఫ్యూయల్ టైప్ - పెట్రోల్
  • ఇంజిన్ కెపాసిటీ - 999 సీసీ
  • ఎయిర్ బ్యాగులు - 2
  • ఫీచర్లు - హిల్ స్టార్ట్ అసిస్ట్, ఈఎస్​పీ, ఎయిర్ కండిషనర్, పవర్ విండోస్, ఫ్రంట్ వీల్ డ్రైవ్, యాంటీ లాక్ బ్రేకింగ్ సిస్టమ్

5. Tata Punch : టాటా పంచ్ కారు లీటరుకు 18.8 కి.మీ మైలేజ్​ను ఇస్తుంది. ఈ కారులో 1199 సీసీ పెట్రోల్​ ఇంజిన్ ఉంటుంది. ఇది 86.6 bhp పవర్, 115 Nm టార్క్‌ ఉత్పత్తి చేస్తుంది. ఈ కారు ధర రూ.6.13 లక్షల నుంచి రూ.10.2 లక్షల వరకు ఉంటుంది.

  • సీటింగ్ కెపాసిటీ - 5
  • ఫ్యూయల్ టైప్ - పెట్రోల్
  • ఇంజిన్ కెపాసిటీ - 1199 సీసీ
  • ఎయిర్ బ్యాగులు - 2
  • ఫీచర్లు - సన్​రూఫ్, 7అంగుళాల ఇన్ఫోటైన్​మెంట్ సిస్టమ్, ఆండ్రాయిడ్ ఆటో, కనెక్టెడ్ కార్ టెక్, టైర్ ప్రెజర్ మానిటరింగ్ సిస్టమ్, రెయిన్ సెన్సింగ్ వైపర్, ఆటో ఏసీ, క్రూయిజ్ కంట్రోల్

6. Renault Triber : రెనో ట్రైబర్ కారులో 999 సీసీ పెట్రోల్ ఇంజిన్ ఉంది. ఇది 71.02 bhp పవర్, 96Nm టార్క్‌ ఉత్పత్తి చేస్తుంది. ఈ కారు ధర రూ.6 లక్షల నుంచి రూ.8.97 లక్షల వరకు ఉంటుంది.

  • సీటింగ్ కెపాసిటీ - 7
  • ఫ్యూయల్ టైప్ - పెట్రోల్
  • ఇంజిన్ కెపాసిటీ - 999 సీసీ
  • ఎయిర్ బ్యాగులు - 4
  • ఫీచర్లు - 8 అంగుళాల ఇన్ఫోటైన్​మెంట్ సిస్టమ్, ఆండ్రాయిడ్ ఆటో, వైర్​లెస్ ఛార్జింగ్, టైర్ ప్రెజర్ మానిటరింగ్ సిస్టమ్, పుష్ బటన్ స్టార్ట్

7. Tata Tiago : టాటా టియాగో కారు ధర రూ.6.65 లక్షల నుంచి రూ.8.90 లక్షల వరకు ఉంటుంది. ఈ కారులో 1199 సీసీ పెట్రోల్ ఇంజిన్ ఉంది. ఇది 84.48 bhp పవర్, 113Nm టార్క్‌ ఉత్పత్తి చేస్తుంది. ఈ కారు లీటరుకు 19 కి.మీ మైలేజ్ ఇస్తుంది.

  • సీటింగ్ కెపాసిటీ - 5
  • ఫ్యూయల్ టైప్ - పెట్రోల్
  • ఇంజిన్ కెపాసిటీ - 1199 సీసీ
  • ఎయిర్ బ్యాగులు - 2
  • ఫీచర్లు - 7అంగుళాల ఇన్ఫోటైన్​మెంట్ సిస్టమ్, ఆండ్రాయిడ్ ఆటో, టైర్ ప్రెజర్ మానిటరింగ్ సిస్టమ్, రెయిన్ సెన్సింగ్ వైపర్, ఆటో ఏసీ, ఆటోమేటిక్ హెడ్‌ ల్యాంప్స్, రివర్స్ కెమెరా

8. Nissan Magnite : నిస్సాన్ మాగ్నైట్ కారు ధర రూ.6 లక్షల నుంచి రూ.11.27 లక్షల వరకు ఉంటుంది. ఈ కారులో 999 సీసీ టర్బో ఇంజిన్ ఉంటుంది. ఇది 98.63 bhp పవర్, 152Nm టార్క్‌ ఉత్పత్తి చేస్తుంది. ఈ కారు లీటరుకు 17.4 కి.మీ మైలేజ్ ఇస్తుంది.

  • సీటింగ్ కెపాసిటీ - 5
  • ఫ్యూయల్ టైప్ - పెట్రోల్
  • ఇంజిన్ కెపాసిటీ - 999 సీసీ
  • ఎయిర్ బ్యాగులు - 2
  • ఫీచర్లు - 360°డిగ్రీ వ్యూ కెమెరా, 8 అంగుళాల ఇన్ఫోటైన్​మెంట్ సిస్టమ్, వైర్‌ లెస్ ఆండ్రాయిడ్ ఆటో, వైర్​లెస్ ఛార్జింగ్, టైర్ ప్రెజర్ మానిటరింగ్ సిస్టమ్, ఎయిర్ ప్యూరిఫైయర్, ఆటో ఏసీ

9. Citroen C3 : సిట్రోయెన్ సీ3 మోడల్ కారు ధర రూ.6.16 లక్షల నుంచి రూ.8.96 లక్షల వరకు ఉంటుంది. దీనిలో 1199 సీసీ ఇంజిన్​ ఉంటుంది. ఇది 108.62 bhp పవర్, 190Nm టార్క్‌ ఉత్పత్తి చేస్తుంది. ఈ కారు లీటరుకు 19.3 కి.మీ మైలేజ్ ఇస్తుంది.

  • సీటింగ్ కెపాసిటీ - 5
  • ఫ్యూయల్ టైప్ - పెట్రోల్
  • ఇంజిన్ కెపాసిటీ - 1199 సీసీ
  • ఎయిర్ బ్యాగులు - 2
  • ఫీచర్లు - 10.24 అంగుళాల ఇన్ఫోటైన్​మెంట్​ సిస్టమ్, వైర్‌ లెస్ ఆండ్రాయిడ్ ఆటో, టైర్ ప్రెజర్ మానిటరింగ్ సిస్టమ్, కీలెస్ ఎంట్రీ, రివర్స్ కెమెరా, ఎలక్ట్రానిక్ స్టెబిలిటీ ప్రోగ్రామ్

10. MG Comet EV : ఎంజీ కామెట్ ఈవీ కారు ధర రూ.6.98 లక్షల నుంచి రూ.9.23 లక్షల వరకు ఉంటుంది. ఈ కారులో 17.3 కిలోవాట్​ సామర్థ్యం గల బ్యాటరీ ఉంటుంది. ఈ కారును ఒక్కసారి ఫుల్ ఛార్జ్ చేస్తే 230 కి.మీ వరకు ప్రయాణించవచ్చు.

  • సీటింగ్ కెపాసిటీ - 5
  • ఫ్యూయల్ టైప్ - ఎలక్ట్రిక్
  • బ్యాటరీ కెపాసిటీ - 17.3kWh
  • ఎయిర్ బ్యాగులు - 2
  • ఫీచర్లు - 10.24 అంగుళాల ఇన్ఫోటైన్‌మెంట్ సిస్టమ్, వైర్‌ లెస్ ఆండ్రాయిడ్ ఆటో, కనెక్టెడ్ కార్ టెక్, టైర్ ప్రెజర్ మానిటరింగ్ సిస్టమ్, పుష్ బటన్ స్టార్ట్, కీలెస్ ఎంట్రీ, రివర్స్ కెమెరా

పొదుపు Vs పెట్టుబడి - సంపద సృష్టించడానికి ఏది బెటర్ ఆప్షన్? - Saving Vs Investing

డెబిట్​ కార్డ్ మర్చిపోయారా? డోంట్ వర్రీ - ATM నుంచి మనీ విత్​డ్రా చేయండిలా! - Cardless Cash Withdrawal From ATM

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.