ETV Bharat / business

వేసవిలో వీటిని కారులో ఉంచొద్దు - చాలా ప్రమాదకరం! - Things you shoul NEVER LEAVE In Car

Car Maintenance Tips For Summer : కార్ కొనడమే కాదు, దానిని​ మెయింటెన్​ చేయడం కూడా రావాలి. అప్పుడే అది ఎక్కువ కాలంపాటు బాగా పనిచేస్తుంది. ముఖ్యంగా వేసవి కాలంలో కారు కోసం ప్రత్యేకమైన జాగ్రత్తలు తీసుకోవాల్సి ఉంటుంది. అవి ఏమిటో ఇప్పుడు తెలుసుకుందాం.

Car Driving and Maintenance Tips for Hot Summer
Car maintenance tips for summer
author img

By ETV Bharat Telugu Team

Published : Mar 15, 2024, 1:02 PM IST

Car Maintenance Tips For Summer : తెలుగు రాష్ట్రాల్లో అప్పుడే ఎండలు మండిపోతున్నాయి. ముఖ్యంగా ఈ ఏడాది వర్షపాతం తక్కువగా ఉండటం వల్ల, ఉష్ణోగ్రతలు విపరీతంగా పెరిగిపోతున్నాయి. వేసవి కాలంలో కార్లలో అగ్ని ప్రమాదాలు ఎక్కువగా జరుగుతాయి. ముఖ్యంగా ఎండలో నిలిపిన కార్లలో ఒక్కసారిగా మంటలు చెలరేగడం, అద్దాలు పగలడం లాంటివి జరుగుతుంటాయి. వాస్తవానికి మనం పట్టించుకోకుండా వదిలేసే చిన్నచిన్న విషయాలే వీటికి ప్రధాన కారణం అని నిపుణులు చెబుతున్నారు. ముందు జాగ్రత్తలు తీసుకుంటే, ఇలాంటి ప్రమాదాలను చాలా సులువుగా నివారించవచ్చని సూచిస్తున్నారు.

కారులో పేలుడు జరగడానికి, మంటలు ఎగసిపడడానికి కారణాలు ఏమిటి?

  1. సన్​గ్లాసెస్​ : చాలా మంది వేసవిలో సన్​గ్లాస్​లు వాడుతూ ఉంటారు. కారు నడిపేటప్పుడు వాటిని డ్యాష్​బోర్డ్​పై పెట్టేస్తారు. అయితే ఎండలో కారును పార్క్‌ చేసినప్పుడు, సన్​గ్లాస్​లు భూతద్దంలా పనిచేసి అగ్ని ప్రమాదానికి కారణం అవుతాయి. ఒక వేళ మీరు ప్లాస్టిక్‌ ఫ్రేమ్‌ ఉన్న కళ్లజోడు వాడుతుంటే, అవి వేడికి కరిగిపోయే అవకాశం ఉంటుంది.
  2. స్ప్రే క్యాన్స్​ : వేసవిలో దుర్వాసన పోవడం కోసం చాలా మంది సెంట్లు, రూం స్ప్రేలు వాడుతూ ఉంటారు. అయితే ఈ సెంటు, స్ప్రే బాటిళ్లలో స్పిరిట్ ఉంటుంది. దీని వల్ల ఉష్ణోగ్రత పెరిగే కొలదీ, ఈ క్యాన్లలో ఒత్తిడి పెరుగుతుంది. ఫలితంగా ఇవి పేలిపోయే ప్రమాదం ఉంటుంది. అందుకే ఎండలో నిలిపి ఉన్న కార్లలో సెంట్ బాటిళ్లు​, రూం స్ప్రేలు లాంటి వాటిని ఉంచకూడదు.
  3. లైటర్స్ : చాలా మందికి సిగరెట్లు, బీడీలు, చుట్టలు కాల్చే అలవాటు ఉంటుంది. ఇలాంటి వారు లైటర్లను తమ వెంట తీసుకుని వెళ్తూ ఉంటారు. అయితే ఈ లైటర్లను పొరపాటున కూడా కార్లలో వదిలేయకూడదు. ఎందుకంటే, వాహనం ఎక్కువ సేపు ఎండలో ఉంటే, ఈ లైటర్ల నుంచి మంటలు వ్యాపించే ప్రమాదం ఉంటుంది.
  4. బ్యాటరీలు : కారు లోపల బ్యాటరీలు ఉంచకూడదు. అవి కొత్తవైనా, పాతవైనా సరే. ఎందుకంటే, అత్యధిక ఉష్ణోగ్రతల వద్ద ఇవి లీక్ అయ్యే ప్రమాదం ఉంటుంది. వీటిలో విషపూరితమైన యాసిడ్స్ ఉంటాయి. అందువల్ల ఇవి లీక్ అయితే కార్ ఇంటీరియర్ కూడా దెబ్బతినవచ్చు. లేదా కొన్ని సార్లు ప్రాణాలకే ముప్పు ఏర్పడవచ్చు.
  5. మేకప్​ సామగ్రి : మహిళలు తమ అందాలను దిద్దుకోవడానికి మేకప్ సామగ్రిని ఉపయోగిస్తూ ఉంటారు. అయితే ఈ మేకప్ కిట్​ను, లేదా మేకప్ సామగ్రిని కారులో ఉంచకూడదు. ఎందుకంటే, అత్యధిక ఉష్ణోగ్రతల వద్ద వీటికి మండే స్వభావం ఉంటుంది. లేదా ఇవి కరిగిపోయి పాడయిపోతాయి.
  6. కొవ్వొత్తులు : కార్లలో కొవ్వొత్తులు కూడా ఉంచకూడదు. ముఖ్యంగా గ్లాస్​ కంటైనర్లలో కొవ్వొత్తులు ఉంచకూడదు.
  7. మద్యం : కొంత మంది ఆల్కహాల్ తీసుకుంటూ ఉంటారు. ఇలాంటి వారు కార్లలో మద్యం సీసాలు, క్యాన్లు ఉంచుతారు. కానీ ఇలా చేయడం ఏ మాత్రం మంచిది కాదు. ఎందుకంటే, ఇలాంటి కార్బొనేటెడ్ డ్రింక్స్​ ఉష్ణోగ్రతలు ఎక్కువగా ఉన్నప్పుడు పేలిపోయే ప్రమాదం ఉంటుంది.
  8. హ్యాండ్ శానిటైజర్స్ : కరోనా మహమ్మారి విజృంభణ తరువాత చాలా మంది హ్యాండ్ శానిటైజర్లను వినియోగించడం మొదలుపెట్టారు. అయితే వీటిలో ఆల్కహాల్ ఎక్కువగా ఉంటుంది. కనుక ఇవి కూడా బాగా ఎక్కువ వేడి తగిలినప్పుడు పేలిపోయే ప్రమాదం ఉంటుంది. అందుకే ఎండలో నిలిపిన కారులో హ్యాండ్​ శానిటైజర్లు ఉంచకపోవడమే మంచిది.

ఈ జాగ్రత్తలు కూడా తప్పనిసరి!

  • వేసవి ఎండలో నిలిపిన కార్లలో పసి పిల్లలను, పెంపుడు జంతువులను ఉంచకూడదు. ఎందుకంటే, కిటికీలు తీసి ఉంచినప్పటికీ, వేసవి కాలంలో కారులో ఉష్ణోగ్రతలు విపరీతంగా పెరుగుతుంటాయి.
  • కారులో సన్​ క్రీమ్​లు ఉంచకూడదు. ఎందుకంటే, ఇవి వేడికి కరిగిపోతాయి.
  • ఎలక్ట్రానిక్‌ వస్తువులను ఉంచి, కారును ఎండలో పార్క్‌ చేస్తే, వాటిలోని బ్యాటరీలు, చిప్స్ దెబ్బతింటాయి.
  • ఎండలో ఉంచిన కారులో ఔషధాలు కూడా ఉంచకూడదు. ఎందుకంటే ఔషధాలను గది ఉష్ణోగ్రతల వద్దనే ఉంచాలి. సూర్యకాంతి వాటిపై పడకుండా చూసుకోవాలి. అప్పుడే అవి పాడవకుండా ఉంటాయి.
  • వేసవిలో చాలా మంది చెరువులు, నదులు, సముద్రాలు, స్మిమ్మింగ్ పూల్స్​ వద్ద స్నానాలు చేస్తుంటారు. అలాంటి సమయంలో తడిసిన టవల్స్​ను కారులో ఉంచకూడదు. దీని వల్ల కారు ఇంటీరియర్ దెబ్బతినే అవకాశం ఉంటుంది. పైగా ఇన్ఫెక్షన్లు వేగంగా వ్యాపించే ప్రమాదముంటుంది.
  • వేసవి కాలంలో కారులో మొక్కలను ఉంచకూడదు. ఒక వేళ ఉంచితే, అవి కొన్ని గంటల్లోనే చనిపోయే ప్రమాదం ఉంటుంది. లేదా వాటిలోని తేమ శాతం బాగా పడిపోతుంది.
  • వేసవి కాలంలో ఆహార పదార్థాలను కూడా కారులో ఉంచకూడదు. ఎందుకంటే అధిక ఉష్ణోగ్రతల వద్ద ఆహార పదార్థాలు త్వరగా చెడిపోతాయి. కొన్ని సార్లు విషపూరితమవుతాయి.

ఘాట్ ​రోడ్లపై కారు ఎలా నడపాలి? - ఈ టిప్స్ కచ్చితంగా పాటించాలి!

రూ.5 లక్షల బడ్జెట్లో మంచి కారు కొనాలా? ఈ టాప్​-3 మోడల్స్​పై ఓ లుక్కేయండి!

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.