ETV Bharat / business

కార్​ లోన్​ వడ్డీ ఏ బ్యాంక్​లో తక్కువ? లేటెస్ట్​ రేట్స్​ ఫుల్ డిటైల్స్ మీకోసం!

కార్ లోన్ కోసం ప్రయత్నిస్తున్నారా? ఏ బ్యాంకులో ఎంత వడ్డీ రేటు ఉందంటే?

Etv Bharat
Etv Bharat (Etv Bharat)
author img

By ETV Bharat Telugu Team

Published : Oct 21, 2024, 2:06 PM IST

Car Loan Interest Rates In Diwali Season : భారతదేశంలో దసరా తరువాత దీపావళి, ధంతేరాస్‌, నవరాత్రి పండుగ సమయాల్లో కార్ల విక్రయాలు భారీగా జరుగుతాయి. అందుకే ఈ డిమాండ్‌ను క్యాష్ చేసుకునేందుకు ప్రముఖ ఆటోమొబైల్ కంపెనీలు అన్నీ భారీగా డిస్కౌంట్లు, ఆఫర్లు ప్రకటిస్తుంటాయి. అలాగే బ్యాంకులు కూడా వెహికల్ ఫైనాన్సింగ్‌పై అదిరిపోయే డీల్స్‌, ప్రమోషనల్ ప్యాకేజెస్‌ అందిస్తుంటాయి. కస్టమర్లను ఆకర్షించేందుకు తక్కువ వడ్డీ రేటుతో రుణాలు ఇస్తుంటాయి. అంతేకాదు ప్రీపేమెంట్ పెనాల్టీలు రద్దు చేయడం, డాక్యుమెంటేషన్ ఫీజులు తగ్గించడం లాంటివి చేస్తుంటాయి. పైగా క్యాష్‌ బ్యాక్‌ ఇన్సెంటివ్స్ కూడా ఇస్తుంటాయి. కొన్ని ఆటోమొబైల్ కంపెనీలు కూడా తమ కస్టమర్లు నచ్చిన బ్యాంకు నుంచి కార్‌ లోన్ తీసుకునే వెసులుబాటు కల్పిస్తాయి. దీని వల్ల కారు కొనుగోలుదారులకు చాలా ప్రయోజనకరంగా ఉంటాయి.

కారు రుణాలు
బ్యాంకులను బట్టి కార్‌ లోన్స్‌పై వడ్డీ రేట్లు కనిష్ఠంగా 8.70 శాతం నుంచి 10 శాతం వరకు ఉంటున్నాయి. క్రెడిట్ స్కోర్ తక్కువగా ఉంటే, ఈ వడ్డీ రేట్లు మరింతగా పెరిగే అవకాశం కూడా ఉంటుంది. కొన్ని బ్యాంకులు వెహికల్ ఆన్‌-రోడ్‌ ప్రైస్‌పై 100 శాతం వరకు ఫైనాన్స్ ఇస్తున్నాయి. మరికొన్ని బ్యాంకులు ఈ కార్ లోన్‌ తీర్చేందుకు 8 ఏళ్ల వరకు సమయం ఇస్తున్నాయి. ఈ కార్‌ లోన్స్‌ మీరు నేరుగా డిజిటల్ ప్లాట్‌ఫామ్స్‌ ద్వారా తీసుకోవచ్చు. లేదా నేరుగా బ్యాంకుకు వెళ్లి కూడా తీసుకోవచ్చు.

కారు రుణాలు ఎవరికి ఇస్తారు?
కార్‌ లోన్ కావాలంటే సిబిల్ స్కోర్ బాగుండాలి. అలాగే ఆదాయ వనరులు, రుణం తీర్చే సామర్థ్యం ఉండాలి. బ్యాంకులు వీటితో పాటు మీరు ఇంతకు ముందు చేసిన అప్పులు, వాటి రీపేమెంట్ హిస్టరీ, క్రెడిట్ ఎక్వైరీలను కూడా చూస్తాయి. అన్నీ బాగుంటేనే బ్యాంకులు తక్కువ వడ్డీ రేటుకు కారు రుణాలు మంజూరు చేస్తాయి. సాధారణంగా క్రెడిట్‌ స్కోర్‌ 750 కంటే ఎక్కువ ఉంటే కారు లోన్ వచ్చే అవకాశం ఎక్కువగా ఉంటుంది. ఒక వేళ ఇంతకంటే తక్కువ వడ్డీ రుణం మంజూరు కాకపోవచ్చు. లేదా అధిక వడ్డీ చెల్లించాల్సి రావచ్చు.

కార్ లోన్స్‌పై వడ్డీ రేటు - ఏ బ్యాంకులో ఎంతంటే?
ఒక వ్యక్తి కారు లోన్ కింద రూ.1 లక్ష తీసుకున్నాడు అనుకుందాం. అతను 7 సంవత్సరాల్లో ఆ లోన్ అమౌంట్‌ను తీర్చాలని నిర్ణయించుకుంటే, నెలవారీగా వసూలు చేసే కనిష్ఠ వడ్డీ, నెలవారీ ఈఎంఐ - ఏ బ్యాంక్‌లో ఎంత ఉంటుందో ఈ పట్టిక ద్వారా తెలుసుకుందాం.

బ్యాంక్‌కనిష్ఠ వడ్డీ రేటు (p.a)ఈఎంఐ
ఎస్‌బీఐ 9.05% రూ.1,611
ఇండియన్ ఓవర్సీస్‌ బ్యాంక్‌ 8.85% రూ.1,601
కెనరా బ్యాంక్‌ 8.70% రూ.1,594
హెచ్‌డీఎఫ్‌సీ బ్యాంక్‌ 9.40% రూ.1,629
ఐసీఐసీఐ బ్యాంక్‌ 9.10% రూ.1,614
కరూర్‌ వైశ్య బ్యాంక్ 9.60% రూ.1,640
సౌత్ ఇండియన్ బ్యాంక్‌ 8.75% రూ.1,596
కర్ణాటక బ్యాంక్‌ 8.88% రూ.1,611
ఫెడరల్ బ్యాంక్ ఆఫ్ ఇండియా 8.85% రూ.1,601
యూనియన్ బ్యాంక్‌ 8.70% రూ.1,594
యాక్సిస్ బ్యాంక్‌ 9.30% రూ.1,624
బ్యాంక్ ఆఫ్ ఇండియా 8.85% - రూ.1,601
జమ్మూకశ్మీర్‌ బ్యాంక్‌ RLLR+ 0.75% (ఫ్లోటింగ్ రేటు)
RLLR+ 0.25% (ఫిక్స్‌డ్‌ రేటు)
ఐడీబీఐ బ్యాంక్‌ 8.85% (ఫ్లోటింగ్ రేటు)
8.80% (ఫిక్స్‌డ్‌ రేటు)
పంజాబ్ నేషనల్ బ్యాంక్‌ 8.75% (ఫ్లోటింగ్ రేటు)
9.75% (ఫిక్స్‌డ్‌ రేటు)
రూ.1,596
రూ.1,647
బ్యాంక్ ఆఫ్ బరోడా 8.95% (ఫ్లోటింగ్ రేటు)
9.40% (ఫిక్స్‌డ్‌ రేటు)
రూ.1,629
రూ.1,629

నోట్‌ : ఈ టేబుల్‌లో ఇచ్చినవి కేవలం కనిష్ఠ వడ్డీ రేట్లు, కనీస ఈఎంఐ అమౌంట్‌లు మాత్రమే. మీ క్రెడిట్ స్కోర్‌ను బట్టి మీ నుంచి వసూలు చేసే వడ్డీ రేట్లు మారుతూ ఉంటాయి. ఈ విషయాన్ని మీరు గమనించాలి.

దీపావళికి కారు కొనాలా? ఆ మోడల్​పై రూ.2.30 లక్షలు డిస్కౌంట్​- మిగిలిన వాటిపై ఎంతంటే?

దీపావళికి మంచి కారు కొనాలా? రూ.10 లక్షల బడ్జెట్లో లభించే టాప్‌-5 మోడల్స్ ఇవే!

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.