Car Interior Cleaning Tips : లక్షలు ఖర్చు చేసి కొన్న కార్లను ఎప్పటికప్పుడు శుభ్రం చేయకపోతే వాటికి ఉండే లుక్ పోతుంది. అది కారు ఎక్స్టర్నల్ లుక్ అయినా ఇంటర్నల్లుక్ అయినా కానివ్వండి. అయితే చాలామంది కారు ఇంటీరియర్‌ను క్లీన్ చేసుకోలేక అనేక ఇబ్బందులు పడుతుంటారు. దానిని ఎలా క్లీన్ చేయాలో కూడా చాలామందికి తెలియదు. ఈ నేపథ్యంలో కొన్ని సులువైన చిట్కాలను పాటించడం ద్వారా మన కారు ఇంటీరియర్‌ను మనమే ఇంటి వద్ద చక్కగా క్లీన్ చేసుకోవచ్చు.
టూత్ బ్రష్‌తో క్లీనింగ్
మీ కారు లోపల ఇరుకు ప్రదేశాల్లో పేరుకుపోయిన దుమ్ము, ధూళిని శుభ్రపరచడానికి టూత్ బ్రష్ ఉపయోగించడం బెటర్. టూత్ బ్రష్‌తో కారు లోపలి భాగం ఇరుకు సందుల్లో శుభ్రం చేయడం వల్ల అందులో ఉన్న మురికి వదులుతుంది. టూత్ బ్రష్, నాన్ బ్రాసివ్ క్లీనర్ సాయంతో శుభ్రం చేసుకోవచ్చు.
బేబీ వైప్స్, మైక్రో ఫైబర్ క్లాత్
డాష్ బోర్డ్, లెదర్ సీట్లు, స్టీరింగ్ వీల్‌ను శుభ్రం చేయడానికి బేబీ వైప్స్ బాగా ఉపయోగపడతాయి. మైక్రోఫైబర్ క్లాత్‌తో కూడా కారు ఇంటిరీయర్ను శుభ్రం చేసుకోవచ్చు.
మార్కెట్లో దొరికే జెల్స్ తో శుభ్రం
మార్కెట్లో దొరికే కొన్ని రకాల జెల్ లను ఉపయోగించి కారును క్లీన్ చేసుకోవచ్చు. ఈ జెల్స్ దుమ్ము, ధూళి, కారులో రాలిపోయిన జుట్టును బయటకు తీస్తాయి. స్టీరింగ్ వీల్, గేర్ షిఫ్ట్, కన్సోల్‌పై ఉన్న మురికిని శుభ్రం చేసేందుకు ఈ జెల్స్ ఉపయోగపడతాయి.
క్లేబార్తో శుద్ధి
క్లేబార్ను ఉపయోగించి కారు లోపలి భాగంలో ఉన్న దుమ్ము, ధూళిని పొగొట్టవచ్చు. క్లేబార్తో జిడ్డును పొగొట్టొచ్చు.
హ్యాండ్ హెల్డ్ స్టీమర్‌తో శానిటైజేషన్
మీ కారు లోపల భాగంలో హ్యాండ్ హెల్డ్ స్టీమర్‌తో లిక్విడ్ కలిపిన వాటర్‌ను శానిటైజ్ చేయండి. అప్పుడు మొండి మరకలు వదులుతాయి. తివాచీల మురికి వాసన కూడా తగ్గుతుంది.
ఆలివ్ ఆయిల్‌తో నిగారింపు
ఆలివ్ ఆయిల్ కేవలం వంటకే కాదు, కారు ఇంటిరీయర్ను మిళమిళలాడేలా చేయడంలోనూ ఉపయోగపడుతుంది. ఆలివ్ ఆయిల్ కారు డాష్ బోర్డ్ సహా కారు లోపలి భాగాలను నిగనిగలాడేలా చేస్తుంది. మృదువైన బ్రష్ లేదా మైక్రో ఫైబర్ క్లాత్‌పై కొన్ని చుక్కల ఆలివ్ ఆయిల్ వేసి క్లీన్ చేయాలి. ఆలియా ఆయిల్ మీ లెదర్ ఇంటీరియర్‌ను మరింత మెరిసేలా చేస్తుంది.
కారు సీట్లపై స్ప్రే
మీ కారు సీట్లను క్లీన్ చేయడం ఒక సవాలుగా ఉంటుంది. డిష్ వాషింగ్ లిక్విడ్, ఐసోప్రొపైల్ ఆల్కహాల్‌ను మిక్సింగ్ చేసి ఒక స్ప్రే బాటిల్‌లో వేయండి. ఈ ద్రావణాన్ని సీటుపై స్ప్రే చేయండి. వెంటనే మరకలు ఉన్న చోట మైక్రోఫాబ్రిక్ వస్త్రంతో తుడవండి. ఆ తర్వాత మీ కారు కిటీకీలు తీసేయండి. అప్పుడు కారు సీట్లు ఎండిపోతాయి.
కారు మ్యాట్లు మెరవడానికి షూ పాలిష్
మీ షూ పాలిష్ చేసే బ్రష్‌తో కారు మ్యాట్లను తళతళలాడేలా చేయవచ్చు. మొదట కారు మ్యాట్లను ఉతికి తర్వాత షూను పాలిష్ చేసే బ్రష్‌తో రుద్దాలి. అప్పుడు మీ మ్యాట్లు అందంగా తయారవుతాయి.
న్యూస్ పేపర్లతో కిటీకీలు క్లీనింగ్
న్యూస్ పేపర్‌తో కారు కిటికీలను శుభ్రపరుచుకోవచ్చు. రంగులేని న్యూస్ పేపర్‌తో కారు కిటీకీలు క్లీన్ చేసుకోవాలి. లేదంటే మీ కిటికీ గ్లాస్‌పై మరకలు పడే అవకాశాలు ఉన్నాయి. కారుపై ఉన్న స్టిక్కర్లను సులభంగా తొలగించడానికి కూడా న్యూస్ పేపర్ ఉపయోగపడుతుంది. న్యూస్ పేపర్‌ను నీటిలో తడిపి స్టిక్కర్‌పై అప్లై చేయండి. కాసేపు తర్వాత ఆ స్టిక్కర్ ఈజీగా వచ్చేస్తుంది.
కాఫీ పిప్పితో కారులో దుర్వాసనకు చెక్!
కారు లోపల కొన్ని సార్లు దుర్వాసనలు వస్తుంటాయి. వాటిని అరికట్టడానికి కాఫీ పిప్పిని వాడాలి. క్లాత్‌లో కాఫీ పిప్పిను నింపి కారు సీటు కింద లేదా వేరే భాగంలో పెట్టడం వల్ల దుర్వాసననను అరికట్టవచ్చు.