Best Tips to Extend Car Engine Life : కారు లైఫ్ పెరగాలంటే.. సరిగ్గా డ్రైవ్ చేయడం మాత్రమే కాదు.. "ఇంజిన్ ఐడిల్"కు సంబంధించిన కొన్ని టిప్స్ కూడా ఫాలో అవ్వాలంటున్నారు నిపుణులు. వాటి ద్వారా కారు(Car) ఇంజిన్ లైఫ్‌ను పెంచుకోవచ్చని, ఫ్యూయల్ సేవ్ చేసుకోవచ్చని సూచిస్తున్నారు. ఇంతకీ.. ఆ టిప్స్ ఏంటో ఈ స్టోరీలో తెలుసుకుందాం.
కారును స్టార్ట్ చేసి.. గేరు వేయకుండా ఇంజిన్‌ను రన్నింగ్‌లో ఉంచడాన్ని 'ఇంజిన్ ఐడిలింగ్' అంటారు. మీరు ఫ్యూయల్ సేవ్ చేసుకోవడంతోపాటు ఇంజిన్ లైఫ్ పెంచుకోవాలనుకుంటే.. ఇంజిన్ ఐడిల్‌కు సంబంధించిన ఈ విషయాలు తప్పనిసరిగా తెలుసుకోవాలి. రోజులో మొదటిసారి కారును స్టార్ట్ చేసినప్పుడు తప్పకుండా కనీసం 30 సెకండ్ల పాటు ఇంజిన్‌ను ఐడిల్ మోడ్‌లో ఉంచాలి. ఆ తర్వాతే గేరు వేయాలి. ఈ విధంగా చేయడం వల్ల ఆయిల్ ఇంజిన్ మొత్తం వ్యాపించి స్మూత్ రన్నింగ్‌కు సహకరిస్తుందని చెబుతున్నారు ఆటో మొబైల్ రంగ నిపుణులు. అదేవిధంగా.. ఇంజిన్ ఆఫ్ చేయాలనుకున్నప్పుడు కూడా 30 సెకండ్లపాటు ఇంజిన్ ఐడిల్ మోడ్‌లో ఉంచడం చాలా అవసరమంటున్నారు.
ఆ టైమ్‌లో ఎక్కువసేపు ఐడిల్‌గా ఉంచకూడదు : ఇంజిన్ ఐడిల్‌గా ఉంచితే మంచిదంటున్నారని.. ఎప్పుడు బడితే అప్పుడు ఉంచొద్దని హెచ్చరిస్తున్నారు. మీరు ట్రాఫిక్‌లో లేదా ఏదైనా పనిమీద కొద్దిసేపు కారు ఆపాల్సి వస్తే.. ఇంజిన్ ఐడిల్‌గా ఉంచకపోవడమే మంచిదని అంటున్నారు. అంటే.. ఇంజిన్‌ను ఆన్‌లో ఉంచకుండా ఆఫ్ చేయాలన్నమాట. 20 సెకండ్లను మించి కారును ఆపాల్సి వస్తే.. వెంటనే ఇంజిన్ ఆఫ్ చేయడం మంచిది అంటున్నారు.
ఎందుకంటే.. కారు ఇంజిన్‌ను 10 సెకండ్ల కంటే ఎక్కువ సేపు ఆన్‌లో ఉంచడం వల్ల అయ్యే ఫ్యూయల్ ఖర్చు.. కారును స్టార్ట్ చేయడానికి కావాల్సిన ఇంధన ఖర్చు కన్నా ఎక్కువగా ఉంటుందంటున్నారు నిపుణులు. కారు ఇంజిన్ 2 నిమిషాలు ఆన్‌లో ఉంటే అయ్యే ఫ్యూయల్ ఖర్చుతో సుమారు ఒక మైలు దూరం ప్రయాణించవచ్చట!
ఏసీ ఆన్ చేసి కారు నడిపితే - మైలేజ్ తగ్గుతుందా?
కారును ఎక్కువ సేపు ఐడిల్‌గా ఉంచడం వల్ల ఫ్యూయల్ ఖర్చు పెరగడమే కాదు.. మరికొన్ని సమస్యలు తలెత్తే అవకాశం ఉందంటున్నారు నిపుణులు. ముఖ్యంగా ఎక్కువ సేపు ఇంజిన్ ఆన్‌లో ఉంచడం కారణంగా.. ఇంజిన్‌లోని విడిభాగాలు దెబ్బతినే ఛాన్స్ ఉంటుందని చెబుతున్నారు. అలాగే.. సిలిండర్లు, స్పార్క్ ప్లగ్‌లు, ఎగ్జాస్ట్ సిస్టమ్ (సైలెన్సర్)లలో సమస్యలు తలెత్తవచ్చని నిపుణులు పేర్కొంటున్నారు. కాబట్టి.. మీరు కారు నడిపేటప్పుడు ఇంజిన్ ఐడిలింగ్ విషయంలో జాగ్రత్తగా ఉండాలని సూచిస్తున్నారు. 10 సెకండ్ల కంటే ఎక్కువ సేపు ఇంజిన్ ఆన్‌లో ఉంచాల్సి వచ్చినప్పుడు.. ఆఫ్ చేయడమే మంచిదని సూచిస్తున్నారు. ఇలా చేయడం ద్వారా మీ కారు ఇంజిన్ లైఫ్ టైమ్ పెరగడమే కాకుండా.. ఇంధనం కూడా ఆదా అవుతుందని చెబుతున్నారు నిపుణులు.
షాకింగ్ : కారు సీటుతో సంతాన సామర్థ్యానికి దెబ్బ - పిల్లలు పుట్టరా?