ETV Bharat / business

మొదటిసారి కారు కొంటున్నారా? ఈ టాప్‌-13 టిప్స్‌ మీ కోసమే! - Car Buying Tips - CAR BUYING TIPS

Car Buying Tips : చాలా మందికి కొత్త కారు కొనాలని ఆశగా ఉంటుంది. ఇందుకోసం చాలా డబ్బు దాచుకుంటారు. అయితే సరైన కారు ఎంచుకోకపోతే, తరువాత చాలా బాధపడాల్సి వస్తుంది. అందుకే ఈ ఆర్టికల్‌లో మీకు సరిపడే మంచి కారును ఎలా ఎంచుకోవాలో తెలుసుకుందాం.

Car Buying Tips
New car buying tips (ETV Bharat)
author img

By ETV Bharat Telugu Team

Published : Aug 17, 2024, 3:09 PM IST

Car Buying Tips : ప్రస్తుత కాలంలో ఫ్యామిలీతో కలిసి ప్రయాణాలు చేయాలంటే కారు ఉండాల్సిందే. అందుకే చాలా మంది డబ్బులను పొదుపు చేసి కారును కొనుగోలు చేయాలనుకుంటారు. తమకున్న బ‌డ్జెట్లో, మంచి కలర్​, ఫీచ‌ర్స్ ఉన్న కారు కోసం ఆలోచిస్తుంటారు. మీరు కూడా ఇలానే ఆలోచిస్తున్నారా? అయితే ఇది మీ కోసమే. మీకు సరిపడే మంచి కారును ఎలా ఎంచుకోవాలో ఈ ఆర్టికల్ ద్వారా తెలుసుకుందాం.

  1. ప్రయోజనం, వినియోగం
    కారును కొనుగోలు చేయడం వెనుక ఉన్న ఉద్దేశ్యం ఏంటి? అని మొదటి ఆలోచించండి. దీనిపై స్పష్టత తెచ్చుకోండి. రోజువారీ ప్రయాణాల కోసమా? లాంగ్ డ్రైవ్‌ కోసమా? అని నిర్ణయించుకోండి. అప్పుడు సీటింగ్ సామర్థ్యం, మైలేజ్ వంటి అంశాల ఆధారంగా కారు మోడల్‌ను ఎంపిక చేసుకోవచ్చు. అలాగే హైవేలు, సిటీ రోడ్లు, ఆఫ్ రోడ్లు - వీటిలో వేటిపై ప్రయాణం చేయాలి అనేది కూడా ఆలోచించాలి. రద్దీగా ఉండే సిటీ రోడ్లపై ప్రయాణం చేయాలంటే, హ్యాచ్‌బ్యాక్ కారును ఎంచుకోవడం మంచిది.
  2. కారు కొనే ముందు మీరు ఆలోచించాల్సిన అంశాలు
    కారు కొనడానికి ముందు మిమ్మల్ని మీరు కొన్ని ప్రశ్నలు వేసుకోవాలి. కొత్త కారును ఎంచుకునే సమయంలో మీ డ్రైవింగ్ అనుభవాన్ని పరిగణనలోకి తీసుకోవడం చాలా ముఖ్యం. మీరు అనుభవజ్ఞులైన డ్రైవర్ అయితే సెడాన్లు, ఎస్‌యూవీలను ఎంచుకోవచ్చు. మీకు డ్రైవింగ్ చేయడం కొత్త అయితే హ్యాచ్‌బ్యాక్‌ కారు కొనుక్కోవడం బెటర్. ట్రాఫిక్ రద్దీ, మెట్రో నగరాల్లో కారును వాడాలంటే హ్యాచ్‌బ్యాక్ బాగుంటుంది. ఆఫ్ రోడ్‌లో డ్రైవ్ చేయాలనుకుంటే, ఎస్‌యూవీను ఎంచుకోవడం మంచిది. అలాగే మీరు కొత్తగా కొనబోయే కారులో ఏయే ఫీచర్లు ఉండాలని ఆశిస్తున్నారో, వాటిపై ఓ స్పష్టతతో ఉండండి. పవర్ విండోస్, ఆటోమేటిక్ గేర్ షిఫ్ట్, ఆటోమేటిక్ ఏసీ, మోడ్రన్ సేఫ్టీ డివైజ్‌లు ఇలా మీకు కావాల్సిన ఫీచర్లు ఉన్న కారును ఎంపిక చేసుకోండి.
  3. బడ్జెట్
    కారును కొనాలనుకునేటప్పుడు మరొక విషయం కూడా గుర్తుంచుకోవాలి. అదే బడ్జెట్. మీ స్థాయికి తగ్గట్లు అంటే మీరు కొనుగోలు చేయగలినంత బడ్జెట్‌లోనే ఉన్న కారు ఎంచుకోండి. అన్నికంటే ముఖ్యంగా కారు ఆన్‌-రోడ్ ధరను ఎల్లప్పుడూ పరిగణించాలని గుర్తుంచుకోండి. మీరు బడ్జెట్‌ను నిర్ణయించుకున్న తర్వాత కార్లను ఈజీగా షార్ట్‌ లిస్ట్ చేయొచ్చు.
  4. ఆన్‌లైన్ రీసెర్చ్
    మీ అవసరం, బడ్జెట్ గురించి క్లారిటీ వచ్చిన తర్వాత మీరు కొనుగోలు చేయాలనుకుంటున్న కారు మోడల్‌పై ఆన్‌లైన్ రీసెర్చ్ చేయండి. కొత్త కార్లకు సంబంధించిన అనేక వెబ్‌సైట్లు, ఆన్‌లైన్‌లో ప్రొఫెషనల్ కార్ రివ్యూలను పరిశీలించండి. ఈ రీసెర్చ్ మీకు కారు కొనుగోలులో ఉపయోగపడుతుంది.
  5. ఆటోమేటిక్ లేదా మాన్యువల్
    మీరు కొత్త కారును కొనుగోలు చేసేటప్పుడు ట్రాన్స్‌మిషన్ అనేది కీలకమైన అంశమే. సిటీలో డ్రైవింగ్‌ చేసిన అనుభవం మీకు లేకుంటే, ఆటోమేటిక్ గేర్‌బాక్స్ ఆప్షన్ ఎంచుకోవడం మంచిది. మీకు డ్రైవింగ్‌లో ఎక్స్‌పీరియన్స్ ఉంటే మాన్యువల్ గేర్‌బాక్స్ తీసుకోవడం మంచిది.
  6. పెట్రోల్, డీజిల్, సీఎన్‌జీ
    ఫ్యూయల్ వేరియంట్‌ను బట్టి కూడా కారు ధర ఆధారపడి ఉంటుంది. సాధారణంగా పెట్రోల్ ఇంజిన్ కార్లతో పోలిస్తే, డీజిల్ కార్ల ధర కాస్త ఎక్కువ. అలాగే పెట్రోల్ ఇంజిన్లు, డీజిల్ ఇంజిన్ల కంటే తక్కువ శక్తిని ఉత్పత్తి చేస్తాయి. కాబట్టి, మీరు రోడ్లపై వేగంగా వెళ్లాలనుకుంటే పెట్రోల్ ఇంజిన్‌ వేరియంట్ కారు బెటర్. ఎస్‌యూవీ, సెడాన్ కొనుగోలు చేస్తే, డీజిల్ వేరియంట్ బెస్ట్ ఆప్షన్ అవుతుంది. పట్టణాల్లో ప్రయాణాలకు హ్యాచ్‌బ్యాక్ కారు వాడితే, సీఎన్‌జీ ఫ్యూయల్ వేరియంట్ మంచిది. పెట్రోల్, డీజిల్ కార్లతో పోలిస్తే, సీఎన్‌జీ ధర కాస్త తక్కువగా ఉంటుంది.
  7. టెస్ట్ డ్రైవ్
    మీరు కారు కొనాలనుకునేటప్పుడు దాన్ని టెస్ట్ డ్రైవ్ చేయాలి. దీనివల్ల కారు కండిషన్‌, స్పెక్స్, ఇంజిన్ సామర్థ్యం వంటివి తెలుస్తాయి. టెస్ట్ డ్రైవ్ చేయకుండా కారును కొనుగోలు చేయకండి.
  8. డిస్కౌంట్లు
    కార్ల తయారీ సంస్థలు, డీలర్లు అనేక సందర్భాల్లో డిస్కౌంట్లను ప్రకటిస్తారు. కనుక ఆ సమయంలో కారు కొనేందుకు ప్లాన్ చేసుకోండి. మీకు డిస్కౌంట్ల ద్వారా మిగిలిన డబ్బును కార్ యాక్సెసరీస్‌లో పెట్టుబడి పెట్టవచ్చు.
  9. ఫైనాన్స్‌
    కారు కొనడానికి మీ వద్ద కావాల్సినంత డబ్బులు లేకపోతే లోన్ తీసుకోవాల్సి ఉంటుంది. అందుకే ప్రీ-అప్రూవ్డ్ లోన్లు ఉంటే వాటికి అప్లై చేసుకోండి. అలాగే లోన్ కాలపరిమితిని ఎంచుకునేటప్పుడు జాగ్రత్తగా ఉండండి. 3-5 ఏళ్ల లోన్ కాలపరిమితిని ఎంచుకోవడం మంచిది. దీంతో వడ్డీ తక్కువ పడుతుంది.
  10. పాత కారును ఎక్స్ఛేంజ్ చేస్తున్నారా?
    చాలా మంది పాత కారును ఎక్స్ఛేంజ్‌లో ఇచ్చేసి కొత్త దాన్ని కొనాలనుకుంటారు. ఇలా చేయడం వల్ల డబ్బులు ఆదా అవుతాయి. పాత కారు కొనేవారి కోసం వెతకనక్కర్లేదు. అయితే డీలర్ మీ సెకండ్ హ్యాండ్ కారుకు తక్కువ ధరను ఇవ్చొచ్చు.
  11. కారు బీమా
    భారతదేశంలోని అన్ని కార్లకు బీమా తప్పనిసరి. కాబట్టి, మీరు కొత్త కారును కొనుగోలు చేసినప్పుడు తప్పనిసరిగా థర్డ్ పార్టీ కార్ ఇన్సూరెన్స్ ప్లాన్‌ తీసుకోవాల్సిందే. కానీ విస్తృతమైన బీమా కవరేజ్ కోసం కాంప్రిహెన్షివ్ ఇన్సూరెన్స్‌ ప్లాన్‌ తీసుకోవడం మంచిది.
  12. నో క్లెయిమ్
    మీరు మీ పాత కారును ఎక్స్ఛేంజ్ చేసినప్పుడు, నో క్లెయిమ్ బోనస్ ప్రయోజనాలను, మీ కొత్త వాహనానికి బదిలీ చేయాలని గుర్తుంచుకోండి. అప్పుడు మీ కొత్త కారు కోసం తీసుకునే బీమా ప్రీమియం తగ్గుతుంది.
  13. సమీక్షించి కొనుగోలు చేయండి
    కారు కొనుగోలు చేసేటప్పుడు ఒకటికి పదిసార్లు ఆలోచించండి. డీలర్‌షిప్‌ నుంచి ఎంత ధరకు కారు లభిస్తుందో చెక్ చేసుకోండి. అలాగే డీలర్ మీపై సర్వీస్ ఛార్జీలు వంటివి విధించకుండా చూసుకోండి.

ప్లాట్‌ లేదా ఫ్లాట్‌ కొనాలా? తప్పనిసరిగా చెక్‌ చేయాల్సిన డాక్యుమెంట్స్‌ ఇవే! - Property Documents Checklist

రూ.2లక్షల్లో మంచి టూ-వీలర్​ కొనాలా? త్వరలో లాంఛ్ కానున్న టాప్-10 మోడల్స్ ఇవే! - Upcoming Bikes Under 2 Lakh

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.