Byjus Vacates Office Spaces : బెంగళూరుకు చెందిన ప్రముఖ ఎడ్‌టెక్ సంస్థ బైజూస్ ఆర్థిక కష్టాలు మరింత తీవ్రమయ్యాయి. ఈ నెలలో తమ ఉద్యోగులకు జీతాలు కూడా పూర్తిగా చెల్లించలేకపోయింది. ఇప్పుడు అద్దెల భారం భరించలేక, దేశవ్యాప్తంగా ఉన్న బైజూస్ ఆఫీసులను ఖాళీ చేయాలని నిర్ణయించుకున్నట్లు తెలుస్తోంది.
వర్క్ ఫ్రమ్ హోమ్
బైజూస్ దాదాపు 15 వేల మంది ఉద్యోగులను పూర్తిగా ఇంటి నుంచే పని (వర్క్ ఫ్రమ్ హోమ్) చేయమని ఆదేశించినట్లు సమాచారం. ప్రస్తుతానికి బెంగళూరులోని బైజూస్ ప్రధాన కార్యాలయం మాత్రమే పనిచేస్తోందని కంపెనీ వర్గాలు వెల్లడించాయి.
నిధుల కొరతతో సతమతం
బైజూస్ తీవ్రమైన నిధుల కొరతతో సతమతం అవుతోంది. అందుకే గత కొన్ని నెలలగా అద్దె ఒప్పందాలను పునరుద్ధరించడం లేదని తెలుస్తోంది. అందుకే ఆఫీసులు అన్నింటినీ క్రమంగా ఖాళీ చేస్తూ వస్తోంది. అయితే ఆరు నుంచి పదో తరగతి విద్యార్థుల కోసం కేటాయించిన ట్యూషన్ సెంటర్లు మాత్రం యథావిధిగా పనిచేస్తాయని బైజూస్ వర్గాలు వెల్లడించాయి.
దేశం విడిచి వెళ్లకూడదు!
బైజూస్ సంస్థ గత కొన్ని నెలలుగా తీవ్రమైన నిధుల కొరతతో సతమతం అవుతోంది. దాదాపు 1.2 బిలియన్ డాలర్ల రుణం విషయంలో న్యాయపరమైన చిక్కులు ఎదుర్కొంటోంది. మరోవైపు కంపెనీ ఆర్థిక పరిస్థితి రోజురోజుకీ దిగజారుతుండటంతో, పలువురు పెట్టుబడిదారులు తమ వాటాలను ఉపసంహరించుకుంటున్నారు. ఈ పరిణామాల నేపథ్యంలో, బైజూస్ సీఈఓ రవీంద్రన్‌ను తొలగించాలని ప్రవేశపెట్టిన తీర్మానానికి ఆ కంపెనీ ఆమోదం తెలిపింది. సంస్థకు చెందిన 60 శాతానికి పైగా షేర్హోల్డర్లు తీర్మానానికి అనుకూలంగా ఓటు వేశారు. కంపెనీని సరిగా నిర్వహించలేకపోవడం, వైఫల్యాల కారణంగా, ఆయనను సీఈఓ స్థానం నుంచి తొలగించాలని EGMలో నిర్ణయం తీసుకున్నారు. అయితే సమావేశానికి రవీంద్రన్, ఆయన కుటుంబం దూరంగా ఉంది. తాము లేకుండా ఈ నిర్ణయం చెల్లదని రవీంద్రన్ అంటున్నారు. అయితే అసాధారణ సమావేశంలో తీసుకున్న నిర్ణయం మార్చి 13 లోపు వర్తించదు. ఎందుకంటే బైజూస్‌లోని ప్రముఖ ఇన్వెస్టర్లు మూకుమ్మడిగా అసాధారణ సమావేశానికి పిలుపునివ్వడాన్ని రవీంద్రన్ కర్ణాటక హైకోర్టులో సవాల్ చేశారు. ఈ పిటిషన్‌పై మార్చి 13న జరగనుంది. మరోవైపు బైజూస్ రవీంద్రన్ దేశం విడిచి వెళ్లకుండా ఎన్‌ఫోర్స్‌మెంట్ డైరెక్టరేట్ (ఈడీ) ఆంక్షలు విధించింది.
ఐటీఆర్ ఫైల్ చేస్తున్నారా? ఈ 10 తప్పులు అస్సలు చేయకండి!
స్మాల్/ మిడ్ క్యాప్ స్టాక్స్‌లో ఇన్వెస్ట్ చేస్తున్నారా? జర జాగ్రత్త - ఎందుకంటే?