Byju Raveendran Removed as CEO : బైజూస్ సీఈఓ రవీంద్రన్‌ను తొలగించాలని ప్రవేశపెట్టిన తీర్మానానికి ఆ కంపెనీ ఆమోదం తెలిపింది. సంస్థకు చెందిన 60శాతానికి పైగా షేర్హోల్డర్లు తీర్మానానికి అనుకూలంగా ఓటు వేశారు. కంపెనీని సరిగా నిర్వహించలేకపోవడం, వైఫల్యాల కారణంగా శుక్రవారం జరిగిన అసాధారణ సమావేశం (EGM)లో ఈ నిర్ణయం తీసుకున్నారు. అయితే సమావేశానికి రవీంద్రన్, ఆయన కుటుంబం దూరంగా ఉంది. తాము లేకుండా ఈ నిర్ణయం చెల్లదని రవీంద్రన్ అంటున్నారు.
ఈ అసాధరణ సమావేశంలో రవీంద్రన్, ఆయన కుటుంబ సభ్యులను తొలగించాలనే తీర్మానంతో సహా 7 తీర్మానాలు ప్రవేశపెట్టారు. వాటన్నింటికీ 60 శాతానికి పైగా వాటాదారులు ఏకగ్రీవంగా ఓటు వేశారు.
అయితే అసాధారణ సమావేశంలో తీసుకున్న నిర్ణయం మార్చి 13 లోపు వర్తించదు. ఎందుకంటే బైజూస్‌లోని ప్రముఖ ఇన్వెస్టర్లు మూకుమ్మడిగా అసాధారణ సమావేశానికి పిలుపునివ్వడాన్ని రవీంద్రన్, కర్ణాటక హైకోర్టులో సవాల్ చేశారు. ఈ పిటిషన్‌పై మార్చి 13న జరగనుంది. అయితే ఈ అసాధారణ సమావేశంపై స్టే ఇవ్వాలని కర్ణాటక హైకోర్టును ఆశ్రయించారు. కానీ స్టే ఇవ్వడానికి హైకోర్టు నిరాకరించింది.
అయితే రవీంద్రన్ పదవి నుంచి తొలగించి కొత్త బోర్డును ఎన్నుకోవాలనే లక్ష్యంతో బైజూస్‌లో ఇన్వెస్టర్లుగా ఉ్నన ప్రోసస్, పీక్ ఎక్స్‌వీ, సోఫినా, లైట్‌స్పీడ్, జనరల్ అట్లాంటిక్, ఛాన్ జుకర్‌బర్గ్ ఇనీషియేటివ్ వంటి సంస్థలు ఈజీఎంకు పిలుపునిచ్చాయి. వీరందరికీ కంపెనీలో 32శాతానికి పైగా వాటా ఉంది.
ఒకప్పుడు ఇండియాలో అత్యంత విలువైన అంకుర సంస్థగా వెలుగొందిన బైజూస్, ఇప్పుడు తీవ్ర గడ్డు పరిస్థితులు ఎదుర్కొంటోంది. సకాలంలో వేతనాలు కూడా చెల్లించలేని పరిస్థితి ఏర్పడింది. ఈ క్రమంలో రవీంద్రన్‌పైనా ఆరోపణలు వచ్చాయి. రూ.9,300 కోట్లకు పైగా విదేశీ మారకద్రవ్య ఉల్లంఘనలకు పాల్పడినట్లు గత నవంబరులో ఎన్ఫోర్స్మెంట్ డైరెక్టరేట్ అభియోగాలు మోపింది. ఈ నేపథ్యంలో పాలనాపరమైన అవకతవకలను కారణంగా చూపుతూ ఆయన్ని తప్పించాలని ఇన్వెస్టర్లు నిర్ణయించారు.
ప్రస్తుతం బైజూస్‌కు సీఈఓగా రవీంద్రన్ వ్యవహరిస్తున్నారు. ఆయన భార్య దివ్య గోకుల్‌నాథ్, సోదరుడు రిజు రవీంద్రన్ బోర్డు సభ్యులుగా కొనసాగుతున్నారు. మిగిలిన బోర్డు సభ్యులు గతేడాది వైదొలిగారు. కంపెనీలో రవీంద్రన్ కుటుంబానికి 26.3 శాతం వాటా ఉంది.
'పేటీఎంకు సహాయం చేయండి'- NPCIని కోరిన RBI
అమెరికాలో గూగుల్ పే బంద్! మరి భారత్ సంగతేంటి? మన డబ్బు భద్రమేనా?