ETV Bharat / business

క్రెడిట్ కార్డుతో బంగారం కొనుగోలు చేస్తే లాభమా? నష్టమా? - Can I buy gold using a credit card

Buying Gold With A Credit Card For Reward Points Right Or Wrong : బంగారం ధర గరిష్ఠ స్థాయికి చేరుకుంది. 10 గ్రాముల బంగారం ధర 72వేలకు చేరువలో ఉంది. ఒకేసారి ఇంత మొత్తంలో నగదు చెల్లించి కొనుగోలు చేయలేనివారు క్రెడిట్ కార్డును వాడుతున్నారు. అయితే ఇలా క్రెడిట్ కార్డుతో బంగారం కొనుగోలు చేయడం లాభమా? నష్టమా? అనేది ఇప్పుడు తెలుసుకుందాం.

Best Credit Card for Gold purchase
Can I buy gold using a credit card
author img

By ETV Bharat Telugu Team

Published : Apr 3, 2024, 12:24 PM IST

Buying Gold With A Credit Card For Reward Points Right Or Wrong : ఆకాశమే హద్దుగా పసిడి ధరలు రికార్డు స్థాయిలో పెరుగుతున్నాయి. 10 గ్రాముల బంగారం ధర రూ.72 వేలకు చేరువలోకి వచ్చేసింది. అయితే భారతీయులకు బంగారం అంటే ఎనలేని మక్కువ. అందుకే ఇంట్లో జరిగే వివాహాది శుభాకార్యాలకు, పండుగలకు పసిడి ఆభరణాలను కొనుగోలు చేస్తుంటారు. కానీ నేడు ధరలు పెరుగుతుండడం వల్ల, బంగారం కొనుగోలు చేయాలంటే సామాన్యులు జంకుతున్నారు. ఒకేసారి ఎక్కువ మొత్తంలో డబ్బు పెట్టి కొనడం ఎవరికైనా చాలా కష్టంగా ఉంటుంది. అందుకే చాలా మంది క్రెడిట్ కార్డు ఉపయోగించి, నెలవారీగా ఈఎంఐల రూపంలో బిల్లులు చెల్లిస్తూ బంగారాన్ని కొనుగోలు చేస్తున్నారు. అయితే ఇలా క్రెడిట్ కార్డు ఉపయోగించి బంగారం కొనడం సురక్షితమేనా?

క్రెడిట్ కార్డుతో బంగారం కొనుగోళ్లు!
క్రెడిట్ కార్డు ఉపయోగించి ఆన్​లైన్, ఆఫ్​లైన్ విధానాల్లో బంగారు ఆభరణాలు కొనుగోలు చేయవచ్చు. ఒకేసారి పెద్ద మొత్తంలో డబ్బు చెల్లించలేనివారు ఈఎంఐ పద్ధతిలోనూ గోల్డ్ కొనవచ్చు. అయితే క్రెడిట్ కార్డుతో బంగారం కొంటున్నప్పుడు, కొన్ని విషయాలను తప్పకుండా తెలుసుకోవాలి. అవేంటో ఇప్పుడు చూద్దాం.

వడ్డీ రేటు : క్రెడిట్ కార్డ్‌ బిల్లులను సకాలంలో చెల్లించాలి. లేకపోతే అధిక వడ్డీ రేట్లు చెల్లించాల్సి వస్తుంది. అందుకే బంగారం కొనుగోలు చేసే ముందు, మీ క్రెడిట్ కార్డ్‌పై వసూలు చేసే వడ్డీ రేట్ల గురించి పూర్తిగా తెలుసుకోండి.

క్రెడిట్ పరిమితి : మీ క్రెడిట్​ కార్డుకు బంగారం కొనడానికి తగినంత క్రెడిట్ లిమిట్​ ఉందో, లేదో చెక్ చేసుకోండి. మరీ ముఖ్యంగా మీ క్రెడిట్ కార్డ్ లిమిట్​లో కేవలం 30 శాతం వరకే వాడుకోండి.

రీపేమెంట్ కాలపరిమితి : మీరు ఈఎంఐ విధానంలో బంగారు ఆభరణాలను కొనుగోలు చేయాలని ప్లాన్ చేస్తే, మీ క్రెడిట్ కార్డ్ ప్రొవైడర్ అందించే రీపేమెంట్ ఫెసిలిటీ గురించి తెలుసుకోండి. రీపేమెంట్​ ఎన్ని నెలల్లో పూర్తి చేయాలో తెలుసుకోండి.

ప్రాసెసింగ్ ఫీజులు : కొన్ని క్రెడిట్ కార్డ్ జారీ చేసే సంస్థలు ఈఎంఐ లావాదేవీల కోసం ప్రాసెసింగ్ ఫీజు కూడా వసూలు చేయవచ్చు. ఈ మొత్తం కూడా మీరు కొనుగోలు చేసిన ఆభరణాలపై అదనపు భారం పడేలా చేయవచ్చు. కనుక గోల్డ్ కొనే ముందు కచ్చితంగా ప్రాసెసింగ్ ఫీజుల వివరాలు గురించి తెలుసుకోండి.

లాభమా? నష్టమా?
ఒకేసారి పెద్దమొత్తంలో డబ్బు పెట్టి బంగారం కొనుగోలు చేయలేని వారికి క్రెడిట్ కార్డ్​ బెస్ట్ ఛాయిస్ అవుతుంది. పైగా దీని వల్ల రివార్డ్ పాయింట్లు కూడా లభిస్తాయి. కానీ ఈఎంఐలో కొనుగోలు చేసే ముందు వడ్డీ రేటు, రీపేమెంట్, ప్రాసెసింగ్ ఫీజుల గురించి కచ్చితంగా తెలుసుకోవాలి. అంతేకాదు మీరు ఈఎంఐని సకాలం చెల్లించనట్లయితే క్రెడిట్ కార్డు బిల్లు వేగంగా పెరుగుతుంది. అందువల్ల నెలనెలా కచ్చితంగా బిల్లు చెల్లించగలమని నిర్ధారించుకున్న తర్వాతే కొనుగోలు చేయడం బెటర్.

'2024లో భారత ఆర్థిక వృద్ధి రేటు 7.5%' - ప్రపంచ బ్యాంక్ అంచనా - Indian Economy Growth Rate 2024

మీ క్రెడిట్​ స్కోర్ రిపోర్ట్​లో తప్పులు ఉన్నాయా? సరిచేసుకోండి ఇలా! - How To Rectify Cibil Errors

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.