ETV Bharat / business

అప్పు చేసి ఇల్లు కొంటున్నారా? అయితే ఈ విషయాలు కచ్చితంగా తెలుసుకోండి! - Buying A House With Loan - BUYING A HOUSE WITH LOAN

Buying A House With Loan : హౌసింగ్ లోన్ తీసుకొని కొత్త ఇల్లు కొనుగోలు చేయాలని ప్లాన్ చేస్తున్నారా? అయితే కొన్ని ముఖ్యమైన విషయాలపై దృష్టి సారించాల్సి ఉంటుంది. అప్పుడే మీరు తీసుకున్న రుణాన్ని సజావుగా తీర్చగలరు. అందుకే ఈ ఆర్టికల్​లో గృహ రుణం తీసుకునేటప్పుడు కచ్చితంగా పరిశీలించాల్సిన అంశాల గురించి తెలుసుకుందాం.

Home Loan Tips for First Time Buyers
Buying A House With Loan (ETV BHARAT TELUGU TEAM)
author img

By ETV Bharat Telugu Team

Published : May 3, 2024, 5:15 PM IST

Buying A House With Loan : రుణం అనేది ఎప్పటికీ భారమైనదే. కానీ ఇల్లు కోసం, పెళ్లి కోసం అప్పు చేయక తప్పదు అని పెద్దలు చెబుతూ ఉంటారు. అయితే అప్పు చేసే సమయంలో కొన్ని జాగ్రత్తలు తీసుకున్నట్లయితే, అది మనకు గుదిబండగా మారకుండా ఉంటుంది. ఇల్లు కొనుగోలు చేసేవారు హోమ్ లోన్​ తీసుకోవడం అనేది సహజమైన విషయమే. అయితే తొలిసారిగా ఇంటి రుణం తీసుకునేవారు ఎలాంటి జాగ్రత్తలు పాటించాలో ఇప్పుడు మనం తెలుసుకుందాం.

దీర్ఘకాలిక రుణం
హోమ్ లోన్ అనేది ఒక దీర్ఘకాలిక రుణం. దీనిని తీర్చడానికి సాధారణంగా 15 సంవత్సరాల నుంచి 30 సంవత్సరాలు పడుతుంది. అందుకే గృహ రుణం తీసుకునే ముందు చాలా జాగ్రత్తలు తీసుకోవాలి. మీ రోజువారీ, కనీస అవసరాలకు ఎలాంటి ఇబ్బంది కలగకుండా, మీరు చెల్లించే నెలసరి వాయిదాలు (ఈఎంఐ)లు ఉండేలా చూసుకోవాలి. అలాగే మీకు భవిష్యత్తు ఆర్థిక భద్రతకు ఎలాంటి ఇబ్బందులు తలెత్తకుండా ప్లాన్ చేసుకోవాలి. మీరు అనుకున్న ఆర్థిక లక్ష్యాలను నెరవేర్చుకునేందుకు సైతం మీరు చెల్లించే ఈ నెలవారీ వాయిదాలు అడ్డంకిగా మారకుండా జాగ్రత్తపడాలి.

అవసరం మేరకే రుణం
మీరు గృహ రుణం తీసుకునే ముందు, మీ ఆర్థిక స్తోమతను అంచనా వేసుకోవాలి. ముఖ్యంగా మీ కనీస అవసరాలు, ఇంటి ఖర్చులు, చేయవలసిన పొదుపు మొదలైన వాటిని బేరీజు వేసుకోవాలి. ఆ తర్వాతనే మీరు గృహ రుణం ఎంత తీసుకోవాలనేది నిర్ణయించుకోవాలి. అప్పుడే మీరు నెలవారీగా వాయిదాలు చెల్లించడం సులభం అవుతుంది. కనుక ఎట్టిపరిస్థితుల్లోనూ మీ స్తోమతకు మించి అప్పు చేయకుండా జాగ్రత్తపడాలి.

లోన్ అమౌంట్ ఎక్కువగా ఉండాలంటే?
మీ మొత్తం ఆదాయంలో 35 శాతం కంటే తక్కువ రుణ చెల్లింపులు ఉండేలా చూసుకోవాలి. అప్పుడే మీకు బ్యాంకులు లోన్ మంజూరు చేయడానికి ఇష్టపడతాయి. బ్యాంకులు లేదా ఆర్థిక సంస్థలు మీకు లోన్ అప్రూవ్ చేయడానికి ముందు మీ ఆదాయాన్ని, మీకు ఉన్న ఇతర అప్పులను బేరీజు వేస్తూ ఉంటాయి. మీకు ఇతర ఆదాయాలు ఉన్నట్లయితే వాటిని బ్యాంకుకు తెలియజేయడం మంచిది. దీని వల్ల మీకు ఎక్కువ మొత్తంలో లోన్ లభించే అవకాశం ఉంటుంది.

డౌన్ పేమెంట్
సాధారణంగా బ్యాంకులు లేదా ఆర్థిక సంస్థలు మీరు కొనుగోలు చేసే ఇంటి విలువలో 80% లేదా 90% మాత్రమే ఫైనాన్స్ చేస్తాయి. మిగతా మొత్తం మీరు మీరు భరించాల్సి ఉంటుంది. మీ వద్ద అదనపు సేవింగ్స్ ఉన్నట్లయితే, డౌన్ పేమెంట్ మొత్తాన్ని పెంచడం మంచిది. దీని వల్ల మీ బ్యాంక్ లోన్ అమౌంట్ తగ్గుతుంది. తద్వారా మీరు చెల్లించాల్సిన ఈఎంఐ తగ్గుతుంది. ఇల్లు మొత్తం కొనుగోలు ధరలో 20% డౌన్ పేమెంట్ చెల్లిస్తే మంచిదని ఆర్థిక నిపుణులు సూచిస్తున్నారు. అయితే కొన్ని బ్యాంకులు ముందస్తు చెల్లింపులను కూడా ప్రోత్సహిస్తూ ఉంటాయి. అలాంటి సమయంలో మీరు ముందస్తు చెల్లింపు చేసి, సాధ్యమైనంత త్వరగా రుణం తీర్చడం మంచిది. దీని వల్ల మీపై ఉన్న వడ్డీ భారం తగ్గుతుంది.

అదనపు ఖర్చులు తగ్గించుకోవాలి!
గృహ రుణం తీసుకున్న తర్వాత దానిపై చెల్లించే నెలవారీ వాయిదాతో పాటు, మీరు కొనుగోలు చేసిన ఇంటి నిర్వహణ ఖర్చులను కూడా ముందుగానే బేరీజు వేసుకోవాల్సి ఉంటుంది. వీటిలో ప్రధానంగా మెయింటెనెన్స్ ఛార్జీలు, ఆస్తి పన్నులు, నెలవారీ బిల్లులు, ఇతర ఖర్చులు ఉంటాయి.

లోన్ కవర్ టర్మ్ పాలసీ!
ఊహించని ఘటనలు ఎదురైనప్పుడు మీరు లేదా మీ కుటుంబం ఆర్థికంగా చితికిపోకుండా లోన్ కవర్ టర్మ్ పాలసీని తీసుకోవడం ఉత్తమం. ఇది మీ కుటుంబానికి రక్షణ అందిస్తుంది. అందుకే మీ వార్షికాదాయానికి 10 నుంచి 12 రెట్లు ఉండేలా ఇన్సూరెన్స్ చేయించుకోవాలని ఆర్థిక నిపుణులు సూచిస్తున్నారు. ఈ జాగ్రత్తలు అన్నీ తీసుకుంటే, ఎలాంటి ఆర్థిక ఒడుదొడుకులు లేకుండా మీ సొంతింటి కల నెరవేరుతుంది.

SBI స్పెషల్ FD స్కీమ్​ - నచ్చినప్పుడు డబ్బులు విత్​డ్రా చేసుకునే ఛాన్స్​! - SBI MOD Scheme

స్టన్నింగ్ డిజైన్​తో బజాజ్ పల్సర్​ NS400Z బైక్ లాంఛ్​ - ధర ఎంతంటే? - Bajaj Pulsar NS400Z

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.