ETV Bharat / business

కొత్త కారు కొనాలా? ఈ 'ఎక్స్​ట్రా ఖర్చులు' గురించి కచ్చితంగా తెలుసుకోండి! - Car Expenditure - CAR EXPENDITURE

Car Expenditure : మీరు మొదటిసారి కారు కొనాలని అనుకుంటున్నారా? అయితే ఇది మీ కోసమే. మీకు వెబ్​సైట్లలో కనిపించేది కేవలం షోరూం-ప్రైస్​ మాత్రమే. దీనికి ఆన్​-రోడ్​ ధరకు చాలా వ్యత్యాసం ఉంటుంది. అంతేకాదు పలు అదనపు ఖర్చులు కూడా ఉంటాయి. అవేంటో ఇప్పుడు తెలుసుకుందాం.

car buying costs
Car Expenditure (ETV Bharat)
author img

By ETV Bharat Telugu Team

Published : Sep 4, 2024, 1:30 PM IST

Car Expenditure : మనలో చాలా మందికి కొత్త కారు కొనుక్కోవాలని ఉంటుంది. ఇందుకోసం కష్టపడి సంపాదించిన సొమ్మును వాడతారు. లేదంటే బ్యాంక్​ లోన్ తీసుకుంటారు. అయితే ఇక్కడితో మీ పని అయిపోదు. కారు మెయింటైన్ చేయడం అంటే ఆషామాషీ కాదు. దీనికి ఎన్నో ఖర్చులు ఉంటాయి. వీటిని సామాన్యులు తట్టుకోవడం కష్టం. అందుకే కారు కొనే ముందు, ఎలాంటి అదనపు ఖర్చులు ఉంటాయో తెలుసుకోవడం తప్పనిసరి.

కొత్త కారు కొనేటప్పుడు మనం డౌన్​పేమెంట్ చేస్తాం. ఒక వేళ బ్యాంక్​ లోన్ తీసుకుని కారు కొంటే, నెలవారీగా ఈఎంఐలు కట్టాల్సి ఉంటుంది. దీనికి తోడు రిజిస్ట్రేషన్ ఫీజు, రోడ్డు ట్యాక్స్​, వెహికల్​ ఇన్సూరెన్స్ ప్రీమియం కట్టక తప్పదు. ఇక్కడితో మీ పని అయిపోదు. కారుకు నెలవారీ ఇంధన ఖర్చులు, మెయింటెనెన్స్​ ఖర్చులు ఉంటాయి. అంతేకాదు కారుకు అప్పుడప్పుడు సర్వీసింగ్ కూడా చేయిస్తూ ఉండాలి. రిపేర్ ఖర్చులు ఎలానూ ఉంటాయి. వీటన్నింటికీ బోలెడు ఖర్చు అవుతుంది. కనుక కారు కొనే ముందే ఈ ఖర్చులు అన్నింటి గురించి మీరు ఆలోచించడం మంచిది.

ఫైనాన్స్‌లో కారు కొంటే పరిస్థితి ఏమిటి?
బ్యాంకులు ఇచ్చే వెహికల్​ లోన్స్​ మీ కలల కారును కొనుక్కొనేందుకు వీలు కల్పిస్తాయి. కానీ కారు రుణాలపై నెలవారీగా ఈఎంఐ చెల్లించాల్సి ఉంటుంది. ఒక వేళ సకాలంలో వీటిని చెల్లించకపోతే, మీరు డిఫాల్ట్ అవుతారు. దీనితో మీపై అదనపు వడ్డీ భారం పడుతుంది. పైగా పెనాల్టీ చెల్లించాల్సి వస్తుంది. మీరు పూర్తిగా ఈఎంఐ చెల్లించలేని పరిస్థితి వస్తే, బ్యాంకులు మీ కారును జప్తు చేస్తాయి. కనుక వెహికల్ లోన్స్ తీసుకునేటప్పుడు చాలా తక్కువ వడ్డీకే రుణాలు ఇస్తున్న బ్యాంకులను ఎంచుకోవాలి. రుణాల విషయంలో సదరు బ్యాంక్​ పాటిస్తున్న నియమ, నిబంధనల గురించి కూడా కచ్చితంగా తెలుసుకోవాలి.

కొన్ని ప్రముఖ బ్యాంకులు కారు రుణాలపై 8.75 శాతం నుంచి 9.40 శాతం వరకు వడ్డీని వసూలు చేస్తున్నాయి. లోన్​ తీసుకున్నప్పుడు దాన్ని తిరిగి చెల్లించే వ్యవధి ఎక్కువ ఉంటే, మీరు ఎక్కువ వడ్డీ చెల్లించాల్సి ఉంటుంది. ఒకవేళ తిరిగి చెల్లించే వ్యవధి తక్కువగా ఉంటే, మీరు చెల్లించాల్సిన వడ్డీ తగ్గుతుంది. కనుక వీలైనంత ఎక్కువ మొత్తంలో డౌన్​పేమెంట్ చేసి, కారు కొనుక్కోవడం మంచిది.

  1. బ్యాంక్​ ఫీజులు, ఛార్జీలు : బ్యాంకులు లేదా రుణ సంస్థలు మీకు వెహికల్ లోన్ ఇచ్చేటప్పుడు ప్రాసెసింగ్ ఫీజు వసూలు చేస్తాయి. మీరు నిర్ణీత వ్యవధి కంటే ముందుగానే లోన్​ అమౌంట్​ మొత్తాన్ని తిరిగి చెల్లిస్తే, 'లోన్ ప్రీ పేమెంట్​ ఛార్జీలు' విధిస్తాయి.
  2. ఇన్సూరెన్స్​ : మన దేశంలో వాహనాలు కొనేటప్పుడు కచ్చితంగా థర్డ్ పార్టీ ఇన్సూరెన్స్ తీసుకోవాల్సి ఉంటుంది. కానీ ఇది ఒక్కటే సరిపోదు. ఆపద కాలంలో మీకు అక్కరకు వచ్చే విధంగా 'సమగ్ర బీమా పాలసీ'ని కూడా కనుగోలు చేయాలి. అప్పుడే మీకు ఆర్థిక భద్రత కలుగుతుంది. కారు మోడల్‌, వయసు, బీమా సంస్థ నిబంధనలను బట్టి వెహికల్ ఇన్సూరెన్స్​ ప్రీమియం మారుతుంది. దీనికి తోడు అదనపు ఫీజులు, ఛార్జీలు కూడా ఉంటాయి.
  3. పన్నులు : కారు కొనుగోలు చేసేటప్పుడు, రాష్ట్రాలు 'వాహన రిజిస్ట్రేషన్ ఫీజు' వసూలు చేస్తాయి. ఇది కారు ధర, ఇంజిన్​ సామర్థ్యంపై ఆధారపడి ఉంటుంది. రోడ్డు ట్యాక్స్​ కూడా రిజిస్ట్రేషన్ సమయంలో ఒకేసారి చెల్లించాల్సి ఉంటుంది.
  4. యాక్సెసరీస్‌ : మనం కొన్న కారులో అన్నీ మనకు నచ్చినట్లే ఉండవు. కనుక అదనపు యాక్సెసరీస్ కొని, వాటిని ఇన్​స్టాల్​ చేయాల్సి ఉంటుంది. ఉదాహరణకు ఇప్పటికే ఉన్న మ్యూజిక్‌ సిస్టంను అప్‌గ్రేడ్‌ చేయవచ్చు. కొత్త బాడీ కిట్‌లు, అలాయ్-వీల్స్‌ కొనుగోలు చేయాల్సి రావచ్చు. కారు లోపల (ఇంటీరియర్) మార్పులు, చేర్పులు చేయవచ్చు. వీటికి చాలా ఖర్చు అవుతుంది.
  5. పెట్రోల్, డీజిల్ ఖర్చులు : కారు కొన్నామంటే దానికి పెట్రోల్ లేదా డీజిల్ కొట్టించకతప్పుదు. మీ వాడకం బట్టి ఈ ఇంధన ఖర్చులు ఉంటాయి.
  6. మెయింటెనెన్స్​ ఖర్చులు : కారును సరిగ్గా మెయింటైన్ చేయాలి. ఇందుకోసం అప్పుడప్పుడు సర్వీసింగ్ కూడా చేయించాలి. వీటికి కూడా బాగానే ఖర్చు అవుతుంది. మీ కారు వాడకం బట్టే ఇది కూడా మారుతుంది. కారును షెడ్యూల్‌ ప్రకారం ఏడాదికి కనీసం రెండు సార్లైనా సర్వీసింగ్‌ చేయించాలి. ఒక్కసారి సర్వీసింగ్ చేయిస్తే కనీసం రూ.5000-రూ.6000 వరకు ఖర్చు అవుతుంది. కాలం గడుస్తున్న కొద్దీ ఈ ఖర్చు మరింత పెరుగుతుంది.
  7. రిపేర్స్​ : కారు ఉందంటే రిపేర్ ఖర్చులు ఎలానూ ఉంటాయి. పాతపార్ట్స్​ మార్చి కొత్తవి అమర్చాల్సి వస్తుంది. వీటికి కూడా భారీగానే ఖర్చు అవుతుంది.
  8. టోల్ ఛార్జీలు, పార్కింగ్ ఫీజులు : కారు రోడ్‌ మీదకు వచ్చిన తర్వాత అనేక ఇతర ఖర్చులు ఉంటాయి. వీటిలో ప్రధానమైనవి టోల్‌ ఛార్జీలు, పార్కింగ్ ఫీజులు. ఇవి చూడడానికి తక్కువగా అనిపించినా, సంవత్సరం మొత్తం మీద చూస్తే వీటి ఖర్చు వేలల్లో ఉంటుంది.
  9. ఫైన్స్​ : కొన్ని సార్లు మనం తెలిసీ, తెలియక ట్రాఫిక్ రూల్స్​ అతిక్రమిస్తూ ఉంటాం. ఇలాంటప్పుడు కచ్చితంగా ఫైన్ చెల్లించాల్సి వస్తుంది. అయితే ఇది పూర్తిగా మన చేతుల్లోనే ఉంటుంది. మనం ట్రాఫిక్ రూల్స్ అన్నీ సక్రమంగా పాటిస్తే ఏం ఫర్వాలేదు. లేదంటే వాయింపు తప్పదు.

కారు లోన్​ తీర్చేశారా? ఈ 5 పనులు చేయడం అస్సలు మర్చిపోవద్దు! - Procedure After Car Loan Closure

మీ కారు తరచూ ట్రబుల్​ ఇస్తోందా? ఇలా మెయింటెన్​ చేస్తే ఫుల్​ కండీషన్​లో పెట్టొచ్చు! - Car Maintenance Checklist

ETV Bharat Logo

Copyright © 2025 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.