ETV Bharat / business

కొత్త కారు కొనాలా? మీ బడ్జెట్ రూ.10లక్షలా? బెస్ట్-5 అప్​కమింగ్ మోడల్స్ ఇవే! - Best Upcoming Cars Under 10 Lakhs

Best Upcoming Cars Under 10 Lakhs : మీరు కొత్త కారు కొందామనుకుంటున్నారా? మీ బడ్జెట్​ రూ.10 లక్షలా? త్వరలో మార్కెట్​లో కొన్ని నయా మోడల్స్ రానున్నాయి. వాటికి లాంఛింగ్​కు డేట్స్ కూడా ఫిక్స్ అయ్యాయి. మరి ఆ కార్లు ఏంటి? ఫీచర్లు ఎలా ఉన్నాయి? లాంఛింగ్ ఎప్పుడు? వంటి పలు వివరాలు మీకోసం.

Best Upcoming Cars Under 10 Lakhs
Best Upcoming Cars Under 10 Lakhs (Getty Images)
author img

By ETV Bharat Telugu Team

Published : Aug 13, 2024, 1:49 PM IST

Best Upcoming Cars Under 10 Lakhs : మన దేశంలో కార్లకు డిమాండ్ ఓ రేంజ్​లో ఉంది. పబ్లిక్ ట్రాన్స్​పోర్ట్​ కాకుండా కుటుంబంతో కలిసి టూర్ వెళ్లాలన్నా, సుదూర ప్రాంతాలకు ప్రయాణం చేయాలన్నా కారు ఉండాల్సిందే. దీంతో అనేక మంది కారును కొనుగోలు చేసేందుకు మొగ్గుచూపుతున్నారు. మరికొందరు త్వరలోనే కొనేందుకు ప్లాన్ కూడా చేస్తుంటారు. మరి రూ.10 లక్షల బడ్జెట్​లో త్వరలో ఇండియన్​ మార్కెట్లోకి వస్తున్న టాప్​-5 కార్ల గురించి ఇప్పుడు తెలుసుకుందాం.

1. Citroen Basalt Plus Turbo AT : ప్రముఖ ఆటోమొబైల్ దిగ్గజం సిట్రోయెన్ బసాల్ట్ ప్లస్ టర్బో AT కారును ఆగస్టు 15వ తేదీన లాంఛ్ చేయనునట్లు తెలుస్తోంది. మార్కెట్ ధర రూ.7.99 లక్షలుగా ఉండనునట్లు సమాచారం. ఈ కారులో యాంటీ బ్రేకింగ్ సిస్టమ్​తోపాటు సెంట్రల్​ లాకింగ్, చైల్డ్​ సేఫ్టీ లాకింగ్ సిస్టమ్స్ ఉంటాయి. కాబట్టి చిన్న పిల్లలు ఉన్న వారికి ఈ కారు సేఫ్ అనే చెప్పాలి.

  • ఇంజిన్​ : ప్యూర్ టెక్ 110
  • ఫ్యూయెల్ టైప్​ : పెట్రోల్​
  • ట్రాన్స్​మిషన్​ : ఆటోమేటిక్​
  • గ్యేర్ బాక్స్​: 6-స్పీడ్
  • సీటింగ్​ కెపాసిటీ : 5
  • మైలేజ్​ : 19.05 కి.మీ/ లీటర్​
  • ఫ్యూయల్ కెపాసిటీ: 45 లీటర్లు

2. Citroen Basalt Max Turbo : సిట్రోయెన్ సంస్థ బసాల్ట్ మాక్స్ టర్బో పేరుతో మరో కారును కూడా త్వరలోనే అందుబాటులోకి తేనుంది. ఈ కారు కూడా ఆగస్టు 15వ తేదీన లాంఛ్ చేయనుందట. బసాల్ట్ మాక్స్ టర్బో వెహికల్​లో కూడా మంచి సేఫ్టీ ఫీచర్లను తీసుకురానుంది. రూ.7.99 లక్షలకు సేల్ చేయనున్నట్లు తెలుస్తోంది.

  • ఇంజిన్​ : ప్యూర్ టెక్ 110- 1199సీసీ
  • ఫ్యూయెల్ టైప్​ : పెట్రోల్​
  • ట్రాన్స్​మిషన్​ : మన్యువల్
  • గ్యేర్ బాక్స్​: 6-స్పీడ్
  • సీటింగ్​ కెపాసిటీ : 5
  • మైలేజ్​ : 19.05 కి.మీ/ లీటర్​
  • ఫ్యూయల్ కెపాసిటీ: 45 లీటర్లు

3. Toyota Belta : ప్రముఖ వాహన తయారీ సంస్థ టయోటా బెల్టా మోడల్​ను లాంఛ్ చేసేందుకు సన్నాహాలు చేస్తోంది. ఆగస్టు 21వ తేదీన మార్కెట్​లోకి రూ.10 లక్షల ధరతో విడుదల చేయనున్నట్లు తెలుస్తోంది. మారుతి సుజుకి సియాజ్, హోండా సిటీ, స్కోడా స్లావియా, హ్యుందాయ్ వెర్నా వంటి పలు కార్లకు గట్టీ పోటీనివ్వనుంది.

  • ఇంజిన్​ : 1462 సీసీ
  • ఫ్యూయెల్ టైప్​ : పెట్రోల్​
  • ట్రాన్స్​మిషన్​ : మన్యువల్

4. Honda WR-V: పలు కార్లపై భారీ డిస్కౌంట్లు ప్రకటించి ఇటీవల వార్తల్లో నిలిచిన దిగ్గజ ఆటోమొబైల్​ సంస్థ హోండా, ఇప్పుడు మరో కొత్త మోడల్​ను లాంఛ్ చేయనుంది. హోండా WR-Vను రూ.8లక్షల ధరతో ఆగస్టు 31వ తేదీన మార్కెట్​లోకి తేనున్నట్లు తెలుస్తోంది. ఆరు ఎయిర్‌బ్యాగ్‌లు, ఎలక్ట్రానిక్ స్టెబిలిటీ కంట్రోల్ (ESP), ఆటో హై బీమ్ వంటి మంచి ఫీచర్లు ఉండనున్నాయి. హ్యుందాయ్ వెన్యూ, మహీంద్రా XUV300, కియా సోనెట్, మారుతి సుజుకి బ్రెజ్జా వంటి మోడళ్లతో మార్కెట్​లో పోటీ పడనుంది.

  • ఇంజిన్​ : 1199 సీసీ
  • ఫ్యూయెల్ టైప్​ : పెట్రోల్​
  • ట్రాన్స్​మిషన్​ : మన్యువల్

5. Maruti Swift Hybrid : మన దేశంలో అత్యంత ఆదరణ పొందుతున్న హ్యాచ్ బ్యాక్ మోడల్ కార్లలో మారుతీ సుజుకీ స్విఫ్ట్ ఒకటి. ఇప్పుడు స్విఫ్ట్ హైబ్రిడ్​ మోడల్​ను సెప్టెంబర్​ 1వ తేదీన లాంఛ్ చేసేందుకు మారుతీ సిద్ధమవుతోంది. రూ.10 లక్షలతో సెప్టెంబర్ 1వ తేదీన మార్కెట్​లోకి విడుదల చేయనుంది. ఇప్పటికే మార్కెట్​లో ఉన్న స్విఫ్ట్ కార్ల ఫీచర్లకు మించి ఇందులో ఉన్నట్లు తెలుస్తోంది.

  • ఇంజిన్​ : 1.2L K12C Dual-jet
  • ఫ్యూయెల్ టైప్​ : పెట్రోల్​
  • ట్రాన్స్​మిషన్​ : ఆటోమేటిక్​
  • సీటింగ్​ కెపాసిటీ : 5
  • ఫ్యూయల్ కెపాసిటీ: 37 లీటర్లు

ట్యాక్సీ/క్యాబ్ బిజినెస్ చేస్తారా? టాప్-10 కమర్షియల్ కార్స్ ఇవే! - Best Commercial Car In 2024

అదిరే ఫీచర్స్​తో - 2024లో లాంఛ్ కానున్న టాప్​-8 కార్స్ ఇవే!​ - Upcoming Cars In India 2024

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.