ETV Bharat / business

బైక్​ పార్క్​ చేస్తున్నారా? ఈ టిప్స్ పాటించకుంటే దొంగలు ఎత్తుకెళ్లడం ఖాయం! - Bike Protect Tips

Best Tips For Protect Bike From Thefts : మీరు బైక్​ పార్క్​ చేస్తున్నారా? అయితే జాగ్రత్త. ఎందుకంటే, బైక్​ పార్కింగ్​ విషయంలో ఈ జాగ్రత్తలు తీసుకోకపోతే మీ బండి దొంగల పాలు కావడం ఖాయం. కాబట్టి బీ కేర్​ఫుల్​. ఇంతకీ ఆ జాగ్రత్తలు ఏంటో ఈ స్టోరీలో చూద్దాం.

Best Tips For Protect Bike From Thieves
Best Tips For Protect Bike From Thieves
author img

By ETV Bharat Telugu Team

Published : Jan 20, 2024, 12:02 AM IST

Best Tips For Protect Bike From Thefts : బైక్స్​ అంటే యూత్​కు పిచ్చి. రోడ్ల మీద రయ్​ రయ్​ మంటూ దూసుకెళ్తుంటారు. ఆఫీసుకు వెళ్లడం మొదలు. వేరే ఇతర అవసరాల కోసం ఎక్కడికి వెళ్లాలన్నా బైక్​ బెస్ట్​ ఆప్షన్. మరి అంతగా ఇష్టపడే బైక్​ను దొంగలు ఎత్తుకెళ్తే? అది కూడా మనం చేసే చిన్న చిన్న పొరపాట్ల కారణంగా అయితే చాలా బాధ పడతాం. మరి అలాంటివి జరగకూడదంటే ఈ జాగ్రత్తలు తీసుకోవాలి. అవేంటో ఇప్పుడు చూద్దాం.

ప్రస్తుత రోజుల్లో టెక్నాలజీ ఎంతో డెవలప్ అయింది. దాంతో ప్రతి పని స్మార్ట్ అయింది. ఉన్న చోటు నుంచే క్షణాల్లో పని కంప్లీట్ చేసుకునే వెసులుబాటు వచ్చింది. ఈ క్రమంలోనే దేశంలో జరుగుతున్న దొంగతనాలను ఆపేందుకు ప్రభుత్వాలు ఎన్నో కట్టుదిట్టమైన చర్యలు తీసుకుంటూ, నూతన టెక్నాలజీతో కమాండ్​ కంట్రోల్ రూమ్​లు ఏర్పాటు చేస్తున్నాయి. అయినా నిత్యం ఏదో ఒక చోట బంగారు ఆభరణాల దొంగతనాలు, బైక్ చోరీలు చోటుచేసుకుంటూనే ఉన్నాయి. అందుకు కారణం దొంగలు కూడా నయా టెక్నాలజీ యూజ్ చేయడమే. దాంతో బైక్ , ఇతర వాహనాలు లాక్ చేసినా దొంగలు ఎత్తుకెళ్లిపోతున్నారు. కాబట్టి మీకు ద్విచక్రవాహనం ఉంటే లాక్ చేయడంతో పాటు ఈ టిప్స్ పాటిస్తే మీ వాహనం సేఫ్ అవ్వడమే కాకుండా ఎవరైనా దొంగిలిస్తున్నా ఇట్టే తెలిసిపోతుంది. ఇంతకీ ఆ టిప్స్ ఏంటంటే.

సరైన ప్లేస్​లో పార్క్ చేయడం : మీ వెహికల్​ దొంగతనానికి గురికాకుండా ఉండాలంటే మీరు చేయాల్సిన మొదటి పని బైక్​ను సరైన ప్లేస్​లో పార్క్ చేయడం. ఎప్పుడూ చాలా సురక్షితంగా, బహిరంగ ప్రదేశాల్లో మీ వాహనం పార్క్ చేయండి. ఒకవేళ మీరు ఎక్కువ సేపు వాహనాన్ని పార్కింగ్​లో ఉంచాలంటే జనాలు తిరిగే చోట, సెక్యూరిటీ ఉన్న చోట నిలపడం ఉత్తమం. ఆ ఫెసిలిటీ లేకపోతే పెయిడ్ పార్కింగ్ బెటర్ ఆప్షన్​గా చెప్పుకోవచ్చు.

చైన్ లాక్
మీ బైక్ సురక్షితంగా ఉండాలంటే చైన్ లాక్ చాలా బాగా యూజ్ అవుతుంది. ఇందుకోసం స్టీల్ చైన్, లాక్ కొనుగోలు చేయండి. ఇది చాలా వరకు ద్విచక్రవాహనం దొంగతనానికి గురికాకుండా కాపాడుతుంది. కాబట్టి మీరు ఎప్పుడైనా బయటకువెళ్లినప్పుడు మీ వెంట దీనిని తీసుకెళ్లండి. పార్కింగ్ చేసే చోట ఏదైనా స్తంభానికి లేదా గట్టి సపోర్టింగ్ ఇచ్చే దానికి చైన్ లాక్​తో లాక్ చేయండి.

బైక్ అలారం
ఇది కూడా మీ వాహనం చోరీకి గురి కాకుండా చాలా బాగా కాపాడుతుంది. వైర్ లెస్ సెన్సార్లతో పనిచేసే ఈ యాంటీ తెఫ్ట్ అలారాన్ని మీ బైక్​లో అమర్చడం ద్వారా చాలా బెనిఫిట్స్ ఉంటాయి. ముఖ్యంగా ఇది బైక్​లో ఉందంటే ఎవరైనా వాహనం హ్యాండిల్ తిప్పడానికి ట్రై చేసినా, ముందుకు కదపాలని చూసినా వెంటనే మీకు సమాచారం అందిస్తుంది. దాంతో మీరు వెంటనే అలర్ట్ అయ్యి బైక్​ చోరీకి గురికాకుండా చూడొచ్చు.

డిస్క్ బ్రేక్ లాక్
మీ వాహనాన్ని సేఫ్​గా ఉంచడానికి డిస్క్ బ్రేక్ లాక్ కూడా ఎంతో ఉపయోగపడుతుంది. మీ బైక్​లో డిస్క్ బ్రేక్ ఉంటే దానికి చైన్, లాక్​తో ఈజీగా లాక్ చేయవచ్చు. అలాగే దీనికోసం ఉపయోగించే లాక్ చాలా చిన్నదిగా ఉంటుంది. దాంతో బైక్ ఎక్కడ పార్క్ చేసినా దీనిని సులభంగా యూజ్ చేయవచ్చు. డిస్క్ లాక్ కాకుండా మీరు ప్యాడ్ లాక్​నూ యూజ్ చేయవచ్చు. మీ బైక్ రెండు డిస్కులకు లాక్ చేసినట్లయితే బైక్ దొంగిలించడం చాలా కష్టం.

ఇవే కాకుండా మీ బైక్ భాగాల గురించి బాగా తెలిసినప్పుడు అలాగే వాటిని ఎలా ఆపరేట్ చేయాలనే విషయంలో మీకు పూర్తి అవగాహన ఉన్నప్పుడు ఇప్పుడు చెప్పే ట్రిక్ చాలా బాగా యూజ్ అవుతుంది. అదేంటంటే మీ ద్విచక్రవాహనం విద్యుత్ కనెక్షన్​ను డిస్ కనెక్ట్ చేయడం. ఫలితంగా మీ వాహనాన్ని ఎవరూ తీసుకెళ్లలేరు. అదే విధంగా బైక్‌ను ఎలక్ట్రిక్ సర్క్యూట్‌కు కనెక్ట్-డిస్‌కనెక్ట్ చేసే స్విచ్​తో కూడా సెట్ చేసుకోవచ్చు. దీనిని బైక్ లోపల మీకు కంఫర్ట్ గా ఉండే ప్లేస్​లో అమర్చుకోవచ్చు. సో చూశారుగా టిప్స్ పాటిస్తూ మీ వాహనాన్ని పార్కింగ్ చేశారంటే దొంగతనం చేయడం చాలా కష్టం. అప్పుడు మీకు కూడా వాహనం సేఫ్​గా ఉంటుందనే భరోసా కలుగుతుంది.

సిబిల్ స్కోర్ పెరగాలా? ఈ టాప్-5 టిప్స్​ పాటించండి!

ఫైనాన్స్​లో కారు కొనేటప్పుడు చేసే పొరపాట్లు ఇవే - ఆర్థికంగా చాలా నష్టం!

ETV Bharat Logo

Copyright © 2025 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.