How To Increase Bike Mileage : నేడు మన జీవితంలో బైక్‌లు నిత్యావసర ప్రయాణ సాధనంలా మారిపోయాయి. విద్యార్థులు కాలేజ్‌కు వెళ్లాలన్నా, ఉద్యోగులు ఆఫీస్‌కు చేరుకోవాలన్నా బైక్ ఉండాల్సిందే. అసలు ఏ పని కోసమైనా బైక్‌పై వెళ్లాల్సిందే. అయితే చాలా మంది బైక్ నడిపేటప్పుడు తెలిసీ, తెలియక కొన్ని తప్పులు చేస్తుంటారు. దీని వల్ల బైక్ మైలేజ్ బాగా తగ్గిపోతుంది. దీనితో తమ బండి కంపెనీ వాళ్లు చెప్పిన మైలేజ్ ఇవ్వట్లేదు అని వాపోతుంటారు. మరి మీ బైక్ కూడా ఇలానే తక్కువ మైలేజ్ ఇస్తోందా? అయితే మీరేమీ చింతించకండి. కొన్ని చిట్కాలు పాటిస్తే, మీ బైక్ మైలేేజ్ను బాగా పెంచుకోవచ్చని, ఇంధనం ఖర్చులు కూడా ఆదా చేసుకోవచ్చని నిపుణులు చెబుతున్నారు. అందుకే ఆ టిప్స్ ఏమిటో ఇప్పుడు చూద్దాం.
- గేర్ షిఫ్టింగ్ : సరైన సమయంలో గేర్లు మార్చకపోతే, బైక్ మైలేజ్ క్రమంగా తగ్గుతుందని నిపుణులు చెబుతున్నారు. అందుకే టూ-వీలర్ నడిపేటప్పుడు మీ వేగానికి తగినట్లుగా గేర్స్ మార్చుతూ ఉండాలి. అలాకాకుండా, చాలా వేగంగా వెళ్తూ, తక్కువ గేర్ ఉపయోగిస్తే అది ఇంజిన్ పనితీరును ప్రభావితం చేస్తుంది. పైగా ఎక్కువ ఇంధనం ఖర్చు అవుతుంది. కనుక మీ బైక్ మంచి మైలేజ్ ఇవ్వాలంటే, మీ స్పీడ్‌కి, రోడ్డు పరిస్థితికి అనుగుణంగా గేర్స్ మారుస్తూ ఉండాలి. ఖాళీగా ఉన్న రోడ్లపై స్పీడ్‌గా వెళ్తున్నప్పుడు టాప్ గేర్‌లో వెళ్లాలి. నిదానంగా బైక్ డ్రైవ్ చేస్తుంటే సెకండ్ లేదా థర్డ్ గేర్‌లో వెళ్లాలి. ఇలా వెళ్లడం వల్ల రోడ్డు మధ్యలో బైక్ ఆగకుండా, మీ ప్రయాణం సాఫీగా సాగుతుంది. పైగా మైలేజ్ కూడా పెరుగుతుంది.
- క్వాలిటీ ఆయిల్ మాత్రమే వాడాలి : మీ బైక్‌లో ఎప్పుడూ క్వాలిటీ ఆయిల్ మాత్రమే వేయాలి. చాలా బంకుల్లో పెట్రోల్‌ను కల్తీ చేస్తుంటారు. దీని వల్ల మీ ఇంజిన్ దెబ్బతింటుంది. మైలేజ్ తగ్గుతుంది. పైగా పొల్యూషన్ కూడా పెరుగుతుంది. అందుకే మంచి నమ్మకమైన పెట్రోల్ బంక్ దగ్గర నుంచి క్వాలిటీ ఆయిల్‌ను వేసుకోవాలి. అంతేకాదు ఇంజిన్ ఆయిల్ కూడా మంచిది మాత్రమే వాడాలి. దీని వల్ల కచ్చితంగా మైలేజ్ పెరుగుతుంది.
- బ్రేక్‌పై కాలు పెట్టి డ్రైవ్ చేయవద్దు : చాలా మంది బ్రేక్ పెడల్పై కాలు పెట్టి డ్రైవ్ చేస్తుంటారు. సేఫ్టీ పరంగా ఇది మంచిదే. కానీ డ్రైవ్ చేసేటప్పుడు ఇలా బ్రేక్ పెడల్పై కాలు పెడితే, దానిపై కొంత ఒత్తిడి ఏర్పడుతుంది. దీని వల్ల కూడా మీ బైక్ మైలేజ్ తగ్గే అవకాశం ఉందని నిపుణులు చెబుతున్నారు. అందువల్ల అవసరమైనప్పుడు మాత్రమే బ్రేక్ పెడల్పై కాలు పెట్టండి.
- టైర్ ప్రెజర్ చెక్ చేయాలి : చాలా మంది తమ బైక్ టైర్లలో ఎంత ఎయిర్ ప్రెజర్ ఉందో చెక్ చేయకుండా నిర్లక్ష్యం చేస్తుంటారు. ఇది చాలా పెద్ద పొరపాటని నిపుణులు చెబుతున్నారు. బైక్ టైర్లలో సరైనంత ఎయిర్ ప్రెజర్ లేకపోతే, అది మీ బండి మైలేజ్‌పై కచ్చితంగా ప్రభావం చూపుతుందని నిపుణులు స్పష్టం చేస్తున్నారు. టైర్లలో ఉండాల్సినంత ఎయిర్ ప్రెజర్ లేకపోతే, మీరు ఎంత యాక్సిలరేట్ చేసినా, బైక్ వేగం పెరగదు. పైగా ఇంధనం కూడా అదనంగా ఖర్చు అవుతుంది. కనుక తరచుగా మీ బండి టైర్లలోని ఎయిర్ ప్రెజర్ చెక్ చేసుకోవాలి. అప్పుడే మీ బైక్ మైలేజ్ పెరుగుతుంది. ఫ్యూయెల్ వేస్టేజ్ తగ్గుతుంది.
- సర్వీసింగ్ : మీ బైక్ మంచి కండిషన్లో ఉండాలంటే, క్రమం తప్పకుండా సర్వీసింగ్ చేయించాలి. ఎయిర్ ఫిల్టర్‌ను శుభ్రం చేయాలి. ట్రాఫిక్ సిగ్నల్స్ వద్ద చాలా సేపు వేచి ఉండాల్సి వస్తే, బైక్‌ను పూర్తిగా ఆపేయాలి. ఈ విధంగా అన్ని జాగ్రత్తలు తీసుకుంటే, మీ బైక్ మైలేజ్ పెరగడం గ్యారెంటీ అని నిపుణులు చెబుతున్నారు.
మీరు కొత్తగా ఎలక్ట్రిక్ బైక్ కొన్నారా? ఈ టాప్-7 మెయింటెనెన్స్ టిప్స్ మీ కోసమే!