Best Mileage Scooters Under 1 lakh : స్కూటీలు అమ్మాయిలు, అబ్బాయిలు అందరికీ చాలా అనువుగా ఉంటాయి. హెవీ ట్రాఫిక్‌లోనూ రయ్ మని దూసుకుపోవడానికి వీలుగా ఉంటాయి. అందుకే కాలేజీ అమ్మాయిల నుంచి గృహిణుల వరకు, కుర్రాళ్ల నుంచి పెద్దోళ్ల వరకు అందరూ స్కూటీలకే తమ మొదటి ప్రాధాన్యత ఇస్తున్నారు.రూ.1 లక్ష బడ్జెట్లో లభిస్తున్న అలాంటి టాప్-10 స్కూటీలపై ఓ లుక్కేద్దాం.
Honda Activa 6G Features : హోండా యాక్టివా 6జీ 5 వేరియంట్లలో, 8 కలర్ ఆప్షన్లలో లభిస్తుంది. హోండా యాక్టివా 6జీ స్కూటీకి మార్కెట్లో టీవీఎస్ జూపిటర్, హీరో ప్లెజర్ ప్లస్, టీవీఎస్ స్కూటీ జెస్ట్, హోండా డియో, హీరో జూమ్ 110 స్కూటర్లు పోటీగా ఉన్నాయి.
- ఇంజిన్ - 109.51 సీసీ
- పవర్ - 7.84 పీఎస్
- టార్క్ - 8.90 ఎన్ ఎం
- మైలేజ్ - 50 కి.మీ/లీటర్
- బ్రేక్స్ - డ్రమ్
- కెర్బ్ వెయిట్ - 105 కేజీ
- Honda Activa 6G Price : మార్కెట్లో ఈ హోండా యాక్టివా 6జీ స్కూటీ ధర సుమారుగా రూ.76,234 నుంచి రూ.82,734 (ఎక్స్ -షోరూం) ఉంటుంది.
Suzuki Access 125 Features : తక్కువ రేటులో మంచి స్కూటీ కొనాలని అనుకునేవారికి సుజుకి యాక్సెస్ 125 మంచి ఆప్షన్ అవుతుంది. ఇది 4 వేరియంట్లలో, 15 కలర్ ఆప్షన్లలో లభిస్తుంది. సుజుకి యాక్సెస్ కు మార్కెట్లో హోండా యాక్టివా 125, టీవీఎస్ జూపిటర్ 125, యమహా ఫాస్కినో 125 పోటీగా ఉన్నాయి.
- ఇంజిన్ కెపాసిటీ - 124 సీసీ
- పవర్ - 8.7 పీఎస్
- టార్క్ - 10Nm
- మైలేజ్ - 45 కి.మీ/లీటర్
- బ్రేక్స్ - డిస్క్
- కెర్బ్ వెయిట్ - 103 కేజీ
- Suzuki Access 125 Price : మార్కెట్లో ఈ సుజుకి యాక్సెస్ 125 స్కూటీ ధర సుమారుగా రూ.79,900 నుంచి రూ.90,500 (ఎక్స్ -షోరూం) వరకు ఉంటుంది.
TVS NTORQ 125 Features : ఇది 6 వేరియంట్లలో, 12 కలర్ ఆప్షన్లలో లభిస్తుంది. టీవీఎస్ NTORQ 125 స్కూటీకి మార్కెట్లో హోండా డియో, సుజుకి అవెనిస్, యమహా రేయిజెర్ 125, ఏప్రిలియా ఎస్ఆర్ 125 పోటీగా ఉన్నాయి.
- ఇంజిన్ - 124.8 సీసీ
- పవర్ - 9.51 పీఎస్
- టార్క్ - 10.6 ఎన్ ఎం
- మైలేజ్ - 54.33 కి.మీ/లీటర్
- బ్రేక్స్ - డిస్క్
- కెర్బ్ వెయిట్ - 109 కేజీ
- TVS NTORQ 125 Price : మార్కెట్లో ఈ టీవీఎస్ NTORQ 125 స్కూటీ ధర సుమారుగా రూ.84,636 నుంచి రూ.1.05 లక్షలు (ఎక్స్ -షోరూం) వరకు ఉంటుంది.
Honda Activa 125 Features : ఇది 4 వేరియంట్లలో, 5 కలర్ ఆప్షన్లలో లభిస్తుంది. హోండా యాక్టివా 125 స్కూటీకి మార్కెట్లో సుజుకి యాక్సిస్ 125, టీవీఎస్ జూపిటర్ 125, హీరో డెస్టినీ 125 పోటీగా ఉన్నాయి.
- ఇంజిన్ - 124 సీసీ
- పవర్ - 8.30 పీఎస్
- టార్క్ - 10.4 ఎన్ ఎం
- మైలేజ్ - 60 కి.మీ/లీటర్
- బ్రేక్స్ - డిస్క్
- కెర్బ్ వెయిట్ - 109 కేజీ
- Honda Activa 125 Price : మార్కెట్లో ఈ హోండా యాక్టివా 125 స్కూటీ ధర సుమారుగా రూ.79,806 నుంచి రూ.88,979 (ఎక్స్ -షోరూం) వరకు ఉంటుంది.
TVS Jupiter Features : ఇది 6 వేరియంట్లలో, 16 కలర్ ఆప్షన్లలో లభిస్తుంది. టీవీఎస్ జూపిటర్ కు మార్కెట్లో హోండా యాక్టివా 6జీ, హీరో ప్లజర్ ప్లస్ ఎక్స్ టెక్ పోటీగా ఉన్నాయి.
- ఇంజిన్ - 109.7 సీసీ
- పవర్ - 7.88 పీఎస్
- టార్క్ - 8.8 ఎన్ ఎం
- మైలేజ్ - 50 కి.మీ/లీటర్
- బ్రేక్స్ - డ్రమ్
- కెర్బ్ వెయిట్ - 109 కేజీ
- TVS Jupiter Price : మార్కెట్లో టీవీఎస్ జూపిటర్ స్కూటీ ధర సుమారుగా రూ.73,340 నుంచి రూ.89,748 (ఎక్స్ -షోరూం) ఉంటుంది.
Honda Dio Features : తక్కువ బడ్జెట్లో మంచి స్కూటీ కొనాలని అనుకునే వారికి హోండా డియో మంచి ఆప్షన్ అవుతుంది. ఇది 3 వేరియంట్లలో, 5 కలర్ ఆప్షన్లలో లభిస్తుంది. హోండా డియోకు మార్కెట్లో టీవీఎస్ స్కూటీ జెస్ట్, హీరో ఎక్స్ మ్ 110, హోండా యాక్టివా 6G, టీవీఎస్ జూపిటర్ 110 పోటీగా ఉన్నాయి.
- ఇంజిన్ - 109.51 సీసీ
- పవర్ - 7.85 పీఎస్
- టార్క్ - 9.03 ఎన్ ఎం
- మైలేజ్ - 50 కి.మీ/లీటర్
- బ్రేక్స్ - డ్రమ్
- కెర్బ్ వెయిట్ - 103 కేజీ
- Honda Dio Price : మార్కెట్లో హోండా డియో స్కూటీ ధర సుమారుగా రూ.70,211 నుంచి రూ.77,712 (ఎక్స్ -షోరూం) ఉంటుంది.
Ola S1 X Features : మంచి ఎలక్ట్రిక్ స్కూటీ కొనాలని అనుకునేవారికి ఓలా ఎస్ 1 ఎక్స్ బెస్ట్ ఆప్షన్ అవుతుంది. ఇది 4 వేరియంట్ లలో లభిస్తుంది. ఓలా ఎస్ 1 ఎక్స్ కు మారెట్లో హీరో ఎలక్ట్రిక ఆప్టిమా, ఓక్నావా ప్రైజ్ ప్రో, ఆంపెర్ మాగ్నస్ ఎక్స్, అథెర్ 450S పోటీగా ఉన్నాయి.
- రేంజ్ - 190 కి.మీ/ఛార్జ్
- బ్యాటరీ కెపాసిటీ - 4 కిలోవాట్
- టాప్ స్పీడ్ - 90 కి.మీ/గంట
- బ్యాటరీ వారెంటీ - 8 సంవత్సరాలు/ 80,000 కి.మీ
- మోటార్ పవర్ - 6 కిలోవాట్స్
- బ్రేక్స్ - డబుల్ డిస్క్
- Ola S1 X Price : మార్కెట్లో ఓలా ఎస్ 1 ఎక్స్ ఎలక్ట్రిక్ స్కూటీ ధర సుమారుగా రూ.74,999 నుంచి రూ.99,999 (ఎక్స్ -షోరూం) ఉంటుంది.
TVS Jupiter 125 Features : టీవీఎస్ జూపిటర్ 125 3 వేరియంట్లలో, 7 రంగుల్లో లభిస్తుంది. టీవీఎస్ జూపిటర్ 125 స్కూటీ మార్కెట్ లో హోండా యాక్టివా 125, సుజుకి యాక్సిస్ 125, హీరో డెస్టినీ 125 పోటీగా ఉన్నాయి.
- ఇంజిన్ - 124.8 సీసీ
- పవర్ - 8.15 పీఎస్
- టార్క్ - 10.5 ఎన్ ఎం
- మైలేజ్ - 57.27 కి.మీ/లీటర్
- బ్రేక్స్ - డిస్క్
- కెర్బ్ వెయిట్ - 108 కేజీ
- TVS Jupiter 125 Price : మార్కెట్లో ఈ టీవీఎస్ జూపిటర్ 125 ధర సుమారుగా రూ.86,405 నుంచి రూ.96,855 (ఎక్స్ -షోరూం) ఉంటుంది.
Yamaha Fascino 125 Fi Hybrid Features : తక్కువ బడ్జెట్లో మంచి స్కూటీ కొనాలని అనుకునేవారికి యమహా ఫాసినో 125 ఎఫ్ ఐ హైబ్రిడ్ బెటర్ ఆప్షన్ అవుతుంది. ఇది 5 వేరియంట్లు, 16 కలర్ ఆప్షన్లలో లభిస్తుంది. యమహా ఫాసినో 125 ఎఫ్ ఐ హైబ్రిడ్ స్కూటీకి మార్కెట్లో హోండా యాక్టివా 125, సుజుకి యాక్సిస్ 125, హీరో డెస్టిని, టీవీఎస్ జూపిటర్ 125 పోటీగా ఉన్నాయి.
- ఇంజిన్ - 125 సీసీ
- పవర్ - 8.2 పీఎస్
- టార్క్ - 10.3 ఎన్ ఎం
- మైలేజ్ - 68.75 కి.మీ/లీటర్
- బ్రేక్స్ - డిస్క్
- కెర్బ్ వెయిట్ - 99 కేజీ
- Yamaha Fascino 125 Fi Hybrid Price : మార్కెట్లో ఈ యమహా ఫాసినో 125 ఎఫ్ ఐ హైబ్రిడ్ స్కూటీ ధర సుమారుగా రూ.81,200 నుంచి రూ.94,230 (ఎక్స్ -షోరూం) వరకు ఉంటుంది.
Hero Pleasure Plus Features : ఇది 6 వేరియంట్లలో, 9 అందమైన రంగుల్లో లభిస్తుంది. హీరో ప్లెజర్ ప్లస్ కు మార్కెట్లో టీవీఎస్ స్కూటీ జెస్ట్, హోండా డియో పోటీగా ఉన్నాయి.
- ఇంజిన్ - 110.9 సీసీ
- పవర్ - 8.1 పీఎస్
- టార్క్ - 8.70 ఎన్ ఎం
- మైలేజ్ - 50 కి.మీ/లీటర్
- బ్రేక్స్ - డ్రమ్
- కెర్బ్ వెయిట్ - 106 కేజీ
- Hero Pleasure Plus Price : మార్కెట్లో హీరో ప్లెజర్ ప్లస్ స్కూటీ ధర సుమారుగా రూ.71,213 నుంచి రూ.82,738 (ఎక్స్ -షోరూం) ఉంది.
ఓలా బంపర్ ఆఫర్ - ఈవీల ధరలు భారీగా తగ్గింపు - ఇకపై రూ.69,999కే S1X స్కూటర్! - Ola EV Scooter Offers
టర్మ్ బీమా పాలసీని తీసుకుంటున్నారా? నామినీ విషయంలో మీకు క్లారిటీ ఉందా? - Term Insurance Nominee