Best Scooters Under 1 Lakh : ఇండియాలో స్కూటర్లకు ఉన్న క్రేజ్ గురించి ప్రత్యేకంగా చెప్పాల్సిన పనిలేదు. యువతీయువకుల నుంచి పెద్ద వాళ్ల వరకు, ఉద్యోగుల నుంచి డైలీ వర్కర్ల వరకు అందరూ దీనిని వాడుతున్నారు. అందుకే ఈ డిమాండ్‌ను క్యాష్ చేసుకునేందుకు ప్రముఖ ఆటోమొబైల్ కంపెనీలు అన్నీ ఎప్పటికప్పుడు తమ లేటెస్ట్ స్కూటీలను మార్కెట్లోకి తెస్తున్నాయి. అలాంటి వాటిలో రూ.1 లక్ష బడ్జెట్లో మంచి మైలేజ్, బెస్ట్ ఫీచర్లు ఉన్న టాప్-10 స్కూటర్ల గురించి ఇప్పుడు మనం తెలుసుకుందాం.
1. Honda Activa 6G : భారత దేశంలోని మోస్ట్ పాపులర్ స్కూటీల్లో హోండా యాక్టివా 6జీ ఒకటి. మంచి లుక్‌తో, డ్రైవ్ చేయడానికి చాలా అనువుగా ఇది ఉంటుంది.
- ఇంజిన్ : 109.51 సీసీ
- పవర్ : 7.79 PS@ 8000 rpm
- టార్క్ : 8.84 Nm@ 5500 rpm
- మైలేజ్ : 50 కి.మీ/ లీటర్
- ప్యూయెల్ కెపాసిటీ : 5.3 లీటర్స్
Honda Activa 6G Price : మార్కెట్లో హోండా యాక్టివా 6జీ స్కూటర్ ధర సుమారుగా రూ.76,234 - రూ.82,734 (ఎక్స్-షోరూం) ఉంటుంది. ఇది మొత్తం 5 వేరియంట్లలో లభిస్తుంది. దీనిపై పట్టణాల్లోనే కాదు, గ్రామీణ ప్రాంతాల్లోని గతుకుల రోడ్లపై కూడా హాయిగా ప్రయాణించవచ్చు.
2. Suzuki Access 125 : ఇండియాలోని టాప్-5 బెస్ట్ సెల్లింగ్ స్కూటర్లలో సుజుకి యాక్సెస్ 125 ఒకటి. దీనిలో బోలెడ్ లేటెస్ట్ ఫీచర్లు ఉన్నాయి. మంచి మైలేజ్ ఇచ్చే స్కూటీ కొనాలని అనుకునేవారికి ఇది మంచి ఛాయిస్ అవుతుంది. ఇది మొత్తం 4 వేరియంట్లలో, 15 అందమైన రంగుల్లో లభిస్తుంది.
- ఇంజిన్ : 124 సీసీ
- పవర్ : 8.7 PS@ 6750 rpm
- టార్క్ : 10 Nm@ 5500 rpm
- మైలేజ్ : 45 కి.మీ/ లీటర్
- ప్యూయెల్ కెపాసిటీ : 5 లీటర్స్
Suzuki Access 125 Price : మార్కెట్లో సుజుకి యాక్సెస్ 125 స్కూటీ ధర సుమారుగా రూ.79,900 - రూ.90,500 (ఎక్స్-షోరూం) వరకు ఉంటుంది.
3. TVS NTORQ 125 : టీవీఎస్ ఎన్‌టార్క్ 125 స్కూటీ చూడడానికి చాలా స్టైలిష్‌గా ఉంటుంది. ఇది మంచి ఫ్యూయెల్ ఎఫీషియన్సీ ఉన్న బైక్. కాలేజ్ పిల్లలకు, మహిళలకు ఇది చాలా బాగుంటుంది. ఈ బండి మొత్తం 6 వేరియంట్లలో, 12 డిఫరెంట్ కలర్స్‌లో లభిస్తుంది.
- ఇంజిన్ : 124.8 సీసీ
- పవర్ : 9.51 PS@ 7000 rpm
- టార్క్ : 10.6 Nm@ 5500 rpm
- మైలేజ్ : 47 కి.మీ/ లీటర్
- ప్యూయెల్ కెపాసిటీ : 5.8 లీటర్స్
TVS NTORQ 125 Price : మార్కెట్లో టీవీఎస్ స్కూటీ ధర సుమారుగా రూ.84,636 - రూ.1.05 లక్షలు (ఎక్స్-షోరూం) ఉంటుంది.
4. Honda Activa 125 : తక్కువ బడ్జెట్లో మంచి ఎఫీషియెంట్ టూ-వీలర్ కొనాలని అనుకునేవారికి హోండా యాక్టివా 125 మంచి ఆప్షన్ అవుతుంది. అందుకే ఇది ఇండియాలో టాప్-5 బెస్ట్ సెల్లింగ్ టూ-వీలర్లలో ఒకటిగా ఉంది. ఇది 4 వేరియంట్లలో, 5 అందమైన రంగుల్లో లభిస్తుంది.
- ఇంజిన్ : 124 సీసీ
- పవర్ : 8.30 PS@ 6250 rpm
- టార్క్ : 10.4 Nm@ 5000 rpm
- మైలేజ్ : 60 కి.మీ/ లీటర్
- ప్యూయెల్ కెపాసిటీ : 5.3 లీటర్స్
Honda Activa 125 Price : మార్కెట్లో హోండా యాక్టివా 125 స్కూటీ ధర సుమారుగా రూ.79,806 - రూ.88,979 (ఎక్స్-షోరూం) ఉంటుంది.
5. TVS Jupiter : ఒక లక్షలోపు బడ్జెట్‌తో మంచి మైలేజ్ ఇచ్చే టూ-వీలర్ కొనాలని అనుకునేవారికి టీవీఎస్ జూపిటర్ బ్రహ్మాండంగా ఉంటుంది. దీని ఫ్యూయెల్ ఎఫీషియెన్సీ చాలా బాగుంటుంది. ఈ బండి మొత్తం 6 వేరియంట్లలో, 16 కలర్ ఆప్షన్లలో లభిస్తుంది.
- ఇంజిన్ : 109.7 సీసీ
- పవర్ : 7.88 PS@ 7500 rpm
- టార్క్ : 8.8 Nm@ 5500 rpm
- మైలేజ్ : 50 కి.మీ/ లీటర్
- ప్యూయెల్ కెపాసిటీ : 6 లీటర్స్
TVS Jupiter Price : మార్కెట్లో టీవీఎస్ జూపిటర్ స్కూటీ ధర సుమారుగా రూ.73,650 - రూ.90,573 (ఎక్స్-షోరూం) వరకు ఉంటుంది.
6. Honda Dio : రూ.80వేలు లోపు మంచి స్కూటీ కొనాలని అనుకునేవారికి హోండా డియో మంచి ఆప్షన్ అవుతుంది. ఇది చాలా స్టైలిష్ డిజైన్‌తో అమ్మాయిలు, అబ్బాయిలు అందరూ రైడ్ చేయడానికి అనువుగా ఉంటుంది. ఈ బండి మూడు వేరియంట్లలో, 5 రంగుల్లో లభిస్తుంది.
- ఇంజిన్ : 109.51 సీసీ
- పవర్ : 7.85 PS@ 8000 rpm
- టార్క్ : 9.03 Nm@ 5250 rpm
- మైలేజ్ : 50 కి.మీ/ లీటర్
- ప్యూయెల్ కెపాసిటీ : 5.3 లీటర్స్
Honda Dio Price : మార్కెట్లో హోండా డియో స్కూటర్ ధర సుమారుగా రూ.70,211 - రూ.77,712 (ఎక్స్-షోరూం) ఉంటుంది.
7. Bajaj Chetak : హిందుస్థాన్‌లో బజాజ్ చేతక్ స్కూటర్లకు ఎంత పాపులారిటీ ఉండేదో ప్రత్యేకంగా చెప్పాల్సిన పనిలేదు. అందుకే ఆ డిమాండ్‌ను క్యాష్ చేసుకునేందుకు బజాజ్ ఎలక్ట్రిక్ స్కూటీని మార్కెట్లోకి తెచ్చారు. మంచి మైలేజ్ ఇచ్చే స్కూటీ కొనాలని ఆశించేవారికి ఇది బెస్ట్ ఛాయిస్ అవుతుంది. ప్రస్తుతం ఇది 6 వేరియంట్లలో, 10 అందమైన రంగుల్లో లభిస్తోంది.
- మోటార్ పవర్ : 4.2 కిలోవాట్స్
- ఛార్జింగ్ టైమ్ : 6 గంటలు
- రేంజ్ : 123 కి.మీ/ఛార్జ్
- టాప్ స్పీడ్ : 63 కి.మీ/ గంట
- వెహికల్ వారెంటీ : 3 సంవత్సరాలు/ 50,000 కి.మీ
Bajaj Chetak Price : మార్కెట్లో బజాజ్ చేతక్ స్కూటర్ ధర సుమారుగా రూ.99,998 - రూ.1.56 లక్షలు (ఎక్స్-షోరూం) ఉంటుంది.
8. Ola S1 X : మంచి ఎలక్ట్రిక్ వెహికల్ కొనాలని ఆశించేవారికి ఓలా ఎస్1 ఎక్స్ చాలా బాగుంటుంది. ప్రస్తుతం మార్కెట్లో ఉన్న బెస్ట్ ఎలక్ట్రిక్ స్కూటర్లలో ఇది ఒకటి. ఈ ఓలా స్కూటర్ మొత్తం 4 వేరియంట్లలో, 7 రంగుల్లో లభిస్తుంది.
- మోటార్ పవర్ : 2.7 కిలోవాట్స్
- ఛార్జింగ్ టైమ్ : 5 గంటలు
- రేంజ్ (ఎకో మోడ్) : 85 కి.మీ/ఛార్జ్
- రేంజ్ (నార్మల్ మోడ్) : 71 కి.మీ/ఛార్జ్
- బ్యాటరీ వారెంటీ : 8 సంవత్సరాలు
Ola S1 X Price : మార్కెట్లో ఓలా ఎస్1 ఎక్స్ స్కూటర్ ధర సుమారుగా రూ.74,999 - రూ.99,999 (ఎక్స్-షోరూం) ఉంటుంది.
9. Yamaha RayZR 125 Fi Hybrid : ప్రస్తుతం మార్కెట్లో ఉన్న బెస్ట్ స్కూటర్లలో యమహా రేజెడ్ఆర్ 125 ఎఫ్ఐ హైబ్రిడ్ ఒకటి. ఇది లైట్ వెయిట్‌తో, స్పోర్టీ డిజైన్‌తో, మోడ్రన్ మైల్డ్-హైబ్రిడ్ టెక్‌తో వస్తుంది. కనుక కాలేజీ విద్యార్థులకు, యంగ్ ప్రొఫెషనల్స్‌కు ఇది చాలా బాగుంటుంది. ఈ టూ-వీలర్ మొత్తం 5 వేరియంట్లలో, 11 రంగుల్లో లభిస్తుంది.
- ఇంజిన్ : 125 సీసీ
- పవర్ : 8.2 PS@ 6500 rpm
- టార్క్ : 10.3 Nm@ 5000 rpm
- మైలేజ్ : 71.33 కి.మీ/ లీటర్
- ప్యూయెల్ కెపాసిటీ : 5.2 లీటర్స్
Yamaha RayZR 125 Fi Hybrid Price : మార్కెట్లో యమహా స్కూటర్ ధర సుమారుగా రూ.85,300 - రూ.95,730 (ఎక్స్-షోరూం) ఉంటుంది.
10. TVS Jupiter 125 : సుమారు రూ.1 లక్షలోపు మంచి మైలేజ్ ఇచ్చే స్కూటీ కొనాలని అనుకునేవారు టీవీఎస్ జూపిటర్ 125పై ఓ లుక్కేయవచ్చు. ఇది మూడు వేరియంట్లలో, 7 అందమైన రంగుల్లో లభిస్తుంది.
- ఇంజిన్ : 124.8 సీసీ
- పవర్ : 8.15 PS@ 6500 rpm
- టార్క్ : 10.5 Nm@ 4500 rpm
- మైలేజ్ : 57.27 కి.మీ/ లీటర్
- ప్యూయెల్ కెపాసిటీ : 5.1 లీటర్స్
TVS Jupiter 125 Price : మార్కెట్లో టీవీఎస్ జూపిటర్ 125 స్కూటర్ ధర సుమారుగా రూ.86,405 - రూ.96,855 (ఎక్స్-షోరూం) ఉంటుంది.
చిరు వ్యాపారులకు ఉపయోగపడే టాప్-5 టూ-వీలర్స్ ఇవే! - Bike For Business Purpose