Best Mileage Bikes Under 90000 : మీ దైనందిన అవసరాల కోసం మంచి బైక్ కొనాలని అనుకుంటున్నారా? ఇందుకోసం తక్కువ బడ్జెట్లో ఎక్కువ మైలేజ్ ఇచ్చే బైక్ కోసం చూస్తున్నారా? అయితే ఇది మీ కోసమే. ప్రస్తుతం మార్కెట్లో ఉన్న టాప్-10 బైక్‌లపై ఓ లుక్కేద్దాం రండి.
10. Honda Shine : ఇండియాలోని మోస్ట్ పాపులర్ బైక్స్‌లో హోండా షైన్ ఒకటి. ఇది 2 వేరియంట్లలో, 5 కలర్లలో లభిస్తుంది. ఈ బైక్ ముందు, వెనుక భాగాల్లో డ్రమ్ బ్రేక్స్ ఉంటాయి. తక్కువ ధరలో మంచి బైక్ కొనాలని అనుకునేవారికి ఇది బెస్ట్ ఛాయిస్ అని చెప్పుకోవచ్చు. మార్కెట్లో దీనికి పోటీగా హోండా ఎస్పీ 125, హోండా సీడీ 110 డ్రీమ్ ఉన్నాయి.
- ఇంజిన్ - 123.94 సీసీ
- పవర్ - 10.59 bhp
- టార్క్ - 11 Nm
- ట్రాన్స్మిషన్ - 5 స్పీడ్ మాన్యువల్
- మైలేజ్ - 55 కి.మీ/లీటర్
- కెర్బ్ వెయిట్ - 113 కేజీలు
- ఫ్యూయెల్ ట్యాంక్ కెపాసిటీ - 10.5 లీటర్లు
Honda Shine Price : మార్కెట్లో ఈ హోండా షైన్ బైక్ ధర రూ.82,065 - రూ.86,067 ప్రైస్ రేంజ్లో ఉంటుంది.
9. TVS Raider 125 : టీవీఎస్ రైడర్ 125 బైక్ 6 వేరియంట్లలో, 12 అందమైన రంగుల్లో లభిస్తుంది. ఈ బైక్ ముందు భాగంలో డిస్క్ బ్రేకులు, వెనుక భాగంలో డ్రమ్ బ్రేక్‌లు ఉంటాయి. మార్కెట్లో దీనికి పోటీగా బజాజ్ పల్సర్ 125, హోండా ఎస్పీ 125, హీరో ఎక్స్ట్రీమ్ 125 ఉన్నాయి.
- ఇంజిన్ - 124.8 సీసీ
- పవర్ - 11.2 bhp
- టార్క్ - 11.2 Nm
- ట్రాన్స్మిషన్ - 5 స్పీడ్ మాన్యువల్
- మైలేజ్ - 56.7 కి.మీ/లీటర్
- కెర్బ్ వెయిట్ - 123 కేజీలు
- ఫ్యూయెల్ ట్యాంక్ కెపాసిటీ - 10 లీటర్లు
TVS Raider 125 Price : మార్కెట్లో ఈ టీవీఎస్ రైడర్ 125 బైక్ ధర సుమారుగా రూ.89,366 - రూ.1,08,213 వరకు ఉంటుంది.
8. Honda Livo : హోండా లివో 2 వేరియంట్లలో, 3 కలర్లలో లభిస్తుంది. ఈ బైక్ ముందు, వెనుక భాగాల్లో డ్రమ్స్ బ్రేక్స్ ఉంటాయి. మార్కెట్లో దీనికి కాంపిటీషన్‌గా టీవీఎస్ విక్టర్ ఉంది.
- ఇంజిన్ - 109.51 సీసీ
- పవర్ - 8.67 bhp
- టార్క్ - 9.30 Nm
- ట్రాన్స్మిషన్ - 4 స్పీడ్ మాన్యువల్
- మైలేజ్ - 60 కి.మీ/లీటర్
- కెర్బ్ వెయిట్ - 113 కేజీలు
- ఫ్యూయెల్ ట్యాంక్ కెపాసిటీ - 9 లీటర్లు
Honda Livo Price : మార్కెట్లో ఈ హోండా లివో బైక్ ధర సుమారుగా రూ.80,053 - రూ.84,053 వరకు ఉంటుంది.
7. Hero Splendor Plus : తక్కువ బడ్జెట్లో మంచి మైలేజ్ ఇచ్చే బైక్ కొనాలని అనుకునేవారికి హీరో స్ల్పెండర్ ప్లస్ మంచి ఆప్షన్ అవుతుంది. ఈ బైక్ 4 వేరియంట్లలో, 7 కలర్ ఆప్షన్లలో లభిస్తుంది. మార్కెట్లో దీనికి పోటీగా హోండా షైన్ 100, టీవీఎస్ రేడియన్ ఉన్నాయి.
- ఇంజిన్ - 97.2 సీసీ
- పవర్ - 7.91 bhp
- టార్క్ - 8.05 Nm
- ట్రాన్స్మిషన్ - 4 స్పీడ్ మాన్యువల్
- మైలేజ్ - 60 కి.మీ/లీటర్
- కెర్బ్ వెయిట్ - 112 కేజీలు
- ఫ్యూయెల్ ట్యాంక్ కెపాసిటీ - 9.8 లీటర్లు
Hero Splendor Plus Price : మార్కెట్లో ఈ హీరో స్ల్పెండర్ ప్లస్ బైక్ ధర సుమారుగా రూ.74,650 - రూ.78,560 వరకు ఉంటుంది.
6. Hero Xtreme 125R : ప్రతి రోజూ బండి నడిపేవారికి హీరో ఎక్స్ట్రీమ్ 125ఆర్ చాలా మంచి ఆప్షన్ అవుతుంది. ఇది రెండు వేరియంట్లలో, 3 కలర్ ఆప్షన్లలో లభిస్తుంది. ఈ బైక్ ముందు, వెనుక డ్రమ్ బ్రేక్స్ ఉంటాయి. మార్కెట్లో దీనికి పోటీగా టీవీఎస్ రైడర్, బజాజ్ పల్సర్ ఎన్ఎస్125 ఉంటుంది.
- ఇంజిన్ - 124.7 సీసీ
- పవర్ - 11.4 bhp
- టార్క్ - 10.5 Nm
- ట్రాన్స్మిషన్ - 5 స్పీడ్ మాన్యువల్
- మైలేజ్ - 66 కి.మీ/లీటర్
- కెర్బ్ వెయిట్ - 136 కేజీలు
- ఫ్యూయెల్ ట్యాంక్ కెపాసిటీ - 10 లీటర్లు
Hero Xtreme 125R Price : మార్కెట్లో ఈ హీరో ఎక్స్ట్రీమ్ 125ఆర్ బైక్ ధర సుమారుగా రూ.97,683 - రూ.1,03,328 వరకు ఉంటుంది.
5. Hero Splendor Plus Xtec : డైలీ బైక్ రైడ్ చేసేవారికి హీరో స్ల్పెండర్ ప్లస్ ఎక్స్‌టెక్ మంచి ఛాయిస్ అవుతుంది. ఈ బైక్ 3 వేరియంట్లలో, 7 రంగుల్లో లభిస్తుంది. ఈ బైక్ ముందు, వెనుక భాగాల్లో డ్రమ్ బ్రేక్స్ ఉంటాయి.
- ఇంజిన్ - 97.2 సీసీ
- పవర్ - 7.9 bhp
- టార్క్ - 8.05 Nm
- ట్రాన్స్మిషన్ - 4 స్పీడ్ మాన్యువల్
- మైలేజ్ - 73 కి.మీ/లీటర్
- కెర్బ్ వెయిట్ - 112 కేజీలు
- ఫ్యూయెల్ ట్యాంక్ కెపాసిటీ - 9.8 లీటర్లు
Hero Splendor Plus Xtec Price : మార్కెట్లో ఈ హీరో బైక్ ధర సుమారుగా రూ.80,353 - రూ.83,652 వరకు ఉంటుంది.
4. Honda Shine 100 : ఇండియాలోని మోస్ట్ పాపురల్ బైక్‌ల్లో హోండా షైన్ 100 ఒకటి. ఈ బైక్ సింగిల్ వేరియంట్లో, 5 కలర్స్‌లో లభిస్తుంది. ఈ బైక్ ముందు, వెనుక డ్రమ్ బ్రేక్స్ ఉంటాయి. మార్కెట్లో దీనికి టీవీఎస్ రేడియన్, బజాజ్ ప్లాటినా, హీరో స్ల్పెండర్ ప్లస్ గట్టి పోటీనిస్తున్నాయి.
- ఇంజిన్ - 98.98 సీసీ
- పవర్ - 7.28 bhp
- టార్క్ - 8.05 Nm
- ట్రాన్స్మిషన్ - 4 స్పీడ్ మాన్యువల్
- మైలేజ్ - 65 కి.మీ/లీటర్
- కెర్బ్ వెయిట్ - 99 కేజీలు
- ఫ్యూయెల్ ట్యాంక్ కెపాసిటీ - 9 లీటర్లు
Honda Shine 100 Price : మార్కెట్లో ఈ హోండా షైన్ 100 బైక్ ధర సుమారుగా రూ.65,071 ఉంటుంది.
3. Hero HF Deluxe : రూ.60వేల ధరలో మంచి మైలేజ్ ఇచ్చే బైక్ కొనాలని అనుకునేవారికి హీరో హెచ్ఎఫ్ డీలక్స్ మంచి ఆప్షన్ అవుతుంది. ఇది 5 వేరియంట్లలో, 7 అందమైన రంగుల్లో లభిస్తుంది. దీనికి ముందు, వెనుక డ్రమ్ బ్రేక్స్ ఉంటాయి. మార్కెట్లో దీనికి బజాజ్ సీటీ100, టీవీఎస్ స్పోర్ట్, హోండా సీడీ 110 డ్రీమ్ నుంచి గట్టి పోటీ ఉంది.
- ఇంజిన్ - 97.2 సీసీ
- పవర్ - 7.91 bhp
- టార్క్ - 8.05 Nm
- ట్రాన్స్మిషన్ - 4 స్పీడ్ మాన్యువల్
- మైలేజ్ - 65 కి.మీ/లీటర్
- కెర్బ్ వెయిట్ - 110 కేజీలు
- ఫ్యూయెల్ ట్యాంక్ కెపాసిటీ - 9.1 లీటర్లు
Hero HF Deluxe Price : మార్కెట్లో ఈ హీరో హెచ్ఎఫ్ డీలక్స్ బైక్ ధర సుమారుగా రూ.56,675 - రూ.68,990 వరకు ఉంటుంది.
2. Honda SP 125 : ఈ హోండా ఎస్పీ 125 బైక్ 2 వేరియంట్లలో, 5 కలర్స్‌లో లభిస్తుంది. దీనికి ముందు, వెనుక డ్రమ్ బ్రేక్స్ ఉంటాయి. మార్కెట్లో దీనికి పోటీగా టీవీఎస్ రైడర్ 125, హీరో గ్లామర్, ఉన్నాయి.
- ఇంజిన్ - 124 సీసీ
- పవర్ - 10.72 bhp
- టార్క్ - 10.9 Nm
- ట్రాన్స్మిషన్ - 5 స్పీడ్ మాన్యువల్
- మైలేజ్ - 65 కి.మీ/లీటర్
- కెర్బ్ వెయిట్ - 116 కేజీలు
- ఫ్యూయెల్ ట్యాంక్ కెపాసిటీ - 11.2 లీటర్లు
Honda SP 125 Price : మార్కెట్లో ఈ హోండా ఎస్పీ 125 బైక్ ధర సుమారుగా రూ.88,343 - రూ.92,343 వరకు ఉంటుంది.
1. TVS Sport : ప్రస్తుతం మార్కెట్లో ఉన్న బైస్ట్ మైలేజ్ బైక్‌ల్లో టీవీఎస్ స్పోర్ట్ ఒకటి. ఈ బైక్ 2 వేరియంట్లలో, 8 కలర్లలో లభిస్తుంది. దీనికి ముందు, వెనుక డ్రమ్ బ్రేక్స్ ఉంటాయి. మార్కెట్లో దీనికి బజాజ్ సీటీ100, హీరో హెచ్ఎఫ్ డీలక్స్ పోటీగా ఉన్నాయి.
- ఇంజిన్ - 109.7 సీసీ
- పవర్ - 8.18 bhp
- టార్క్ - 8.7 Nm
- ట్రాన్స్మిషన్ - 4 స్పీడ్ మాన్యువల్
- మైలేజ్ - 80 కి.మీ/లీటర్
- కెర్బ్ వెయిట్ - 112 కేజీలు
- ఫ్యూయెల్ ట్యాంక్ కెపాసిటీ - 10 లీటర్లు
TVS Sport Price : మార్కెట్లో ఈ టీవీఎస్ స్పోర్ట్ బైక్ ధర సుమారుగా రూ.64,410 - రూ.70,228 ప్రైస్ రేంజ్లో ఉంటుంది.
మీ ఫ్యామిలీ కోసం మంచి కారు కొనాలా? రూ.10 లక్షల బడ్జెట్లోని టాప్-9 మోడల్స్ ఇవే!
రూ.1 లక్ష బడ్జెట్లో మంచి బైక్ కొనాలా? ఈ టాప్-10 మోడల్స్‌పై ఓ లుక్కేయండి!