Best Family Cars : భారత మార్కెట్లో ఫ్యామిలీ కార్లకు భారీగా డిమాండ్ పెరుగుతోంది. అందుకే దీనిని క్యాష్ చేసుకునేందుకు ప్రముఖ ఆటోమొబైల్ కంపెనీలు అన్నీ లేటెస్ట్ ఫీచర్లతో, ఎక్కువ మైలేజ్ ఇచ్చే కార్లను మార్కెట్లోకి తెస్తున్నాయి. వాటిలో రూ.5 లక్షల నుంచి రూ.10 లక్షల బడ్జెట్లో లభిస్తున్న టాప్-5 కార్ల గురించి ఇప్పుడు తెలుసుకుందాం.
1. Maruti Alto K10 : తక్కువ ధరలో మంచి ఫ్యామిలీ కారు కొనాలని అనుకునేవారికి మారుతి ఆల్టో కె10 మంచి ఆప్షన్ అవుతుంది. ఇది పెట్రోల్, సీఎన్జీ వేరియంట్లలో లభిస్తుంది. పెట్రోల్ కారు 24.39 - 33.85 కి.మీ/ లీటర్ మైలేజ్ ఇస్తుంది. సీఎన్జీ కారు అయితే 33.85 కి.మీ/కేజీ మైలేజ్ ఇస్తుంది. మార్కెట్లో దీని ధర రూ.4.96 లక్షల నుంచి రూ.6.28 లక్షల వరకు ఉంటుంది. దీనిలో డ్యూయెల్ ఫ్రంట్ ఎయిర్బ్యాగ్స్, ఏబీఎస్, ఈబీడీ లాంటి సేఫ్టీ ఫీచర్లు ఉన్నాయి. నలుగురు సభ్యులున్న చిన్న కుటుంబానికి ఇది చాలా బాగుంటుంది.
Maruti Alto K10 Features :
- ఇంజిన్ - 998 సీసీ
- ఫ్యూయెల్ టైప్ - పెట్రోల్/ సీఎన్జీ
- పవర్ - 56-66 బీహెచ్పీ
- టార్క్ - 89 ఎన్ఎం
- ట్రాన్స్మిషన్ - 5-స్పీడ్ మాన్యువల్
- సీటింగ్ కెపాసిటీ - 4/5
- బూట్ స్పేస్ - 214 లీటర్స్
2. Hyundai Santro : భారత్లోని మోస్ట్ పాపులర్ ఫ్యామిలీ కార్లలో హ్యుందాయ్ శాంత్రో ఒకటి. దీని ఇంటీరియర్ చాలా విశాలంగా ఉండి, ఐదుగురు ప్రయాణించడానికి అనువుగా ఉంటుంది. లగేజ్ పెట్టుకోవడానికి ఈ హ్యాచ్బ్యాక్లో పెద్ద బూట్ స్పేస్ ఉంటుంది. ఇంకా ఈ కారులో టచ్స్క్రీన్ ఇన్ఫోటైన్మెంట్ సిస్టమ్, డ్యూయెల్-ఫ్రంట్ ఎయిర్బ్యాగ్స్, ఏబీఎస్, రియర్ పార్కింగ్ సెన్సార్స్ ఉంటాయి. ఇది మంచి మైలేజ్ కూడా ఇస్తుంది. మార్కెట్లో దీని ధర సుమారుగా రూ.4.76 లక్షల నుంచి రూ.6.44 లక్షలు ఉంటుంది.
Hyundai Santro Features :
- ఇంజిన్ - 1086 సీసీ - 999 సీసీ (1.1 లీటర్స్)
- ఫ్యూయెల్ టైప్ - పెట్రోల్/ సీఎన్జీ
- పవర్ - 59.17 - 68.05 బీహెచ్పీ
- టార్క్ - 85.31 - 99.04 ఎన్ఎం
- ట్రాన్స్మిషన్ - 5-స్పీడ్ మాన్యువల్/ఏఎంటీ
- సీటింగ్ కెపాసిటీ - 5
- బూట్ స్పేస్ - 235 లీటర్స్
- మైలేజ్ - 20.3 కి.మీ/ లీటర్
3. Renault Triber : రెనో ట్రైబర్ ఒక ఎంట్రీ-లెవెల్ ఎంపీవీ (మల్టీ-పర్పస్ వెహికల్). దీనిలో 7 సీట్లు ఉంటాయి. కనుక ఫ్యామిలీ మొత్తం కంఫర్టబుల్గా ప్రయాణం చేయవచ్చు. దీని క్యాబిన్ విశాలంగా, ఫోల్డబుల్ సీటింగ్ ఎడ్జెస్టమెంట్తో వస్తుంది. సేఫ్టీ పరంగా చూస్తే దీనికి 4-స్టార్ సేఫ్టీ రేటింగ్ కూడా ఉంది. మార్కెట్లో దీని ధర సుమారుగా రూ.5.54 లక్షల నుంచి రూ.8.02 లక్షలు ఉంటుంది.
Renault Triber Features :
- ఇంజిన్ - 1 లీటర్స్
- ఫ్యూయెల్ టైప్ - పెట్రోల్
- పవర్ - 71 బీహెచ్పీ
- టార్క్ - 96 ఎన్ఎం
- ట్రాన్స్మిషన్ - 5-స్పీడ్ మాన్యువల్/ఏఎంటీ
- సీటింగ్ కెపాసిటీ - 7
- బూట్ స్పేస్ - 84 లీటర్స్
- మైలేజ్ - 18.2 - 20 కి.మీ/ లీటర్
4. Tata Tiago : ఫ్యామిలీ సేఫ్టీ గురించి ఆలోచించేవారికి టాటా టియాగో మంచి ఛాయిస్ అవుతుంది. ఈ హ్యాచ్బ్యాక్ కారులో ఆటోమేటిక్ ఏసీ, డ్యూయెల్ ఎయిర్బ్యాగ్స్, రియర్ కెమెరా, ఏబీఎస్, ఈబీడీ మొదలైన మంచి ఫీచర్లు ఉన్నాయి. మార్కెట్లో ఈ టాటా టియాగో కారు ధర సుమారుగా రూ.4.99 లక్షల నుంచి రూ.7.07 లక్షల వరకు ఉంటుంది.
Tata Tiago Features :
- ఇంజిన్ - 1.2 లీటర్స్
- ఫ్యూయెల్ టైప్ - పెట్రోల్
- పవర్ - 84.48 బీహెచ్పీ
- టార్క్ - 113 ఎన్ఎం
- ట్రాన్స్మిషన్ - 5-స్పీడ్ మాన్యువల్/ఏఎంటీ
- సీటింగ్ కెపాసిటీ - 5
- బూట్ స్పేస్ - 242 లీటర్స్
- మైలేజ్ - 23.84 కి.మీ/ లీటర్
5. Maruti Dzire : ఐదుగురు సభ్యులున్న ఒక కుటుంబానికి మారుతి సుజుకి డిజైర్ మంచి ఆప్షన్ అవుతుంది. ఈ సెడాన్లో టచ్స్క్రీన్ ఇన్ఫోటైన్మెంట్ సిస్టమ్, క్రూయిజ్ కంట్రోల్, డ్యూయెల్ ఎయిర్బ్యాగ్స్, ఏబీఎస్, ఈఎస్పీ, హిల్-హోల్డ్ అసిస్ట్ లాంటి మంచి ఫీచర్లు ఉన్నాయి. మార్కెట్లో దీని ధర సుమారుగా రూ.5.99 లక్షల నుంచి రూ.9.08 లక్షల వరకు ఉంటుంది.
Maruti Dzire Features :
- ఇంజిన్ - 1.2 లీటర్స్
- ఫ్యూయెల్ టైప్ - పెట్రోల్
- పవర్ - 88.50 బీహెచ్పీ
- టార్క్ - 113 ఎన్ఎం
- ట్రాన్స్మిషన్ - 5-స్పీడ్ మాన్యువల్/ఏఎంటీ
- సీటింగ్ కెపాసిటీ - 5
- బూట్ స్పేస్ - 378 లీటర్స్
- మైలేజ్ - 23.26 -24.12 కి.మీ/ లీటర్