ETV Bharat / business

ఇకపై బ్యాంకులు పనిచేసేది 5 రోజులే! టైమింగ్స్ ఎలా ఉంటాయంటే? - Banks To Operate 5 Days A Week Soon

author img

By ETV Bharat Telugu Team

Published : Jun 30, 2024, 2:08 PM IST

Banks To Operate 5 Days A Week Soon : బ్యాంకు ఉద్యోగులు త్వరలో వారానికి 5 రోజులు మాత్రమే పనిచేసే అవకాశం ఉంది. అయితే దీనికి కేంద్ర ప్రభుత్వం ఆమోదం తెలపాల్సి ఉంది. ఇండియన్ బ్యాంక్స్ అసోసియేషన్​, ఎంప్లాయీస్​ యూనియన్​ల మధ్య ఒక ఒప్పందం కుదిరింది. దీని ప్రకారం, శని, ఆదివారాలు బ్యాంకులకు సెలవు ఉంటుంది. అయితే రోజు వారీ పని గంటలు మాత్రం పెరుగుతాయి. పూర్తి వివరాలు మీ కోసం.

5 Day Banking In India
No banking on Saturdays in india (ETV Bharat)

Banks To Operate 5 Days A Week Soon : బ్యాంకు ఉద్యోగులు చాలా కాలంగా వారంలో ఐదు పనిదినాలు మాత్రమే ఉండాలని డిమాండ్ చేస్తున్నారు. అయితే ఈ ఏడాది చివరి నాటికి ఈ కోరిక నెరవేరే అవకాశం ఉంది. వారంలో రెండు వీక్లీ ఆఫ్​లకు సంబంధించి ఇండియన్​ బ్యాంక్స్ అసోసియేషన్​ (ఐబీఏ), ఉద్యోగుల సంఘాల మధ్య ఇప్పటికే ఒక ఒప్పందం కుదిరింది. దీనికి కేంద్ర ప్రభుత్వం ఆమోదం తెలపాల్సి ఉంది. బహుశా 2024 చివరి నాటికి ప్రభుత్వం దీనికి ఆమోదం తెలిపే అవకాశం ఉందని ఓ అంచనా. ఇదే జరిగితే డిసెంబర్​ నుంచి బ్యాంకు ఉద్యోగులు వారానికి 5 రోజులు మాత్రమే పనిచేసే అవకాశం ఉంటుంది.

పెరగనున్న పని గంటలు!
బ్యాంకులు వారంలో 5 రోజులే పనిచేసినా, ఖాతాదారులకు అందించే సేవలకు ఎలాంటి ఆటంకం కలగదని ఫోరమ్ హామీ ఇచ్చింది. అంటే పని గంటలు పెంచుతామని స్పష్టం చేసింది. 2023 డిసెంబర్​లో ప్రభుత్వ, ప్రైవేట్​ బ్యాంకులతో సహా ఇండియన్ బ్యాంక్స్​ అసోసియేషన్​ (ఐబీఏ), బ్యాంక్ యూనియన్​ల మధ్య ఒక అవగాహన ఒప్పందం (ఎంవోయూ) జరిగింది. దీని ప్రకారం, బ్యాంకులు వారంలో 5 రోజులు మాత్రమే పనిచేయాలి. అయితే దీన్ని ప్రభుత్వం ఆమోదించాల్సి ఉంది.

2024 మార్చి 8న ఆల్​ ఇండియా బ్యాంక్ ఆఫీసర్స్​ కాన్ఫెడరేషన్​తో పాటు, ఐబీఏ, బ్యాంకు యూనియన్​లు 9వ జాయింట్​ నోట్​పై సంతకాలు చేశాయి. దీని ప్రకారం శని, ఆదివారాలు సెలవు దినాలుగా ఉంటాయి.

డిసెంబర్ నుంచే!
ఐబీఏ, బ్యాంకు యూనియన్లు ఏకాభిప్రాయంతో ఉన్నప్పటికీ, తుది నిర్ణయం మాత్రమే ప్రభుత్వమే తీసుకోవాల్సి ఉంటుంది. అందుకే బ్యాంక్ పని వేళలు, అంతర్గత కార్యకలాపాలను నియంత్రించే రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా (ఆర్​బీఐ)తో ఈ ప్రతిపాదన గురించి చర్చించే అవకాశం ఉంది. కానీ ఇది ఎప్పటికిలోగా జరుగుతుందనే దానిపై స్పష్టత లేదు. అయితే కొంత మంది బ్యాంకు ఉద్యోగులు మాత్రం ప్రభుత్వం ఈ ఏడాది చివరి నాటికి లేదా 2025 ప్రారంభంలో ఈ ప్రతిపాదనకు ఆమోదం తెలిపే అవకాశం ఉందని అంచనా వేస్తున్నారు. ఒకవేళ ప్రభత్వం ఆమోదం తెలిపితే, నెగోషియబుల్​ ఇన్​స్ట్రుమెంట్స్ యాక్ట్​లోని సెక్షన్ 25 ప్రకారం, ఇకపై అన్ని శనివారాలు అధికారికంగా సెలవు దినాలుగా పరిగణించబడతాయి.

టైమింగ్స్ ఇవే!
వారంలో 5రోజులే పని దినాలు ఉంటే, అప్పుడు బ్యాంకుల పని గంటలు పెరిగే అవకాశం ఉంది. బహుశా ఒక రోజులో 40 నిమిషాలు అదనంగా బ్యాంకులు పనిచేయవచ్చు. అంటే బ్యాంకు పనివేళలు ఉదయం 9:45 నుంచి సాయంత్రం 5:30 వరకు ఉంటాయి. దీని వల్ల బ్యాంకు ఖాతాదారులకు, కస్టమర్లకు ఎలాంటి ఇబ్బంది లేకుండా సేవలు అందించడానికి వీలవుతుంది.

ప్రస్తుతం బ్యాంకులు అన్నీ రెండో, నాలుగో శనివారాల్లో పనిచేయడం లేదు. వాస్తవానికి బ్యాంక్ యూనియన్లు 2015 నుంచి అన్ని శని, ఆదివారాలు సెలవులు ఇవ్వాలని డిమాండ్ చేస్తున్నాయి. 2015లో కుదిరిన 10వ ద్వైపాక్షిక సెటిల్​మెంట్ ప్రకారం, రెండో, నాలుగో శనివారాలను మాత్రమే సెలవు దినాలుగా ప్రకటించేందుకు ఆర్​బీఐ, కేంద్ర ప్రభుత్వం అంగీకరించాయి.

ఫిక్స్​డ్​ Vs ఫ్లోటింగ్ హోమ్ లోన్ వడ్డీ రేటు - వీటిలో ఏది బెస్ట్ ఆప్షన్​? - How To Choose Best Home Loan

ఆస్తి కొంటున్నారా? ఈ 10 విషయాలు తెలుసుకోవడం మస్ట్! లేకుంటే ఇక అంతే! - Property Buying Tips

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.