Swift Recovery Of Stolen Money : సాంకేతిక పరిజ్ఞానంతో సైబర్ నేరగాళ్లు సామాన్యులను దోచుకుంటున్నారు. వీటిని అదుపు చేయడం బ్యాంకింగ్ వ్యవస్థకు పెద్ద సవాలుగా మారింది. అందుకే సైబర్ నేరగాళ్లకు చెక్ పెట్టేందుకు బ్యాంకులు సరికొత్త వ్యూహం పన్నుతున్నాయి. సైబర్ దాడులు జరిగినప్పుడు మోసగాళ్ల ఖాతాలను వేగంగా బ్లాక్ చేసేందుకు తమ సిస్టమ్‌లను కేంద్ర హోంమంత్రిత్వ శాఖ ఆధ్వర్యంలోని 'నేషనల్ సైబర్ క్రైమ్ రిపోర్టింగ్ పోర్టల్'తో అనుసంధానం చేయాలని భావిస్తున్నాయి.
డిజిటల్ క్రిమినల్స్, ఫిషింగ్ అటాకర్స్ బాధితుల ఖాతాలను హ్యాక్ చేసి, డబ్బులు దోచుకుని, వాటిని విత్‌డ్రా చేయడం లేదా ఖర్చు చేస్తుంటారు. కొన్ని సార్లు తాము దోచుకున్న డబ్బును, చాలా అకౌంట్లలోకి బదిలీ చేస్తుంటారు. ఇది సైబర్ కేటుగాళ్లు ఉపయోగించే ఒక వ్యూహం. అందుకే సైబర్ నేరగాళ్లను అడ్డుకోవడం చాలా కష్టమవుతోంది. దీనికి చెక్ పెట్టేందుకు బ్యాంకులు ఇప్పుడు ప్రతివ్యూహం పన్నుతున్నాయి. సైబర్ నేరగాళ్లు బాధితుల అకౌంట్ల నుంచి ఇతర ఖాతాల్లోకి డబ్బులు బదిలీ చేయకుండా, ముందుగా అడ్డుకోవాలని చూస్తున్నాయి. ఇందుకోసమే 'నేషనల్ సైబర్ క్రైమ్ రిపోర్టింగ్ పోర్టల్'తో తమ సిస్టమ్‌లను అనుసంధానం చేయాలని భావిస్తున్నాయి.
అకౌంట్ ఆటోమెటిగ్గా బ్లాక్ అవుతుంది :
బ్యాంకులు, సైబర్ క్రైమ్ నిపుణులతో సంప్రదింపులు జరిపి, తదుపరి చర్యలు తీసుకోవడానికి చాలా సమయం పడుతుంది. దీని వల్ల సైబర్ క్రైమ్ కేసుల్లో తీవ్రమైన జాప్యం జరుగుతోంది. దీనిని నివారించడానికి NCRPతో APIను ఇంటిగ్రేట్ చేయాలని బ్యాంకులు భావిస్తున్నాయి. దీని వల్ల మానవుల ప్రమేయం లేకుండా అంటే ఆటోమేటిక్‌గా, హ్యాక్ అయిన బ్యాంక్ అకౌంట్లు తాత్కాలికంగా (ఫ్రీజ్) స్తంభించిపోతాయి. దీని వల్ల సైబర్ క్రిమినల్స్ సదరు ఖాతాలోని డబ్బులను విత్‌డ్రా చేయలేరు. వేరే ఖాతాలకు మళ్లించలేరు. ఒకవేళ అప్పటికే సైబర్ నేరగాళ్లు డబ్బులు దోచుకుంటే, వారి అకౌంట్లు కూడా ఫ్రీజ్ అయిపోతాయి. కనుక వాళ్లు ఆ డబ్బులను డ్రా చేయలేరు. ఇతర ఖాతాల్లోకి మళ్లించలేరు.
ఇండియన్ సైబర్ క్రైమ్ కో-ఆర్డినేషన్ సెంటర్ అనేది హోం వ్యవహారాల మంత్రిత్వ శాఖ ఆధ్వర్యంలో పనిచేస్తుంది. ఇది సైబర్ క్రైమ్ కేసులను పరిష్కరిస్తూ ఉంటుంది. అలాగే చట్టాలను అమలు చేసే ఏజెన్సీలు, బ్యాంకులు వంటి సంస్థల మధ్య సమన్వయాన్ని మెరుగుపరచడంపై ఫోకస్ పెడుతుంది.
పీఎఫ్ ఖాతాదారులకు గుడ్ న్యూస్ - అడ్వాన్స్ విత్డ్రావెల్ లిమిట్ 'డబుల్'! - EPF Advance Claim Limit
బిట్‌కాయిన్ 'హావింగ్' కంప్లీట్ - ఇకపై లావాదేవీలు ఎలా జరుగుతాయంటే? - Bitcoin Halving