ETV Bharat / business

లాంఛ్​కు బజాజ్​ CNG బైక్ రెడీ- తక్కువ ధర, పవర్​ఫుల్ ఇంజిన్, స్టైలిష్ లుక్! - Bajaj Bruzer CNG Bike Launch - BAJAJ BRUZER CNG BIKE LAUNCH

Bajaj Bruzer CNG Bike Launch : దేశీయ ఆటోమొబైల్ కంపెనీ బజాజ్​ ప్రపంచంలోనే మొదటి సీఎన్​జీ మోటార్​సైకిల్​ను రూపొందించింది. దీనికి 'బ్రూజర్'​​ అని పేరు పెట్టింది. దీనిని ఈ జూన్​ నెలలో లాంఛ్ చేయడానికి సన్నాహాలు చేస్తోంది. మరెందుకు ఆలస్యం దీని ఫీచర్స్​, స్పెక్స్,​ ధర వివరాలు గురించి తెలుసుకుందామా?

Bajaj Bruzer CNG Bike Price
Bajaj Bruzer CNG Bike Launch (ETV Bharat)
author img

By ETV Bharat Telugu Team

Published : May 22, 2024, 4:21 PM IST

Bajaj Bruzer CNG Bike Launch : బజాజ్​ ఆటో కంపెనీ ప్రపంచంలోనే మొదటి సీఎన్​జీ మోటార్​ సైకిల్​ను రూపొందించింది. దీనికి బ్రూజర్​​ (Burzer) అని పేరు పెట్టింది. ఈ జూన్ 18న దీనిని ఇండియన్ మార్కెట్లో దీనిని లాంఛ్ చేయనున్నట్లు ప్రకటించింది.

జూన్​ 18న లాంఛ్​
బజాజ్​ ఆటో మేనేజింగ్ డైరెక్టర్ రాజీవ్​ బజాజ్ 2024​ జూన్ 18​న ఈ బ్రూజర్​ సీఎన్​జీ మోటార్​సైకిల్​ను లాంఛ్ చేయనున్నట్లు ప్రకటించారు. అయితే దీనిని నేరుగా బజాజ్ బ్రాండ్​తో కాకుండా, బజాజ్ సబ్-బ్రాండ్​ కింద తెస్తామని వెల్లడించారు.

Bajaj Bruzer CNG Bike Features :
ఈ బజాజ్​ బ్రూజర్​ను​ ఒక కమ్యూటర్ బైక్​గా రూపొందించారు. భారీ స్థాయిలో అమ్మకాలు జరపడమే లక్ష్యంగా దీనిని తీసుకువచ్చారు. దీనిని వివిధ ప్రాంతాల్లో దశలవారీగా ప్రవేశపెట్టే అవకాశం ఉంది.

  • ఈ బజాజ్ సీఎన్​జీ బైక్​ 110 సీసీ -125 సీసీ ఎయిర్​-కూల్డ్ ఇంజిన్​, 5-స్పీడ్​ ట్రాన్స్​మిషన్ అనుసంధానంతో వస్తుందని తెలుస్తోంది. దీనిలో మోనోషాక్​ సస్పెన్షన్​ సెటప్​ కూడా ఉంది. ఈ బ్రూజర్​ బైక్​లో ముందు వైపు డిస్క్ బ్రేక్స్​, వెనుక వైపు డ్రమ్ బ్రేక్​లు ఉంటాయి.
  • ఈ బజాజ్ బ్రూజర్ బైక్​లో వృత్తాకార ఎల్​ఈడీ హెడ్​లైట్​, చిన్న ఫ్లైస్క్రీన్​, నిటారుగా ఉండే హ్యాండిల్ బార్​, సంప్​ గార్డ్​, హాలోజన్​ టర్న్​ సిగ్నల్స్​, నకిల్ గార్డ్​లు అమర్చారు.
  • ఈ బజాజ్​ బ్రూజర్​ బైక్​లో టెలిస్కోపిక్​ ఫ్రంట్​ ఫోర్క్​లు, పొడవైన సీటు, ట్యూబులర్ గ్రాబ్​ రైల్​ ఉంటాయి. అలాగే దీనికి ప్రత్యేకంగా సైడ్​-మౌంటెడ్​ ఎగ్జాస్ట్​ యూనిట్​, బ్లాక్​ ఫినిష్డ్​ అల్లాయ్ వీల్స్​ అమర్చారు. అలాగే దీనిలో మిడ్​-మౌంటెడ్​ ఫుట్​పెగ్​, సెమీ-డిజిటల్ ఇన్​స్ట్రుమెంట్ కన్సోల్​లను ఇన్​స్టాల్​ చేశారు. సాధారణ ఫ్యూయెల్ ట్యాంక్ దిగువన సీఎన్​జీ ట్యాంక్​ను అమర్చారు. అందువల్ల ఈ బైక్​ పెట్రోల్​తోనూ, సీఎన్​జీతోనూ నడపడానికి వీలుగా ఉంటుంది.

ఎక్కువ మైలేజ్!
చాలా మంది మంచి మైలేజ్ ఇచ్చే బైక్​లు కొనాలని ఆశపడుతూ ఉంటారు. అలాంటి వారిని దృష్టిలో ఉంచుకునే, బజాజ్ కంపెనీ ఈ నయా సీఎన్​జీ బైక్​ను రూపొందించింది. త్వరలో మరిన్ని సీఎన్​జీ టూ-వీలర్స్​ తీసుకువచ్చేందుకు కూడా కంపెనీ ప్లాన్ చేస్తోంది.

ఈ సీఎన్​జీ బైక్​ ఫ్యూయెల్​ ట్యాంక్​ను ప్రత్యేకంగా రూపొందిస్తున్నారు. ముఖ్యంగా దీనిలో సీఎన్​జీ, పెట్రోల్​ ఫ్యూయెల్​ ఆప్షన్లు రెండూ కల్పిస్తున్నారు. మార్కెట్లో ఈ బైక్ ధర సుమారుగా రూ.80,000 నుంచి రూ.85,000 (ఎక్స్​-షోరూం) ఉంటుందని అంచనా.

బజాజ్​ కంపెనీ ఎలక్ట్రిక్ బైక్ లవర్స్​ను కూడా ఆకర్షించాలని ఆశిస్తోంది. అందులో భాగంగా వచ్చే ఏడాది న్యూ జనరేషన్​ చేతక్ ఎలక్ట్రిక్​ టూ-వీలర్​ను తీసుకురావడానికి సిద్ధమవుతోంది.

కేంద్ర ప్రభుత్వానికి RBI రూ.2 లక్షల కోట్ల డివిడెండ్ - గతేడాదితో పోలిస్తే డబుల్! - RBI Dividend Payout To Govt

మంచి ఎలక్ట్రిక్ కార్ కొనాలా? టాప్​-5 మోస్ట్ అఫర్డబుల్ e-SUVలు ఇవే! - Most Affordable Electric Cars

ETV Bharat Logo

Copyright © 2025 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.