Ather Rizta Electric Scooter Launch : బెంగళూరుకు చెందిన ప్రముఖ ఎలక్ట్రిక్ వాహనాల తయారీ సంస్థ ఏథర్ (Ather) రిజ్తా పేరుతో సరికొత్త ఎలక్ట్రిక్ స్కూటర్‌ను లాంఛ్ చేసింది. ఇది ఒక ఫ్యామిలీ స్కూటర్ అని చెప్పవచ్చు.
Ather Rizta Electric Scooter Features :
మునుపటి ఏథర్ 450 మోడల్స్‌లా కాకుండా లుక్ పరంగా ఈ ఎలక్ట్రిక్ స్కూటర్లో పలు మార్పులు చేశారు. వైడ్ లెగ్స్పేస్, పెద్ద సీటుతో దీన్ని తీసుకొచ్చారు. ఇది రిజ్తా ఎస్, రిజ్తా జడ్ అనే రెండు వేరియంట్లలో లభిస్తుంది. రిజ్తా ఎస్‌లో 2.9 కిలోవాట్ బ్యాటరీ, రిజ్తా జడ్లో 3.7 కిలోవాట్ సామర్థ్యం గల బ్యాటరీ ఉన్నాయి.
ఏథర్ రిజ్తా ఎస్ 3 కలర్ ఆప్షన్లలో, రిజ్తా జడ్ 7 రంగుల్లో లభిస్తుంది. ఈ ఎలక్ట్రిక్ స్కూటర్లలో స్మార్ట్ ఎకో, జిప్ మోడల్‌లు కూడా ఉన్నాయి. ట్రాక్షన్ కంట్రోల్, ఎమర్జెన్సీ స్టాప్ సిగ్నల్, థెఫ్ట్ డిటెక్ట్, మ్యాజిక్ ట్విస్ట్, ఆటో హోల్డ్, రివర్స్ మోడ్ లాంటి బెస్ట్ ఫీచర్లు వీటిలో ఉన్నాయి.
ఏథర్ రిజ్తా బేస్ వేరియంట్లో 7 అంగుళాల ఎల్సీడీ డిస్ప్లే అమర్చారు. మిగిలిన రెండు వేరియంట్లలో 7 అంగుళాల టీఎఫ్టీ డిస్ప్లేను పొందుపరిచారు. ఈ స్కూటర్లలో 56 లీటర్ల స్టోరేజ్ స్పేస్ ఉంటుంది. ఏథర్ కంపెనీ ఈ స్కూటర్లతో పాటు ఏథర్ హాలో, హాలో బిట్ పేరిట రెండు స్మార్ట్ హెల్మెట్లను కూడా తీసుకొచ్చింది. హాలో హెల్మెట్ ధర రూ.14,999; హాలో బిట్ ధర రూ.4,999గా కంపెనీ నిర్ణయించింది.
Ather Rizta Electric Scooter Price :
- మార్కెట్లో రిజ్తా ఎస్ ధర రూ.1.10 లక్షలుగా (ఎక్స్-షోరూం) కంపెనీ నిర్ణయించింది. దీనిపై సింగిల్ ఛార్జింగ్‌తో 123 కిలోమీటర్ల రేంజ్ వరకు ప్రయాణించవచ్చని కంపెనీ క్లెయిమ్ చేస్తోంది.
- రిజ్తా జడ్ మోడల్ ధరను రూ.1.25 లక్షలుగా ఏథర్ కంపెనీ నిర్ణయించింది. ఈ ఎలక్ట్రిక్ స్కూటర్ కూడా 123 కిలోమీటర్ల రేంజ్ ఇస్తుంది. ఇందులోని టాప్ వేరియంట్ ధర రూ.1.45 లక్షల వరకు ఉంటుంది. దీనిపై గరిష్ఠంగా 160 కిలోమీటర్లు ప్రయాణించవచ్చు. ఈ మూడు ఏథర్ ఈవీ స్కూటర్ల టాప్ స్పీడ్ గంటకు 80 కిలోమీటర్లు.
రూ.1 లక్ష బడ్జెట్లో మంచి బైక్ కొనాలా? టాప్-10 పవర్ఫుల్ మోడల్స్ ఇవే! - Best Bikes Under 1 Lakh