Adani Shares Today Graph : అమెరికాకు చెందిన షార్ట్ సెల్లర్ హిండెన్‌బర్గ్ ఆరోపణలు మరోసారి సంచలనం రేపుతున్నాయి. అదానీ గ్రూప్ సంస్థల షేర్ల విలువలు కృత్రిమంగా పెంచేందుకు వినియోగించిన మారిషస్ ఫండ్‌లలో సెబీ ఛైర్‌పర్సన్ మాధబి పురికి వాటాలు ఉన్నాయని చేసిన హిండెన్‌బర్గ్ ఆరోపణలు స్టాక్ట్ మార్కెట్లుపై తీవ్రంగా ప్రభావం చూపుతున్నాయి. దీనితో అదానీ ఎనర్జీ సొల్యూషన్స్ 17 శాతం నష్టాల్లో కొనసాగుతోంది.
అదానీ టోటల్ గ్యాస్ 13.39 శాతం, ఎన్‌డీటీవీ 11 శాతం, అదానీ పవర్ 10.94 శాతం పతనమయ్యాయి. అదానీ గ్రీన్ ఎనర్జీ స్టాక్స్ 6.96 శాతం, అదానీ విల్మార్ 6.49 శాతం, అదానీ ఎంటర్‌ప్రైజెస్ 5.43 శాతం, అదానీ పోర్ట్స్ 4.95 శాతం, డైవ్డ్, అంబుజా సిమెంట్స్ 2.53 శాతం, ఏసీసీ 2.42 శాతం మేర పడిపోయాయి.
మరోవైపు, తమ ఆరోపణలను ఖండిస్తూ సెబీ చీఫ్ మాధబి బచ్ చేసిన ప్రకటన మరిన్ని సంక్లిష్ట ప్రశ్నలు లేవనెత్తుతోందని హిండెన్‌బర్గ్ పేర్కొంది. సెబీ చీఫ్ స్పందనపై ఆ సంస్థ ఆదివారం రాత్రి మరోసారి సామాజిక మాధ్యమం ఎక్స్‌లో స్పందించింది. మాధబి స్పందనలో ఆమెకు బెర్మడా/మారిషస్ ఫండ్లు ఉన్నాయన్న విషయాన్ని ధ్రువీకరిస్తున్నాయని పేర్కొంది. దీంతోపాటు ఆ ఫండ్స్‌ను ఆమె భర్త ధావల్ చిన్ననాటి మిత్రుడు నడుపుతున్న విషయం కూడా తేలిందని పేర్కొంది. ప్రస్తుతం అతడు అదానీ గ్రూపులో డైరెక్టర్‌గా చేస్తున్నారని వెల్లడించింది.
అదానీ విషయంలో దర్యాప్తు చేసే బాధ్యతను సెబీకి అప్పగించారు. వాటిల్లో బచ్ వ్యక్తిగత పెట్టబడులు, ఇతర స్పాన్సర్ల నిధులు ఉన్నాయని వెల్లడించింది. ఇది విరుద్ధ ప్రయోజనాల అంశం కిందకు వస్తుందని ఆరోపించింది. సెబీలో నియామకంతో ఆమె 2017లో స్థాపించిన కంపెనీలు నిద్రాణమైపోయాయని పేర్కొంది. 2019లో ఆమె భర్త సదరు సంస్థల బాధ్యతను స్వీకరించారని వెల్లడించింది. ఆ కంపెనీ ఇప్పటికీ మాధబి సొంత కంపెనీగా పేర్కొంది. కన్సల్టెంగ్ రెవెన్యూను అది సంపాదిస్తోదని తెలిపింది. అయితే హిండెన్‌బర్గ్ ఆరోపణలను ఖండిస్తూ మాధబి, ఆమె భర్త ధావల్ బచ్ సంయుక్త ప్రకటన విడుదల చేశారు. హిండెన్‌బర్గ్ ఆరోపణలు ఆధారరహితమని, ఎటువంటి నిజాలు లేవన్నారు.
భారత్ మార్కెట్లో మరో బాంబు పేలనుందా? హిండెన్‌బర్గ్ తరువాతి టార్గెట్ ఎవరు? - Hindenburg India Tweet