ETV Bharat / business

ఆధార్‌-రేషన్‌ కార్డ్‌ లింక్​ గడువు పొడిగింపు - ఎప్పటి వరకు అంటే? - Aadhaar Ration Card Linking - AADHAAR RATION CARD LINKING

Aadhaar-Ration Card Linking : ఆధార్‌తో - రేషన్‌ కార్డ్‌ను అనుసంధానం చేసేందుకు ఇచ్చిన గడువును మరో మూడు నెలలు పాటు పెంచుతూ కేంద్ర ప్రభుత్వం కీలక నిర్ణయం తీసుకుంది. వాస్తవానికి జూన్‌ 30తో ఆధార్- రేషన్​ కార్డ్ అనుసంధానం చేసే గడువు ముగిస్తుంది. అందుకే వినియోగదారుల ప్రయోజనం కోసం మరోసారి గడువును పొడిగిస్తున్నట్లు కేంద్రం ప్రకటించింది.

Ration Card- Aadhaar Linking Date Extended
Aadhaar-Ration Card Linking Date Extended (ETV Bharat)
author img

By ETV Bharat Telugu Team

Published : Jun 12, 2024, 4:58 PM IST

Aadhaar-Ration Card Linking : ఆధార్‌- రేషన్‌ కార్డ్‌లను లింక్‌ చేయని వారికి కేంద్ర ప్రభుత్వం మరో అవకాశాన్ని కల్పించింది. ఆధార్​-రేషన్​ కార్డ్​లను లింక్ చేసుకునేందుకు మరో 3 నెలలపాటు​ గడువును పొడిగిస్తున్నట్లు ప్రకటించింది. వాస్తవానికి 2024 జూన్‌ 30తోనే గడువు ముగియనుండగా, దానిని ఈ సెప్టెంబర్‌ 30 వరకు పెంచింది.

దేశంలో రేషన్‌ కార్డులు విపరీతంగా దుర్వినియోగం అవుతున్న నేపథ్యంలో అవకతవకల్ని అడ్డుకొనేందుకు ఆధార్‌- రేషన్‌ కార్డ్‌లను కచ్చితంగా లింక్‌ చేసుకోవాలని కేంద్రం గతంలో ఆదేశించింది. దీనితో చాలా మంది వీటిని అనుసంధానం చేసుకున్నారు. అయితే ఇంకా అనుసంధానం చేసుకోనివారి కోసం మళ్లీ గడువు పెంచింది కేంద్రం.

నకిలీ రేషన్​ కార్డులు తొలగించడం కోసం!
ఆధార్‌- రేషన్‌ కార్డు అనుసంధానం చేసుకోవడం వల్ల నకిలీ రేషన్​ కార్డులను నిర్మూలించడానికి అవకాశం ఏర్పడుతుంది. అర్హులైన వారందరికీ ఆహార ధాన్యాలు అందించడానికి వీలవుతుంది. అందుకే ఇప్పటికీ ఆధార్‌-రేషన్‌ కార్డ్‌లను అనుసంధానం చేయని వారు, ఈ ప్రక్రియను వీలైనంత త్వరగా పూర్తి చేయడం మంచిది.

లింక్ చేయడం ఎలా?
Aadhaar-Ration Card Linking Process : మీ సమీపంలోని రేషన్ షాప్​ లేదా కామన్ సర్వీస్​ సెంటర్​ (సీఎస్​సీ) దగ్గరకు వెళ్లి ఆధార్-రేషన్ కార్డులను లింక్​ చేయించుకోవచ్చు. ఇందుకోసం మీ ఆధార్​, రేషన్​ కార్డులతోపాటు అవసరమైన అన్ని పత్రాలు అందించి, బయోమెట్రిక్ వెరిఫికేషన్ చేసుకోవాల్సి ఉంటుంది. మీరు కోరుకుంటే ఆన్​లైన్​ పోర్టల్ ద్వారా కూడా ఆధార్​-రేషన్ కార్డులను అనుసంధానం చేసుకోవచ్చు. అది ఎలా అంటే?

  • ముందుగా మీరు రాష్ట్ర పబ్లిక్​ డిస్ట్రిబ్యూషన్ సిస్టమ్​ (పీడీఎస్​) పోర్టల్​ ఓపెన్ చేయాలి.
  • అందులో Link Aadhaar with the active ration card ఆప్షన్​పై క్లిక్ చేయాలి.
  • మీ రేషన్ కార్డ్, ఆధార్ నంబర్​, మీ మొబైల్ నంబర్లను ఎంటర్ చేసి సబ్మిట్ చేయాలి.
  • వెంటనే మీ మొబైల్​కు ఒక ఓటీపీ వస్తుంది. దానిని ఎంటర్ చేస్తే చాలు.
  • మీ ఆధార్​-రేషన్ కార్డుల అనుసంధానం పూర్తి అవుతుంది. అంతే సింపుల్​!

ఆధార్​ కార్డ్ ఫ్రీ అప్డేట్​కు మరో 2 రోజులే ఛాన్స్​!
Aadhaar Card Free Update Deadline : ఆధార్​ వివరాలను ఉచితంగా అప్​డేట్​ చేసుకునేందుకు మరో 2 రోజుల వరకే ఛాన్స్​ ఉంది. అందువల్ల ఇప్పటి వరకు ఆధార్ అప్​డేట్ చేసుకోనివారు, గడువులో దానిని పూర్తి చేయడం మంచిది.

భారత విశిష్ట గుర్తింపు ప్రాధికార సంస్థ (UIDAI) ఆధార్ కార్డ్​ను పూర్తి ఉచితంగా అప్​డేట్​ చేసుకునేందుకు జూన్ 14 వరకు అవకాశం ఇచ్చింది. ఇప్పటికే పలుమార్లు ఈ గడువును పొడిగిస్తూ వచ్చిన ఉడాయ్​ ఇకపై ఈ గడువును పొడిగిస్తుందో, లేదో తెలియదు. కనుక జూన్​ 14లోపు మీ ఆధార్​లోని వివరాలను ఉచితంగా అప్​డేట్ చేసుకోవడం మంచిది.

హోం లోన్ కోసం ప్రయత్నిస్తున్నారా? ముందుగా ఈ విషయాలు తెలుసుకోవడం మస్ట్​! - Home Loan Tips

మార్కెట్​లో వీటిని కొట్టే మోడల్ లేదు! టాప్​-10 ఆల్​ టైమ్​ బెస్ట్ సెల్లింగ్ కార్స్ ఇవే! - Best Selling Cars Of All Time

ETV Bharat Logo

Copyright © 2025 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.