ETV Bharat / business

మీరు క్రెడిట్ కార్డ్ వాడుతున్నారా? ఈ 5 తప్పులు అస్సలు చేయొద్దు! - 5 Common Credit Card Mistakes - 5 COMMON CREDIT CARD MISTAKES

5 Major Credit Card Mistakes : ప్రస్తుత కాలంలో క్రెడిట్ కార్డు వాడకం చాలా సర్వసాధారణం అయిపోయింది. చాలా మందికి ఆర్థిక అత్యవసర పరిస్థితుల్లో క్రెడిట్ కార్డ్​ ఒక వరంలా కనిపిస్తుంది. ఈ క్రమంలో క్రెడిట్ కార్డు వాడుతున్నవారు చేయకూడని 5 తప్పులేంటో ఈ స్టోరీలో చూద్దాం.

5 Major Credit Card Mistakes
5 Major Credit Card Mistakes (ETV Bharat)
author img

By ETV Bharat Telugu Team

Published : Aug 27, 2024, 3:13 PM IST

5 Major Credit Card Mistakes : మన జీవితంలో అకస్మాత్తుగా అనేక ఆర్థిక అవసరాలు వస్తుంటాయి. అటువంటి అత్యవసర పరిస్థితుల్లో మన దగ్గర డబ్బులు లేకపోవచ్చు. అలాంటి పరిస్థితుల్లో క్రెడిట్‌ కార్డులు ఎంతగానో ఉపయోగపడతాయి. అందుకే ప్రస్తుతం క్రెడిట్‌ కార్డులు నిత్యావసరంగా మారాయి. ఈ రోజుల్లో చెల్లింపులు చేయడానికి పెద్ద సంఖ్యలో ప్రజలు క్రెడిట్‌ కార్డులను ఉపయోగిస్తున్నారు.

అయితే క్రెడిట్ కార్డును సరైన పద్ధతిలో ఉపయోగించుకున్నట్లయితే మీకు అత్యవసర సమయాల్లో ఆర్థిక సాధనంగా ఉపయోగపడుతుంది. అలాగే రివార్డ్స్, క్యాష్‌ బ్యాక్, డిస్కౌంట్​లను అందిస్తుంది. అయితే, అనవసరమైన ఖర్చుల కోసం క్రెడిట్ కార్డును వాడడం మిమ్మల్ని అప్పుల ఊబిలోకి నెడుతుంది. ఈ క్రమంలో క్రెడిట్ కార్డు ఉన్నవారు చేయకూడని 5 తప్పులేంటో ఈ స్టోరీలో తెలుసుకుందాం.

ఆలస్యంగా చెల్లింపులు
క్రెడిట్ కార్డులు తీసుకునేవారు ఒక విషయం గుర్తుంచుకోవాలి. కొన్ని క్రెడిట్ కార్డు జారీ సంస్థలు అధిక వడ్డీ రేటుతో కార్డులను అందిస్తాయి. ఈ క్రెడిట్ కార్డు బిల్లులను సకాలంలో కట్టేయాలి. లేదంటే ఆలస్య రుసుములు పడి అప్పుల ఊబిలో కూరుకుపోతారు. అలాగే క్రెడిట్ కార్డు బిల్లు సకాలంలో చెల్లించకపోవడం వల్ల మీ క్రెడిట్ స్కోర్​పై ప్రతికూల ప్రభావాన్ని చూపుతుంది. అందుకే ఆటోమెటిక్ పేమెంట్స్ లేదా క్రెడిట్ కార్డు చెల్లింపులు సకాలంలో జరిగాయని నిర్ధరించే రిమైండర్​ను సెట్ చేసుకోండి. అలాగే, క్రెడిట్ కార్డ్ బకాయిలకు కనీస చెల్లింపులు చేయకుండా ఉండడం మంచిది. లేదంటే మీ బకాయి ఉన్న బ్యాలెన్స్​పై వడ్డీ పడుతుంది.

క్రెడిట్ వినియోగం
క్రెడిట్ బ్యూరో సంస్థ‌లు ప‌రిగ‌ణ‌నలోకి తీసుకునే ముఖ్య‌మైన అంశాల్లో క్రెడిట్ యుటిలైజేష‌న్ లిమిట్ కూడా ఒక‌టి. క్రెడిట్ కార్డు కస్టమర్​​కు అనుమతించిన‌ ప‌రిమితిలో ఎంత మొత్తం వినియోగించారో ఇది తెలియ‌జేస్తుంది. అందుకే క్రెడిట్ యుటిలైజేష‌న్ లిమిట్​ను 30 శాతానికి మించనివ్వొద్దు. ఇది మంచి క్రెడిట్ స్కోరు మెయింటెన్ చేయడానికి కూడా ఉపయోగపడుతుంది. అలాగే మీ కార్డ్ స్టేట్‌మెంట్​లను క్రమం తప్పకుండా సమీక్షించండి. అప్పుడు మీ క్రెడిట్ కార్డుపై అనధికార ఛార్జీలు, బిల్లింగ్ ఎర్రర్స్, బోగస్ ఛార్జీలు ఏవైనా పడితే ఈజీగా గుర్తించగలరు.

కార్డు ట్రాన్స్ ఫర్
కొన్ని క్రెడిట్ కార్డులపై అధిక వడ్డీ పడుతుంది. అప్పుడు మరింత రుణభారాన్ని ఎదుర్కోవాల్సి వస్తుంది. అప్పుడు ఒక క్రెడిట్‌ కార్డు బ్యాలెన్స్​ను మరో కార్డుకు బదిలీ చేయొచ్చు. అప్పుడు ఒక కార్డుపై ఉన్న బకాయిలపై పడే అధిక వడ్డీ భారం నుంచి తప్పించుకోవచ్చు. అయితే తక్కువ వడ్డీ రేటుకు క్రెడిట్ కార్డుకు ట్రాన్స్ ఫర్ అవ్వాలని గుర్తుంచుకోండి.

బహుళ క్రెడిట్ కార్డులు
చాలా మంది తమ ఆర్థిక అవసరాల కోసం తక్కువ వ్యవధిలోనే అనేక క్రెడిట్ కార్డుల కోసం దరఖాస్తు చేసుకుంటారు. ఒకటి కన్నా ఎక్కువ క్రెడిట్ కార్డు బిల్లులు కట్టడం కోసం ఇబ్బందులు పడాల్సి రావచ్చు. ఈ క్రమంలో మీపై ఆర్థిక ఒత్తిడి పెరుగుతుంది. అలాగే భాద్యతారహితంగా ఖర్చులు చేసే అవకాశం ఉంది. కొత్త క్రెడిట్ కార్డ్ కోసం దరఖాస్తు చేయడానికి ముందు అది మీకు నిజంగా అవసరమా? కాదా? అని ఆలోచించండి.

క్యాష్ అడ్వాన్స్
మీ క్రెడిట్ కార్డుపై ముందస్తు నగదు లేదా నగదు ఉపసంహరణ ఆప్షన్​ను అనవసరంగా వాడొద్దు. ఇది అప్పటికే బాగానే ఉన్నప్పటికీ అధిక వడ్డీ రేటు పడుతుంది. గడువు తేదీలోగా బిల్లు చెల్లించని పక్షంలో మీ రుణ భారం మరింత పెరుగుతుంది.

హోమ్ లోన్ తీసుకోవాలనుకుంటున్నారా? బ్యాంకులు పరిగణనలోకి తీసుకునే అంశాలివే! - Home Loan Eligibility

మీరు క్రెడిట్ కార్డ్ యూజర్లా? CPPతో ఆన్​లైన్​ మోసాల నుంచి రక్షణ పొందండిలా! - Credit Card Protection Plans

ETV Bharat Logo

Copyright © 2025 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.