ETV Bharat / bharat

అయోధ్యకు సైకిల్ యాత్ర- 4రోజుల్లో 1100కి.మీ జర్నీ- రామయ్య దర్శనమే పెద్ద అవార్డ్! - Cycle Yatra To Ayodhya young men

Youth Cycle Yatra To Ayodhya : రాజస్థాన్​కు చెందిన ఇద్దరు యువకులు రామనగరికి సైకిల్ యాత్ర చేపట్టారు. దాదాపు 1100 కిలోమీటర్లు సైక్లింగ్ చేసి బాలరామయ్య దర్శనం చేసుకోనున్నారు. శనివారం ఉదయమే తమ స్వగ్రామం నుంచి బయలు దేరారు.

Youth Cycle Yatra To Ayodhya
Youth Cycle Yatra To Ayodhya
author img

By ETV Bharat Telugu Team

Published : Feb 17, 2024, 3:15 PM IST

Updated : Feb 18, 2024, 6:41 AM IST

అయోధ్యకు ఇద్దరు యువకుల సైకిల్ యాత్ర

Youth Cycle Yatra To Ayodhya : ఉత్తర్​ప్రదేశ్​లోని అయోధ్య బాలక్​రామ్​ను​ దర్శించుకునేందుకు దేశ విదేశాల నుంచి లక్షలాది మంది భక్తులు తరలివస్తున్నారు. వివిధ మార్గాల్లో అయోధ్యకు చేరుకుంటూ రామయ్యను దర్శించుకుంటున్నారు. అయితే రాజస్థాన్​లో ఉదయ్​పుర్​కు చెందిన ఇద్దరు యువకులు శ్రీరాముడి దర్శనం సైకిళ్లపై అయోధ్యకు బయలుదేరారు.

ఉదయ్​పుర్​కు చెందిన జితేంద్ర పటేల్, రిషబ్​ జైన్​ రామ్​లల్లాను దర్శించుకునేందుకు శనివారం బయలుదేరారు. ఉదయం 5:15 గంటలకు ఫతే పాఠశాలలో ఉన్న బాలాజీ ఆలయంలో దర్శనం చేసుకున్న తర్వాత, శ్రీరాముడిని స్తుతిస్తూ తమ ప్రయాణాన్ని మొదలుపెట్టారు. వీరిని ఉదయ్​పుర్ సైక్లింగ్ క్లబ్ సహా పలువురు స్థానికులు ప్రోత్సహించారు. జై శ్రీరామ్ అంటూ నినాదాలు చేశారు.

Youth Cycle Yatra To Ayodhya
జితేంద్ర పటేల్, రిషబ్ జైన్

రామయ్య దర్శనమే అతిపెద్ద అవార్డు!
ఈ సైకిల్ యాత్ర ఎలాంటి అవార్డు కోసం చేపట్టడం లేదని సైక్లిస్ట్ జితేంద్ర పటేల్ తెలిపారు. రామ్​లల్లా దర్శనమే తమకు అతిపెద్ద అవార్డు అని తెలిపారు. తమలో ఉన్న భక్తిభావమే అయోధ్యకు సైకిల్​పై వెళ్లేలా చేసిందని రిషబ్ జైన్ తెలిపారు. 500 ఏళ్ల నిరీక్షణ ముగిసిందని, భక్తుడిలా దర్శనం కోసమే అయోధ్యకు వెళుతున్నట్లు రిషబ్, జితేంద్ర చెప్పారు.

నాలుగు రోజులు- 1100 కి.మీ
ఉదయ్​పుర్​ నుంచి అయోధ్యకు 1100 కిలోమీటర్లు కాగా, నాలుగురోజుల్లో పూర్తి చేయాలని లక్ష్యం పెట్టుకున్నారు జితేంద్ర, రిషబ్. ఫిబ్రవరి 22వ తేదీన వీరిద్దరూ బాలక్​ రామ్​ దర్శించుకునే అవకాశం ఉంది. మొదటి రోజు ఉదయపుర్ నుంచి కోటా వరకు 300 కి.మీ, రెండో రోజు కోటా నుంచి శివపురికి 230 కి.మీ, శివపురి నుంచి కాన్పుర్ వరకు 327 కి.మీ, నాలుగో రోజు కాన్పుర్ నుంచి అయోధ్య వరకు 220 కి.మీ సైక్లింగ్ చేయనున్నారు.

దర్శన వేళల్లో మార్పు
అయితే అయోధ్య రామయ్య దర్శన వేళలకు సంబంధించి ఇటీవలే కీలక నిర్ణయం తీసుకుంది శ్రీరామ జన్మభూమి తీర్థ్​ క్షేత ట్రస్ట్. బాలరాముడి దర్శనానికి రోజూ గంట పాటు విరామం ఇవ్వనున్నట్లు ఆలయ ముఖ్య పూజారి ఆచార్య సత్యేంద్ర దాస్‌ వెల్లడించారు. బాల రాముడికి విశ్రాంతి ఇచ్చేలా శుక్రవారం నుంచి రోజూ మధ్యాహ్నం 12.30 గంటల నుంచి 1.30 గంట వరకు ఆలయ ద్వారాలు మూసివేసి ఉంచుతామని చెప్పారు.

అయోధ్య రామయ్య దర్శనానికి వెళ్తున్నారా? ఈ ఐదు విషయాలు తెలుసుకోవడం మస్ట్!

అయోధ్య రామయ్య ఒంటిపై ఉన్న బంగారం ఎంతో తెలుసా? వీటిని ఎవరు చేశారు?

Last Updated : Feb 18, 2024, 6:41 AM IST
ETV Bharat Logo

Copyright © 2025 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.