ETV Bharat / bharat

40ఏళ్ల లోపు సింగిల్సే ఆమె టార్గెట్- 12మందితో పెళ్లి- డబ్బు, నగలతో జంప్- చివరికి! - Women Married Many Men

author img

By ETV Bharat Telugu Team

Published : Jul 16, 2024, 10:05 AM IST

Updated : Jul 16, 2024, 11:36 AM IST

Women Married Many Men in Tamil Nadu : ఓ మహిళ ఒకరికి తెలికుండా మరొకరిని వివాహమాడింది. ఇలా 12మందిని పెళ్లి చేసుకుని ఆపై ఎవ్వరికీ చెప్పకుండా డబ్బు, నగలతో ఉడాయించింది. పెళ్లికాని 40ఏళ్ల వయసున్న పురుషులను మాత్రమే టార్గెట్​గా చేసుకుంది. మరో వ్యక్తిని కూడా ఇలా చేయడానికి ప్రయత్నం చేసింది. కానీ చివరికి దొరికిపోయింది ఆ నిత్య పెళ్లికూతురు.

Women Married Many Men
Women Married Many Men (ETV Bharat)

Women Married Many Men in Tamil Nadu : తమిళనాడుకు చెందిన ఓ మహిళ ఒకరికి తెలియకుండా మరొకరిని పెళ్లి చెసుకుని ఆపై నగలు, డబ్బులతో ఉడాయించింది. ఇలా ఇప్పటివరకు 12మందిని మోసం చేసింది. ఇటీవల మరో వ్యక్తిని కూడా మోసం చేసేందుకు ప్రయత్నించింది. కానీ అతడికి అనుమానం రావడం వల్ల పోలీసులకు సమాచారం ఇచ్చాడు. దీంతో ఆ నిత్య పెళ్లి కూతురి అసలు బండారం బయట పడింది. పరారైన ఆ మహిళను సెల్​ఫోన్ సిగ్నల్ ఆధారంగా పోలీసులు పట్టుకున్నారు.

అసలేం జరిగిదంటే!
తిరుప్పూర్‌ జిల్లా తారాపురానికి చెందిన మహేశ్​​ అరవింద్‌కు తల్లిదండ్రులు పెళ్లి సంబంధాలు కోసం వెతికారు. ఈ క్రమంలో గతేడాది మొదట్లో మ్యాట్రిమోని ద్వారా ఈరోడ్‌ జిల్లా కొడుముడికి చెందిన సత్య(30) అనే మహిళ మహేశ్​ అరవింద్‌కు పరిచయమైంది. ఆ తర్వాత అమ్మకు ఆరోగ్యం బాగోకపోవడం వల్ల ఇంట్లో పెళ్లి ఏర్పాట్లు చేస్తున్నారని, తనను వివాహం చేసుకోవాలని మహేశ్​​పై ఒత్తిడి చేసింది. దీంతో గతేడాది జూన్‌లో పళనిలోని ఓ ఆలయంలో సత్యను వివాహం చేసుకున్నాడు మహేశ్​. అతడి​ తల్లిదండ్రులు కూడా ఈ పెళ్లికి అంగీకరించారు. వారు సత్యకు కానుకగా 12 సవర్ల నగలు ఇచ్చారు.

ఆధార్​ కార్డుతో అసలు విషయం
పెళ్లి తర్వాత మూడు నెలలు అంతా హ్యాపీగానే గడిచింది. ఆ తర్వాత సత్య ప్రవర్తనలో స్వల్పంగా మార్పులు గమనించాడు మహేశ్​. ఆమెపై అనుమానం వచ్చి ఆధార్​ కార్డును చెక్​ చేశాడు. దానిపై భర్త పేరుగా చెన్నైకి చెందిన మరో వ్యక్తి పేరు ఉంది. వయసు కూడా ఎక్కువగానే ఉంది. ఈ విషయాలు తెలుసుకుని ఒక్కసారిగా షాక్​కు గురైన మహేశ్​, సత్యను నిలదీశాడు. దీంతో మహేశ్​తో గొడవ పెట్టుకుని అతడి కుటుంబ సభ్యులను బెదిరించింది సత్య. మోసపోయానని గ్రహించిన మహేశ్​, వెంటనే తారాపురం పోలీసు స్టేషన్​లో ఫిర్యాదు చేశాడు. తనపై పోలీసులకు ఫిర్యాదు చేశాడని తెలుసుకున్న సత్య, గత వారమే తారాపురం నుంచి పరారైంది. పోలీసులు ఆమె కోసం గాలింపు చర్యలు చేపట్టారు. సెల్​ఫోన్ సిగ్నల్ ఆధారంగా ఆదివారం పుదుచ్చేరిలో ఉన్న సత్యను అరెస్ట్‌ చేశారు.

వాళ్లే ఆమె టార్గెట్
సత్యకు 10ఏళ్ల క్రితమే చెన్నైకి చెందిన ఓ వ్యక్తితో వివాహమైందని, ఓ బిడ్డ కూడా ఉన్నట్లు పోలీసుల విచారణలో తేలింది. మధురైలో ముగ్గురు పోలీసులను, కొడుమూడిలో ఓ యువకుడిని ఇలా 12మందిని మోసం చేసి పెళ్లి చేసుకుందని పోలీసులు తెలిపారు. కేవలం పెళ్లికాని 40ఏళ్ల లోపు పురషులు మాత్రమే ఆమె టార్గెట్​ అని, కొన్ని నెలలు పాటు మంచిగా ఉండి, తర్వాత కావాలనే గొడవ పెట్టుకుని డబ్బు, నగలతో పరారవుతుందని పేర్కొన్నారు.

పిల్లలు తప్పిపోతే పేరెంట్స్​కు లైవ్ లొకేషన్- హోమ్​వర్క్ చేయకపోతే రిమైండర్- స్మార్ట్​బ్యాగ్​ విశేషాలివే - Students Smart Tracking Bag

రాజ్యసభలో తగ్గిన బీజేపీ బలం - బిల్లులు ఆమోదించుకోవాలంటే వారి మద్దతు కీలకం! - BJP Seats Dipped in Rajyasabha

Last Updated : Jul 16, 2024, 11:36 AM IST
ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.