Woman Try Delivery Acupuncture Treatment : తన భార్యకు ఇంట్లోనే నార్మల్ డెలివరీ అవ్వాలని పట్టుపట్టాడు ఓ భర్త. పురిటి నొప్పులు వచ్చినా ఆమెను ఆస్పత్రికి తీసుకెళ్లేందుకు ససేమిరా అన్నాడు. ఆఖరికి ఆస్పత్రికి తీసుకెళ్లేసరికి అప్పటికే తీవ్ర రక్తస్రావం కావడం వల్ల గర్బిణి సహా నవజాత శిశువు మరణించింది. ఈ ఘటన కేరళలోని తిరువనంతపురంలో మంగళవారం జరిగింది. దీంతో మృతురాలి భర్త నయాజ్పై నెమోమ్ పోలీసులు కేసు నమోదు చేసి, అరెస్ట్ చేశారు.
Husband Harassing Wife For Normal Delivery : తిరువనంతపురంలోని కరక్కమండపంలో షమీరా(36), సయాజ్ అనే దంపతులు అద్దె ఇంట్లో ఉంటున్నారు. కొన్నాళ్ల క్రితం షమీరా గర్భం దాల్చింది. అయితే ఆమె భర్త నయాజ్ వైద్యం కోసం షమీరాను ఆస్పత్రికి తీసుకెళ్లలేదు. ఇంట్లోనే ప్రసవించాలని ఆమెను ఒత్తిడి చేశాడు. షమీరాకు సరైన వైద్యం అందించేందుకు ఆస్పత్రికి తీసుకెళ్లమని ఆశా వర్కర్లు ఎన్నిసార్లు అడిగినా నయాజ్ అంగీకరించలేదు. ఆఖరికి పోలీసులు జోక్యం చేసుకున్నా అతడు మొండిగా వ్యవహరించాడు. ఈ క్రమంలో షమీరాకు మంగళవారం అకస్మాత్తుగా పురిటి నొప్పులు వచ్చాయి. దీంతో ఆమె అపస్మారకస్థితిలోకి వెళ్లిపోయింది. వెంటనే ఆమెను కిల్లిపాలెంలోని ఓ ప్రైవేట్ ఆస్పత్రికి తరలించగా, అప్పటికే షమీరా, ఆమె నవజాత శిశువు మృతి చెందారు. ఈ విషయాన్ని ఆస్పత్రి వైద్యులు ధ్రువీకరించారు.
మృతురాలు షమీరా స్వస్థలం పాలక్కాడ్. షమీరాను నయాజ్ రెండో పెళ్లి చేసుకున్నాడు. ఈ దంపతులకు ఇద్దరు పిల్లలు ఉన్నారు. వారికి గతంలో పోలియో చుక్కలు వేయడాన్ని నయాజ్ వ్యతిరేకించాడని ఆశా వర్కర్లు తెలిపారు. షమీరా మృతిపై తమకు అనుమానాలు ఉన్నాయని స్థానికులు అన్నారు. ఆమె మృతిపై సమగ్ర విచారణ చేపట్టాలని పోలీసులను డిమాండ్ చేశారు.
"షమీరాను చికిత్స కోసం ఆస్పత్రి పంపేందుకు ఆమె భర్త నయాజ్ నిరాకరించేవాడు. షమీరాను ఇరుగుపొరుగువారితో మాట్లాడేందుకు సైతం అనుమతించేవాడు కాదు. ఇంట్లో ఒంటరిగా ఉండమని బలవంతం చేసేవాడు. ఇరుగుపొరుగువారు చికిత్స కోసం షమీరాను ఆస్పత్రి తీసుకెళ్లమన్నా వారిపై ఆగ్రహం వ్యక్తం చేసేవాడు." అని స్థానికురాలు చెప్పింది.
ఒకే కాన్పులో నలుగురు పిల్లలకు జన్మ.. తల్లీపిల్లలు సేఫ్
Women Delivery On Road : ఆస్పత్రిలో చేర్చుకోని సిబ్బంది.. నడిరోడ్డుపై రిక్షాలోనే గర్భిణీ ప్రసవం