ETV Bharat / bharat

కర్ణాటక లోక్​సభ బరిలో 21మంది మహిళలు- జాతీయ పార్టీల తరఫున 8మంది పోటీ- నారీ శక్తి చూపుతారా? - Woman In Karnataka LS Polls 2024 - WOMAN IN KARNATAKA LS POLLS 2024

Woman Contesting In Karnataka LS Elections 2024 : కర్ణాటకలో జరిగే ప్రతి లోక్‌సభ ఎన్నికల్లోనూ కనీసం 500 మందికి పైగా అభ్యర్థులు బరిలో నిలుస్తారు. వీరిలో మహిళా అభ్యర్థుల శాతం 10లోపే ఉంటుంది. అయితే రాబోయే ఎన్నికల్లో పోటీ చేసేందుకు మొత్తం 21 మంది నారీమణులు సిద్ధమయ్యారు. రాజకీయాల్లో తమ అదృష్టాన్ని పరీక్షించుకోబోతున్నారు.

Woman Contesting In Karnataka LS Elections 2024

author img

By ETV Bharat Telugu Team

Published : Apr 13, 2024, 9:14 AM IST

Woman Contesting In Karnataka LS Elections 2024 : ఇప్పటివరకు జరిగిన ఎన్నికలతో పోలిస్తే ఈసారి జరగబోయే సార్వత్రిక ఎన్నికల్లో పోటీ చేసే మహిళల సంఖ్య పెరిగింది. ఇదిలాఉంటే ప్రతి లోక్‌సభ ఎన్నికల్లోనూ కన్నడనాట కనీసం 500 మందికి పైగా అభ్యర్థులు పోటీ పడుతుంటారు. వీరిలో మహిళా అభ్యర్థుల సంఖ్య 10 శాతం లోపే ఉంటుంది. వీరిలోనూ 99 శాతం మంది స్వతంత్య్ర అభ్యర్థులుంటారు. ప్రముఖ పార్టీలన్నీ కలిపి ఒక్కశాతం టికెట్లు కూడా మహిళలకు కేటాయించవు.

ఈ కారణంగా ఏటేటా కర్ణాటక నుంచి పార్లమెంటులో అడుగుపెట్టే మహిళా ఎంపీల సంఖ్య ఒకటి లేదంటే అదీ ఉండని పరిస్థితి. కానీ ఈసారి పార్లమెంటులో అడుగుపెట్టే మహిళల సంఖ్య కాస్త మెరుగుపడే అవకాశాలు కనిపిస్తున్నాయి. జాతీయ పార్టీలు గతంలో కంటే ఎక్కువ సంఖ్యలో మహిళలకు టికెట్లను కేటాయించాయి. కాగా, లోక్‌సభ ఎన్నికల చరిత్రలో జాతీయ పార్టీల నుంచి పోటీ చేస్తున్న మహిళల సంఖ్యలో ఇదే అత్యధికం.

కాంగ్రెస్‌ నుంచి ఆరుగురు
ఏడాది కిందటే అధికార పగ్గాలు చేపట్టిన కాంగ్రెస్‌ పార్టీ ఎన్నికల్లో ప్రకటించిన మేరకు ఐదు గ్యారంటీ పథకాలను అమలు చేసింది. ఈ ఐదింటిలో రెండు కేవలం మహిళల కోసం రూపొందించినవే. బస్సుల్లో ఉచితంగా ప్రయాణించే 'శక్తి', ప్రతి గృహిణికి రూ.2వేల ఆర్థిక సాయం అందించే 'గృహలక్ష్మి' ఈ రెండు పథకాలు ప్రస్తుతం రాష్ట్రంలో సజావుగానే అమలవుతున్నాయి. అయితే మహిళలను కేవలం లబ్ధిదారులుగానే చూడకుండా రాజకీయాల్లోనూ వారికి అవకాశాలు కల్పిస్తామని కాంగ్రెస్‌ పార్టీ ఏడాదిగా చెబుతూ వస్తోంది. ఇందులో భాగంగానే ఈ ఎన్నికల్లో ఆరుగురు మహిళలకు టికెట్లు ఇచ్చింది. అయితే రాజకీయ పార్టీల పరంగా లోక్‌సభ ఎన్నికల్లో ఇంత మంది మహిళలకు టికెట్లు ఇవ్వడం ఇదే తొలిసారి.

ఇక ఎన్నికల్లో పోటీ చేస్తున్న ఆరుగురిలో సంయుక్తా పాటిల్‌, ప్రియాంకా జార్ఖిహొళి, సౌమ్యా రెడ్డి మంత్రుల వారసులు. వీరంతా యువతరానికి ప్రతినిధులు. వీరిలో సంయుక్త పొరుగు నియోజకవర్గంలో పోటీ చేయడంవల్ల స్థానిక నేతల నుంచి కొంత వ్యతిరేకతను ఎదుర్కొంటున్నారు. శివమొగ్గ నుంచి పోటీ పడుతున్న గీతా శివరాజ్‌ కుమార్‌ మాజీ ముఖ్యమంత్రి ఎస్‌.బంగారప్ప కుమార్తె, కన్నడ నటుడు శివరాజ్‌ కుమార్‌ సతీమణి. దావణగెరె నుంచి పోటీ చేస్తున్న ప్రభా మల్లికార్జున్‌ రాష్ట్రంలో అతి పెద్ద వయసున్న ఎమ్మెల్యే శ్యామనూరు శివశంకరప్ప కోడలు. ఆమె భర్త మల్లికార్జున్‌ ప్రస్తుతం మంత్రిగా పని చేస్తున్నారు. ఉత్తర కన్నడ నుంచి పోటీ చేస్తున్న అంజలి నింబాళ్కర్‌ ఐఏఎస్‌ అధికారి హేమంత్‌ నింబాళ్కర్‌ భార్య. ఆమె గతంలో ఎమ్మెల్యేగా పని చేశారు. మొత్తం ఆరుగురు అభ్యర్థుల్లో ఐదుగురు తొలిసారిగా లోక్‌సభకు పోటీ చేస్తున్నారు. గతంలో ఇదే పార్టీ అత్యధికంగా ముగ్గురికి టికెట్‌ ఇచ్చింది. 2019 ఎన్నికల్లో కేవలం ఓ మహిళకు మాత్రమే టికెట్‌ ఇచ్చింది.

బీజేపీ నుంచి ఇద్దరే
కాంగ్రెస్‌తో పోలిస్తే బీజేపీ నుంచి తక్కువ మంది మహిళలు పోటీ చేస్తున్నారు. 2019 ఎన్నికల్లో ఒకరికే టికెట్‌ ఇచ్చిన కమలం పార్టీ ఈసారి ఇద్దరికి అవకాశం ఇచ్చింది. గత ఎన్నికల్లో పోటీ చేసి గెలిచిన కేంద్ర మంత్రి శోభా కరంద్లాజె ప్రస్తుతం బెంగళూరు ఉత్తర నుంచి పోటీ చేస్తున్నారు. ఆమె ప్రస్తుతం ఎంపీగా ఉన్న ఉడుపి-చిక్కమగళూరు నుంచి బీజేపీ కార్యకర్తలు, నేతల నుంచే వ్యతిరేకత ఎదుర్కోవడం వల్ల అధిష్ఠానం ఆమె నియోజకవర్గాన్ని మార్చింది. ఆమె వరుసగా మూడోసారి లోక్‌సభ ఎన్నికల్లో పోటీ చేస్తున్నారు. మాజీ ముఖ్యమంత్రి బి.ఎస్‌.యడియూరప్పకు ఆప్తుల్లో ఒకరిగా పేరున్న శోభా కరంద్లాజెకు టికెట్‌ ఇవ్వడంపై పలువురు సీనియర్లు విమర్శలకు దిగడం గమనార్హం.

దావణగెరె నుంచి పోటీ చేస్తున్న గాయత్రి భర్త జీఎం.సిద్ధేశ్వర్‌ ప్రస్తుతం బెంగళూరు ఉత్తర నియోజకవర్గానికి ఎంపీ. ఆయనను తప్పించి భార్యకు టికెట్‌ ఇవ్వడంపైనా స్థానిక బీజేపీ నేతల నుంచి తీవ్ర వ్యతిరేకత వ్యక్తమవుతోంది. బీజేపీతో పొత్తు పెట్టుకున్న జేడీఎస్‌ పార్టీ కేవలం మూడు చోట్ల పోటీ చేస్తుండగా ఈ మూడింటిలో మహిళలకు అవకాశం ఇవ్వలేదు. 2019లో ఓ మహిళకు జేడీఎస్‌ టికెట్‌ ఇచ్చినా విజయం వరించలేదు.

  • బరిలో మొత్తం మహిళలు : 21 మంది
  • జాతీయ పార్టీల తరఫున : 8 మంది
  • స్వతంత్రులు : 13 మంది

కాంగ్రెస్‌ : ఆరుగురు

  • సంయుక్తా పాటిల్‌ (బాగల్‌కోటె)
  • గీతా శివరాజ్‌ కుమార్‌ (శివమొగ్గ)
  • అంజలి నింబాళ్కర్‌ (ఉత్తర కన్నడ)
  • ప్రభా మల్లికార్జున్‌ (దావణగెరె)
  • ప్రియాంకా జార్ఖిహొళి (చిక్కోడి)
  • సౌమ్యా రెడ్డి (బెంగళూరు దక్షిణ)

బీజేపీ అభ్యర్థులు వీరే

  • శోభా కరంద్లాజె (బెంగళూరు ఉత్తర)
  • గాయత్రి సిద్ధేశ్వర (దావణగెరె)

'బీజేపీ మళ్లీ గెలిస్తే రాజ్యాంగం మార్చేస్తారా?'- క్లారిటీ ఇచ్చిన మోదీ - pm modi on indi alliance

రూ.34కోట్ల భారీ ఫండ్ రైజింగ్​- సౌదీలో మరణశిక్ష ఖైదీ కోసం కేరళ ప్రజల దాతృత్వం - Fund Raising For Abdul Rahim

ETV Bharat Logo

Copyright © 2025 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.