Kolkata Lady Doctor Murder : కోల్‌కతాలోని ప్రభుత్వ ఆధ్వర్యంలో నడిచే వైద్యకళాశాలలో దారుణంగా హత్యకు గురైన జూనియర్ వైద్యురాలి ఉదంతంపై ఆ రాష్ట్ర సీఎం మమతా బెనర్జీ తీవ్రంగా స్పందించారు. అవసరమైతే హంతకుడికి ఉరి శిక్ష వేయించడానికి కూడా తమ ప్రభుత్వం వెనుకాడదన్నారు. దీన్ని ఓ దురదృష్టకర ఘటనగా అభిమర్ణించిన ఆమె, బాధితురాలి కుటుంబ సభ్యులతో మాట్లాడి నిందితులపై తగిన చర్యలు తీసుకొంటామని హామీ ఇచ్చారు.
ఆందోళన చేస్తున్నవారికి రాష్ట్ర ప్రభుత్వంపై నమ్మకం లేకపోతే కచ్చితంగా ఇతర లాఎన్‌ఫోర్స్‌మెంట్ ఏజెన్సీని ఆశ్రయించొచ్చని మమత పేర్కొన్నారు. తమకు ఎటువంటి ఇబ్బంది లేదని తెలిపారు. ఏ రకంగా అయినా సరే హంతకుడికి కఠిన శిక్షపడాలన్నారు. నిరసన తెలుపుతున్న డాక్టర్లు పేషంట్లకు చికిత్సను అందించాలని విజ్ఞప్తి చేశారు. ఈ కేసు విచారణను ఫాస్ట్ ట్రాక్ కోర్టులో నిర్వహించాలని అధికారులకు సూచించారు.
మరోవైపు ఈ కేసు విచారణను వేగవంతం చేసిన పోలీసులు సీసీటీవీ దృశ్యాల ఆధారంగా ఇప్పటికే ఒక వ్యక్తిని అరెస్టు చేశారు. ఆస్పత్రితో సంబంధం లేని ఆ వక్తి, ఆస్పత్రిలోని అన్ని విభాగాల్లో స్వేచ్ఛగా తిరిగినట్లు పోలీసులు గుర్తించారు. అతడి ప్రవర్తన అనుమానం వ్యక్తం చేసిన పోలీసులు నేరంలో అతడు ప్రత్యక్షంగా పాల్గొన్నట్లు అనుమానానిస్తున్నారు. జూనియర్ వైద్యురాలు ఆస్పత్రిలోనే దారుణ హత్యకు గురైన ఘటనకు నిరసనగా నర్సులు, తోటి విద్యార్థులు ర్యాలీ నిర్వహించారు. బాధ్యులను కఠినంగా శిక్షించాలని డిమాండ్ చేశారు. ఈ నిరసనకు కోల్‌కతాలోని కాంగ్రెస్ నాయకులు మద్దతు ప్రకటించారు. వైద్యురాలి మృతిపై విచారణకు కమిటీ వేయాలని డిమాండ్ చేశారు.
పోస్ట్ గ్రాడ్యుయేషన్ ద్వితీయ సంవత్సరం చదువుతున్న ఆ జూనియర్ వైద్యురాలు స్థానిక ప్రభుత్వాసుపత్రిలో గురువారం రాత్రి విధుల్లో ఉన్నారు. శుక్రవారం ఉదయం ఆసుపత్రి సెమినార్ హాలులో అర్ధనగ్న స్థితిలో శవమై కనిపించారు. ఆమెపై లైంగిక దాడి జరిగినట్లు ప్రాథమిక శవపరీక్షలో నిర్ధారణ అయింది. ఆమె మర్మాంగాలు, నోరు, కళ్ల నుంచి రక్తస్రావం జరిగినట్లు శవపరీక్షలో తేలింది. శరీరంపై వివిధ చోట్ల గాయాలు కనిపించినట్లు వైద్యులు తెలిపారు. శుక్రవారం తెల్లవారుజామున 3 నుంచి 6 గంటల మధ్య ఆమె హత్యకు గురై ఉండొచ్చని పోలీసులు తెలిపారు.
సీబీఐ విచారణకు డిమాండ్ చేసిన బీజేపీ : అయితే, ఈ ఘటనపై సీబీఐ దర్యాప్తు చేపట్టాలని ప్రతిపక్ష బీజేపీ డిమాండ్ చేసింది. వైద్యురాలిపై హత్యాచారం జరిగిందని పార్టీ ప్రతినిధి అగ్నిమిత్ర పౌల్ ఆరోపించారు. సీబీఐ దర్యాప్తునకు డిమాండ్ చేస్తున్నట్లు తెలిపారు.
వయనాడ్‌లో ప్రధాని మోదీ ఏరియల్ సర్వే - Modi Wayanad Visit
ఎస్సీ, ఎస్టీ రిజర్వేషన్లకు 'క్రీమీలేయర్' వర్తింపజేయం - కేంద్రం - SC ST Creamy Layer