Who Is Haryana Next CM : హరియాణాలో పదేళ్ల భారతీయ జనతా పార్టీ(బీజేపీ) పాలనకు తెరపడనుందని, కాంగ్రెస్ విజయం తథ్యమని మెజార్టీ ఎగ్జిట్ పోల్స్ అంచనా వేశాయి. మొత్తం 90 అసెంబ్లీ స్థానాలకు గానూ 55కి పైగా సీట్లు కాంగ్రెస్ గెలుస్తుందని అభిప్రాయపడ్డాయి. ఈ నేపథ్యంలో ఆ పార్టీ అధికారంలోకి వస్తే ముఖ్యమంత్రి పదవీ బాధ్యతలు ఎవరు చేపడతారన్న దానిపై సర్వత్రా చర్చ మొదలైంది. ప్రధానంగా పార్టీ సీనియర్ నేతలు కుమారి సెల్జా, రణ్‌దీప్ సూర్జేవాలాతో పాటు మాజీ ముఖ్యమంత్రి భూపేంద్ర హుడ్డా పేర్లు వినిపిస్తున్నాయి.
ఈ విషయంపై భూపేంద్ర హుడ్డా స్పందించారు. ముఖ్యమంత్రి ఎవర్న దానిపై పార్టీ హైకమాండే నిర్ణయం తీసుకుంటుందని చెప్పారు. 'అత్యధిక స్థానాల్లో కాంగ్రెస్ విజయం సాధిస్తుందని భావిస్తున్నాం. బీజేపీ పాలనలో రాష్ట్రంలో శాంతిభద్రతలు పూర్తిగా క్షీణించాయి. అవినీతి పెరిగిపోయింది. అందుకే ప్రజలు మార్పును కోరుకుంటున్నారు" అని భూపేంద్ర తెలిపారు. ఇక కుమారి సెల్జా సీఎం కావడంపై భూపేంద్రను ప్రశ్నించగా, సీఎం అవుతానని చెప్పుకునే ప్రతి నాయకుడికి ఉందన్నారు. ఇక కుమారి సెల్జీ పార్టీ సీనియర్ నాయకురాలు అన్న భూపేంద్ర సింగ్, అందుకే సీఎం పదవిపై ఆమెకు కూడా హక్కు ఉందన్నారు. అయితే అధిష్ఠానమే తుది నిర్ణయం తీసుకుంటుందని చెప్పారు.
పార్టీలో కొందరు నేతలు కేబినెట్ కూర్పుపై చర్చిస్తున్నారన్న విలేకరులు ప్రశ్నించగా, అదంతా పార్టీ అధిష్ఠానం చూసుకుంటుందని సమాధానమిచ్చారు. కుమారి సెల్జాకు సీఎం బాధ్యతలు అప్పగించే అవకాశముందా? అని అడగ్గా "మనది ప్రజాస్వామ్యం. సీఎం పదవి కోసం ఎవరైనా ఆసక్తి చూపవచ్చు. ఇక కుమారి సెల్జీ పార్టీ సీనియర్ నాయకురాలు అన్న భూపేంద్ర సింగ్, అందుకే సీఎం పదవిపై ఆమెకు కూడా హక్కు ఉందన్నారు. అయితే అధిష్ఠానమే తుది నిర్ణయం తీసుకుంటుంది" అని భూపేంద్ర చెప్పారు.
హరియాణాలో 90 అసెంబ్లీ నియోజకవర్గాలకు శనివారం (అక్టోబర్ 5న) పోలింగ్ జరిగింది. అక్టోబర్ 8న ఫలితాలు వెలువడనున్నాయి. కానీ ఇక్కడ మాత్రం ఇప్పుడు సీఎం సీటుపై చర్చ మొదలైంది. చాలా ఎగ్జిట్ పోల్స్ కాంగ్రెస్‌కు 50 నుంచి 60 సీట్లు వస్తాయని అంచనా వేశాయి. బీజేపీకి 20 నుంచి 30 సీట్లు వచ్చే అవకాశం ఉందని చెప్పాయి.