ETV Bharat / bharat

రాముడు వచ్చేశాడు! తర్వాతేంటి? అందరికీ దర్శనం ఎప్పుడు? ఏ సమయంలో వెళ్లొచ్చు? - అయోధ్య ప్రసాదం

What Next After Ram Mandir Pran Pratishta : 'అయోధ్యలో రాముడి ప్రాణప్రతిష్ఠ పూర్తైంది. ఇప్పుడు నేను దర్శనానికి వెళ్లొచ్చా?', 'అయోధ్యకు వచ్చే భక్తులకు ప్రసాదంగా ఏమిస్తారు?', 'హారతి కార్యక్రమాలకు హాజరుకావడం ఎలా?', 'అయోధ్యను ఎలా చేరుకోవాలి?' వంటి అనుమానాలు ఉన్నాయా? అయితే, అవన్నీ నివృత్తి చేసే సమాధానాలు మీకోసమే!

what-next-after-ram-mandir-pran-pratishta

author img

By ETV Bharat Telugu Team

Published : Jan 22, 2024, 5:04 PM IST

Updated : Jan 22, 2024, 7:18 PM IST

What Next After Ram Mandir Pran Pratishta : దశాబ్దాల కల నెరవేరింది. అయోధ్యలో శ్రీరాముడికి అంగరంగ వైభవంగా ప్రాణప్రతిష్ట జరిగింది. దేశంలోని ప్రముఖులంతా ఈ వేడుకకు విచ్చేసి బాలరాముడిని కనులారా వీక్షించారు. మరి తర్వాత ఏం జరగనుంది? అయోధ్య రాముడి దర్శనానికి సాధారణ ప్రజలు ఎప్పటి నుంచి వెళ్లొచ్చు? బాలరాముడికి పూజలు చేసేది ఎవరు? ప్రసాదం ఏమిస్తారు? వంటి ప్రశ్నలకు సమాధానాలు మీకోసం.

what-next-after-ram-mandir-pran-pratishta
అయోధ్యలో కొలువైన బాలరాముడి విగ్రహం

అయోధ్యకు ఎప్పటి నుంచి వెళ్లొచ్చు?
ప్రాణప్రతిష్ఠ జరిగిన తర్వాతి రోజు నుంచే అంటే జనవరి 23 (మంగళవారం) నుంచే అయోధ్య రామ మందిరం సాధారణ భక్తులను అనుమతించనున్నారు. ఉదయం 8 నుంచి ఒంటిగంట మధ్య, మధ్యాహ్నం 3 నుంచి రాత్రి 10 గంటల మధ్య రాముడిని దర్శనం చేసుకోవచ్చు. ఉదయం 4.30కి జాగరణ్/శృంగార హారతి, రాత్రి 7 గంటలకు సంధ్యా హారతి ఉంటుంది.

  • #WATCH | "The darshan of Ram Lalla will begin tomorrow...," says Shri Ram Janmabhoomi Teerth Kshetra Chief Priest, Acharya Satyendra Das after 'Pran Pratishtha'. pic.twitter.com/EEgMOZ8x3H

    — ANI (@ANI) January 22, 2024 " class="align-text-top noRightClick twitterSection" data=" ">

హారతి సమయంలోనూ దర్శనానికి వెళ్లొచ్చా?
హారతికి హాజరుకావాలనుకునే భక్తులకు ఉచితంగా పాసులు అందిస్తున్నారు. ఆఫ్​లైన్, ఆన్​లైన్ మాధ్యమాల ద్వారా పాసులు జారీ చేస్తున్నారు. ప్రభుత్వ గుర్తింపు కార్డు చూపించి పాసులు తీసుకోవచ్చు.

విగ్రహానికి ప్రధాని నరేంద్ర మోదీ తొలిహారతి

పూజలు ఎవరు చేస్తారు?
ప్రధాన పూజారి ఆచార్య సత్యేంద్ర దాస్ ఆధ్వర్యంలో పూజలు జరుగుతాయి. ఇప్పటికే ప్రత్యేక నియామకం ద్వారా 29 మంది పూజారులను ఎంపిక చేశారు. పూజారుల ఎంపిక కోసం కఠినమైన ప్రక్రియ అనుసరించారు. దేశవ్యాప్తంగా వివిధ ప్రాంతాల నుంచి వచ్చిన 3వేల దరఖాస్తులను పరిశీలించి 200 మందిని తొలుత ఎంపిక చేశారు. వారికి 6 నెలలు కఠినమైన శిక్షణ ఇచ్చి, పరీక్షించి 29 మందిని సెలెక్ట్ చేశారు.

ప్రసాదంగా ఏమిస్తారు?
ప్రాణప్రతిష్ఠ నేపథ్యంలో వివిధ ప్రాంతాల నుంచి భారీగా లడ్డూ ప్రసాదాలు అయోధ్యకు వచ్చాయి. ఆలయాల నుంచి విరాళాలుగా వేల లడ్డూలు వచ్చాయి. వీటిని ఆహ్వానితులకు, భక్తులకు పంపిణీ చేసే అవకాశం ఉంది. ప్రాణప్రతిష్ఠకు వచ్చిన అతిథులకు దేశీయ నెయ్యితో వండిన ఆహారాన్ని మహాప్రసాదంగా వడ్డించారు. గెస్టులకు ఒక బాక్సులో 7 రకాల ప్రసాదాలు పెట్టి అందజేయనున్నట్లు కమిటీ వెల్లడించింది. నేతితో చేసిన రెండు లడ్డూలు, బెల్లం రేవ్‌డీ, రామదాన చిక్కీ, అక్షతలు, కుంకుమ, తులసీదళం, యాలకులతో పాటు రాముడి దీపం ప్రమిద బాక్సులో ఉంటాయి. వాటిని ఓ ప్రత్యేక సంచిలో పెట్టి ప్రముఖులకు అందజేయనున్నారు.

రామ మందిరంపై హెలికాప్టర్​తో పూలవర్షం

అయితే, అయోధ్యలో రోజూ 'ఇలాచీ దానా'ను ప్రసాదంగా ఇవ్వనున్నారు. పంచదార, యాలకులతో ఈ ప్రసాదాన్ని తయారు చేస్తారు. ఇలాచీ దానాను ఇప్పటికే దేశంలోని పలు ఆలయాల్లో భక్తులకు అందిస్తున్నారు. ఈ ప్రసాదం తయారీ బాధ్యతను రామ్​విలాస్ అండ్ సన్స్​ అనే దుకాణానికి అప్పగించింది అయోధ్య ట్రస్ట్​.

అయోధ్యకు ఎప్పుడైనా వెళ్లొచ్చా?
ప్రాణప్రతిష్ఠ కార్యక్రమం పూర్తైన నేపథ్యంలో అయోధ్యను ఎప్పుడైనా సందర్శించవచ్చు. అయితే, అయోధ్యకు వెళ్లేందుకు ఇప్పటికే అనేక మంది ముందస్తుగా బుకింగ్ చేసుకున్నారు. జనవరి, ఫిబ్రవరి, మార్చిలో అయోధ్యకు భారీగా భక్తులు వచ్చే అవకాశం ఉందని ట్రావెల్ ఏజెన్సీలు అంచనా వేస్తున్నాయి. కొత్తవారు మార్చి తర్వాతే రావాలని చెబుతున్నాయి.

ప్రాణప్రతిష్టకు హాజరైన అతిథులు

అయోధ్యకు ఎలా వెళ్లాలి?
అయోధ్యలో రామ మందిర నిర్మాణం నేపథ్యంలో మౌలిక సదుపాయాలు సైతం మెరుగుపర్చారు. విమానాశ్రయం సైతం ఇక్కడ అందుబాటులోకి వచ్చింది. రైలు మార్గం ద్వారా కూడా అయోధ్యను చేరుకోవచ్చు. దేశంలోని నలుమూలల నుంచి రైళ్లు అయోధ్య రైల్వే స్టేషన్​కు నడుస్తాయి. రోడ్డు మార్గం ద్వారా వెళ్లే వీలు కూడా ఉంది. అయోధ్యను చేరుకునేందుకు ఉన్న వివిధ మార్గాలు పూర్తిగా తెలుసుకోవాలంటే ఈ లింక్​పై క్లిక్ చేయండి.

ప్రాణప్రతిష్ఠ తర్వాత ఏంటి?
అయోధ్య మందిర నిర్మాణం ఇంకా పూర్తి కాలేదు. దీన్ని త్వరితగతిన పూర్తి చేసే పనులు కొనసాగనున్నాయి. ఆలయ నిర్మాణం పూర్తి చేసేందుకు అధికారులు చర్యలు తీసుకునే అవకాశం ఉంది. 2024 డిసెంబర్ నాటికి మందిరాన్ని పూర్తి చేసేందుకు ప్రయత్నిస్తున్నట్లు ఆలయ కమిటీ ఛైర్మన్ నృపేంద్ర మిశ్ర తెలిపారు. ప్రధాన ఆలయంతో పాటు అదే ప్రాంగణంలో మరో ఏడు మందిరాలను నిర్మించనున్నారు. ప్రాణప్రతిష్ఠ తర్వాత వీటి పనులు మొదలు కానున్నాయి.

  • #WATCH | On Pran Pratishtha ceremony, Ayodhya Ram Temple Construction Committee Chairman, Nripendra Mishra says, "Today is the day before Pran Pratistha and is very important for all of us. All the arrangements have to be seen...it has to be ensured in such a way that all the… pic.twitter.com/VF1hAM5v0Y

    — ANI (@ANI) January 21, 2024 " class="align-text-top noRightClick twitterSection" data=" ">

'జనవరి 22 నవయుగానికి ప్రతీక- రాముడిని క్షమించమని కోరుతున్నా'

రామ్​లల్లా ప్రాణప్రతిష్ఠకు ప్రముఖులు- ఎల్​కే అడ్వాణీ దూరం

Last Updated : Jan 22, 2024, 7:18 PM IST
ETV Bharat Logo

Copyright © 2025 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.