ETV Bharat / bharat

'గవర్నర్​ను వీధుల్లోనే కలుస్తా- ఆయన పక్కన కూర్చోవడం పాపమే' - west bengal governor issue - WEST BENGAL GOVERNOR ISSUE

West Bengal Governor Issue : రాజ్‌భవన్‌ ఉద్యోగినిపై లైంగిక వేధింపుల ఆరోపణల వ్యవహారంలో గవర్నర్‌ చూపించిన వీడియో ఎడిటెడ్‌ అని బంగాల్‌ సీఎం మమతా బెనర్జీ ఆరోపించారు. తన వద్ద ఫుల్‌ వీడియోల పెన్‌డ్రైవ్‌ ఉందన్నారు.

West Bengal Governor Issue
West Bengal Governor Issue (ANI)
author img

By ETV Bharat Telugu Team

Published : May 11, 2024, 9:18 PM IST

West Bengal Governor Issue : లైంగిక వేధింపుల ఆరోపణలు ఎదుర్కొంటున్న బంగాల్ గవర్నర్ C.V. ఆనందబోస్‌పై ఆ రాష్ట్ర ముఖ్యమంత్రి మమతా బెనర్జీ విమర్శల దాడిని పెంచారు. ఒకవేళ గవర్నర్‌ను కలవాల్సి వస్తే రాజ్‌భవన్‌కు వెళ్లబోనన్న దీదీ, వీధుల్లోనే ఆయన్ను కలుస్తానని చెప్పారు. గవర్నర్‌ పక్కన కూర్చోవడం కూడా పాపమే అవుతుందన్నారు. లైంగిక వేధింపుల ఆరోపణల నేపథ్యంలో రాజ్‌భవన్‌కు సంబంధించిన CCTV దృశ్యాలను గవర్నర్ ఆనందబోస్‌ మీడియా సమావేశంలో ప్రదర్శించడంపై మమత స్పందించారు. అవి ఎడిట్ చేసిన దృశ్యాలనీ, తన వద్ద పూర్తి వీడియో ఉన్న పెన్‌డ్రైవ్‌ ఉందన్నారు. గవర్నర్‌ ఇంకా తన పదవికి ఎందుకు రాజీనామా చేయలేదని ప్రశ్నించారు.

"ఎడిట్‌ చేసిన వీడియోను గవర్నర్‌ విడుదల చేశారు. నేను మొత్తం ఫుటేజీ చూశాను. అందులో దిగ్భ్రాంతి కలిగించే దృశ్యాలున్నాయి. దీంతో పాటు మరికొన్ని వీడియోల పెన్‌డ్రైవ్‌ నా దగ్గర ఉంది. ఆయన ప్రవర్తన చాలా అభ్యంతరకరంగా ఉంది. దీదీగిరిని సహించబోనని గవర్నర్ అంటున్నారు. కానీ ఆయన దాదాగిరీ ఇక పని చేయదు. మహిళలపై వేధింపులకు పాల్పడిన ఆయన పదవి నుంచి దిగిపోవాలి. ఇంతవరకు ఎందుకు రాజీనామా చేయలేదో కారణాలు చెప్పాలి. ఆయన గవర్నర్‌గా ఉన్నంతకాలం నేను రాజ్‌భవన్‌కు వెళ్లను."

--మమతా బెనర్జీ, ముఖ్యమంత్రి

మరోవైపు మమత వ్యాఖ్యలపై స్పందించిన గవర్నర్ C.V. ఆనంద బోస్, తనపై దీదీగిరి ఏమాత్రం పనిచేయదన్నారు. డర్టీ పాలిటిక్స్ మానుకోవాలని హితవు పలికారు. గత నెల 24న, ఈనెల 2న గవర్నర్‌ తనతో అభ్యంతరకరంగా ప్రవర్తించారని రాజ్‌భవన్‌లో పనిచేసే ఓ కాంట్రాక్టు మహిళా ఉద్యోగి పోలీసులకు ఫిర్యాదు చేసింది. ఉద్యోగం విషయమై తనను గవర్నర్‌ రెండుసార్లు పిలిపించారని, ఆ రెండు సందర్భాల్లోనూ వేధించారని ఆమె ఆరోపించారు. అయితే ఈ ఆరోపణలను ఆనందబోస్‌ కొట్టిపారేశారు. ఈ క్రమంలోనే అప్పటి సీసీటీవీ దృశ్యాలను గవర్నర్‌ సాధారణ పౌరులకు చూపించారు. అయితే, దీనిపై బాధితురాలు అభ్యంతరం తెలిపారు. తన ముఖాన్ని బ్లర్‌ చేయకుండా వాటిని బయటపెట్టారని ఆవేదన వ్యక్తం చేశారు. దీనిపై రాష్ట్రపతికి లేఖ రాయనున్నట్లు ఆమె చెప్పారు.

ETV Bharat Logo

Copyright © 2025 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.