Mamata Urges Junior Doctors : ఆర్జీ కర్ వైద్యురాలి హత్యాచార కేసులో న్యాయం చేయాలని, తమ డిమాండ్లు నెరవేర్చాలని జూనియర్ డాక్టర్లు చేస్తున్న నిరాహార దీక్షను విరమించుకోవాలని బంగాల్ సీఎం మమతా బెనర్జీ కోరారు. డిమాండ్లపై చర్చించేందుకు సోమవారం వారిని కలుస్తానని తెలిపారు. శనివారం మధ్యాహ్నం ఆమరణ నిరహార దీక్ష చేస్తున్న డాక్టర్లను చీఫ్ సెక్రటరీ మనోజ్ పంత్ కలిశారు. ఆ సమయంలో డాక్టర్లతో మమతా బెనర్జీ ఫోన్లో మాట్లాడారు. వైద్యులు తమ ముందుకు తెచ్చిన డిమాండ్లను ఇప్పటికే నెరవేర్చామని, మిగతా వాటి కోసం 3-4 నెలల సమయం ఇవ్వాలని మమత వైద్యులను కోరారు.
'రాష్ట్ర ఆరోగ్య శాఖ కార్యదర్శి నారాయణ్ స్వరూప్ నిగమ్‌ను తొలగించాలని, ఇతర సమస్యలను పరిష్కరించాలని డిమాండ్ చేస్తున్నారు. నేను ఆరోగ్య కార్యదర్శని ఎందుకు తొలగించలేదో మీకు తెలుసు. ఒక విభాగంలో అందరనీ ఒకేసారి తొలగించడం సాధ్యం కాదు. ఇప్పటికే డీహెచ్ఎస్, డీఎమ్ఈలను తొలగించాం. దయచేసి మళ్లీ విధుల్లో చేరండి. అసలు ఏ అధికారని తొలగించాలో లేదో మీరు ఎలా నిర్ణయించగలరు? మీ డిమాండ్లలో కొన్నింటికి విధానపరమైన నిర్ణయాలు అవసం. అందకు మేం పూర్తి స్థాయిలో సహకరిస్తాం. కామీ ఏమి చేయాలో మీరు ప్రభుత్వానికి నిర్దేశించడం ఆమోదయోగ్యం కాదు' అని మమతా బెనర్జీ అన్నారు.
VIDEO | West Bengal Chief Secretary Manoj Pant and Home Secretary Nandini Chakraborty visit protest site and interact with junior doctors observing fast-unto-death in Kolkata's RG Kar Hospital.
— Press Trust of India (@PTI_News) October 19, 2024
The fast-unto-death by agitating junior doctors entered the 15th day today over… pic.twitter.com/ZIzX3rqf5L
రాష్ట్రంలో ఆరోగ్య సేవలపై సమ్మె చూపుతున్న ప్రభావం గురించి జూనియర్ డాక్టర్లతో మమతా బెనర్జీ మాట్లాడారు. ' ప్రతి ఒక్కరికి నిరసన తెలిపే హక్కు ఉంది. కానీ అది వైద్యారోగ్య సేవలపై దాని ప్రభావం పడటకూడదు. ప్రజలు వైద్యం కోసం మీపై ఆధారపడి ఉన్నారు. ప్రభుత్వం ఆస్పత్రిలో వారికి ఉచిత వైద్యం చేస్తున్నారు. ఇప్పుడు పేద ప్రజలు ఎక్కడికి వెళ్తారు. మీ డిమాండ్లు న్యాయమైనవి. కానీ ప్రజలకు సేవ కూడా చేయాలి. అంతేకాకుండా మెడికల్ కాలేజీలో ఎన్నికలు నిర్వహించేందుకు మూడు నుంచి నాలుగు నెలల సమయం కావాలి' అని సీఎం మమతా జూనియర్ వైద్యులను కోరారు.
క్షీణిస్తున్న వైద్యుల ఆరోగ్యం
సోమవారం సాయంత్రం 5 గంటలకు తమతో చర్చించేదుకు నబన్నాకు ఆహ్వానించినట్లు నిరహార దీక్ష చేస్తున్న వైద్యులు అన్నారు. కేవలం తమ డిమాండ్లు నెరవేర్చమనే చెప్పాలనుకుంటున్నామని తెలిపారు. తమ డిమాండ్లను అర్థం చేసుకని వాటిని నెరవేరుస్తారని ఆశిస్తున్నట్లు పేర్కొన్నారు. మరోవైపు దీక్షలో పాల్గొన్న ఆరుగురు వైద్యుల ఆరోగ్యం క్షీణించండం వల్ల ఆస్పత్రికి తరలించారు .
RG Kar Medical College & Hospital rape-murder incident | At the site of their hunger strike in Kolkata, the protesting junior doctors say, " cs and hs met us and we had a telephonic conversation with the cm. she invited us to nabanna for a meeting on monday at 5 p.m. cm is… pic.twitter.com/gU0k3Zf5Or
— ANI (@ANI) October 19, 2024