ETV Bharat / bharat

ఆయుధాలు దిగుమతిలో భారత్‌ నెం.1- ప్రపంచంలో మన వాటా 9.8శాతం! - Weapons Imported By India

Weapons Imported By India : ప్రపంచంలో అత్యధికంగా ఆయుధాలు దిగుమతి చేసుకుంటున్న దేశాల్లో భారత్‌ మొదటి స్థానంలో కొనసాగుతోంది. 2019 నుంచి 2023 వరకు ప్రపంచ ఆయుధ దిగుమతుల్లో భారత్‌ వాటా 9.8 శాతం కావడం గమనార్హం. ఈ జాబితాలో సౌదీ అరేబియా రెండు, పాకిస్థాన్​ ఐదో స్థానంలో ఉంది. భారత్‌కు అతిపెద్ద ఆయుధ ఎగుమతిదారుగా రష్యా మొదటి స్థానంలో కొనసాగుతోంది.

Weapons Imported By India
Weapons Imported By India
author img

By ETV Bharat Telugu Team

Published : Mar 12, 2024, 2:07 PM IST

Updated : Mar 12, 2024, 2:17 PM IST

Weapons Imported By India : ప్రపంచంలో అత్యధికంగా ఆయుధాలు దిగుమతి చేసుకుంటున్న దేశాల్లో భారత్‌ మొదటి స్థానంలోనే కొనసాగుతోంది. స్టాక్‌ హోం ఇంటర్నేషనల్‌ పీస్‌ రీసెర్చ్‌ ఇన్‌సిట్యూట్‌ సిప్రి విడుదల చేసిన తాజాగా నివేదిక ప్రకారం 2014 నుంచి 2018తో పోలిస్తే 2019 నుంచి 2023 మధ్య కాలంలో భారత్‌ 4.7 శాతం ఆయుధాలను ఎక్కువగా దిగుమతి చేసుకుంది.

36 శాతం రష్యా నుంచే!
భారత్‌కు అతిపెద్ద ఆయుధ సరఫరాదారుగా రష్యా మొదటి స్థానంలో కొనసాగుతోంది. భారత్‌ ఆయుధ దిగుమతుల్లో 36 శాతం రష్యా నుంచే వస్తున్నాయి. అయితే గతంలో భారత ఆయుధ దిగుమతుల్లో రష్యా వాటా 50 శాతం కంటే ఎక్కువగా ఉండేది. ఇప్పుడు తగ్గడం గమనార్హం.

ఐదో స్థానంలో పాకిస్థాన్​!
మరోవైపు ఆయుధాలను దిగుమతి చేసుకుంటున్న దేశాల్లో పొరుగుదేశం పాకిస్థాన్ ఐదో స్థానంలో ఉంది. పాక్ మొత్తం ఆయుధ దిగుమతుల్లో 82 శాతం చైనా నుంచే వస్తున్నాయి. చైనాకు పొరుగుదేశాలైన జపాన్‌ ఆయుధ దిగుమతులను 155 శాతం, దక్షిణ కొరియా 6.5 శాతం పెంచుకున్నాయి. చైనా ఆయుధ దిగుమతులు 44 శాతం తగ్గడం గమనార్హం. చైనా ఆయుధ దిగుమతుల్లో ఎక్కువ భాగం రష్యా నుంచే వస్తున్నాయి.

అమెరికా వాటా 55 శాతం
2019-23 మధ్య ఐరోపా దేశాలు దిగుమతి చేసుకున్న ఆయుధాల్లో అమెరికా వాటా 55 శాతం కావడం గమనార్హం. ఇది గతంతో పోలిస్తే 35 శాతం పెరిగింది. 2019-23లో ప్రపంచ ఆయుధ సరఫరాలో 30 శాతం మిడిల్‌ ఈస్ట్‌ ప్రాంతానికే వెళ్లాయి. మిడిల్‌ఈస్ట్‌లో ఉన్న సౌదీ అరేబియా, ఖతార్‌, ఈజిప్టు 2019-23లో టాప్‌-10 ఆయుధ దిగుమతిదారుల్లో ఉన్నాయి.

ఎగుమతి చేస్తున్న దేశాల్లో అమెరికాదే అగ్రస్థానం
సౌదీ అరేబియా ప్రపంచంలోనే రెండో అతిపెద్ద ఆయుధ దిగుమతిదారు కావడం గమనార్హం. ఈ జాబితాలో ఖతార్‌ మూడోస్థానంలో ఉంది. ఆయుధాలు ఎగుమతి చేస్తున్న దేశాల్లో అమెరికాదే అగ్రస్థానం. ప్రపంచం ఆయుధ ఎగుమతుల్లో అమెరికా వాటా ఏకంగా 42 శాతం కావడం గమనార్హం. చెరో 11 శాతంతో ఫ్రాన్స్‌, రష్యా ఆ తర్వాతి స్థానాల్లో ఉన్నాయి. 5.8 శాతంతో చైనా నాలుగో స్థానంలో ఉంది.

ఆయుధాలు లేకుండానే ప్రత్యర్థితో పోరు​- జవాన్లకు 'మార్షల్​ ఆర్ట్స్​' ట్రైనింగ్! శిక్షణలో కీలక మార్పులు

దూసుకుపోయిన ట్యాంకులు.. గర్జించిన ఫిరంగులు.. ఔరా అనిపించిన సైన్యం విన్యాసాలు..

Last Updated : Mar 12, 2024, 2:17 PM IST
ETV Bharat Logo

Copyright © 2025 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.