Wayanad Landslides Death Toll : కేరళ వయనాడ్లో కొండచరియలు విరిగిపడిన ఘటనలో మృతుల సంఖ్య అంతకంతకూ పెరుగుతోంది. ఇప్పటి వరకు 174 మంది మరణించినట్లు రాష్ట్ర ఆరోగ్య శాఖ వెల్లడించింది. ఈ ప్రమాదంలో గాయపడిన సుమారు 128 మంది ఆసుపత్రుల్లో చికిత్స పొందుతున్నట్లు ఆరోగ్య శాఖ మంత్రి వీణాజార్జ్ తెలిపారు. ఇప్పటి వరకు 116 మంది మృతదేహాలకు శవ పరీక్షలు నిర్వహించినట్లు పేర్కొన్నారు. మరోవైపు, వయనాడ్‌కు వెళ్తుండగా వీణా జార్జ్ వాహనం ప్రమాదానికి గురైంది. దీంతో ఆమె స్వల్పంగా గాయపడ్డారు. మంజేరి మెడికల్ కళాశాలలో చికిత్స పొందారు.
#WATCH | Kerala: Rescue operation underway by Indian Air Force helicopters in the Chooralmala area of Wayanad where a landslide occurred earlier today claiming the lives of over 93 people. pic.twitter.com/FbaJRQd1eo
— ANI (@ANI) July 30, 2024
బుధవారం ఉదయం ఆర్మీ, ఎన్డీఆర్ఎఫ్ ఆధ్వర్యంలో సహాయక చర్యలు ప్రారంభించారు. ప్రస్తుతం 150 మంది ఘటనాస్థలంలో సహాయక చర్యలు చేపట్టారు. తాత్కాలిక వంతెనను కూడా నిర్మించారు. మరిన్ని బలగాలను రంగంలోకి దించనున్నట్లు సమాచారం. వయనాడ్లో మొత్తం 45 సహాయక శిబిరాలను ఏర్పాటు చేశారు. వాటిల్లో దాదాపు 3,069 మంది వరకు ఉన్నట్లు అధికారులు తెలిపారు. ఇప్పటికే వరదలతో అతలాకుతలమవుతున్న కేరళకు భారీ వర్షసూచన ఉన్నట్లు వాతావరణ శాఖ హెచ్చరించింది. కొండచరియలు విరిగిపడిన ఘటనతో ఉక్కిరిబిక్కిరైన వయనాడ్‌కు భారీ వర్షాలు కురిసే అవకాశాలు ఎక్కువగా ఉన్నట్లు వెల్లడించింది.
'ప్రజలంతా సహకరించాలి'
వయనాడ్ జిల్లాలో జరిగిన విధ్వంసం నుంచి కోలుకోవడానికి ప్రజలంతా సహకరించాలని కేరళ సీఎం పినరయి విజయన్ ప్రజలకు పిలుపునిచ్చారు. మళ్లీ పునర్నిర్మించుకోవడానికి సాయమందించాలని కోరారు. 2018 వరదల సమయంలో ప్రజలు అందించిన సహకారం మరువలేనిదని, అదే తరహా సాయం మళ్లీ కావాలని అన్నారు. ప్రతి ఒక్కరూ ముఖ్యమంత్రి సహాయ నిధికి విరాళాలు పంపించాలని సూచించారు. శిథిలాల కింద చిక్కుకున్న వారి కోసం సహాయక బృందాలు గాలిస్తున్నాయని చెప్పారు. వారి కోసం సమీపంలోని చర్చిలు, మదర్సాల్లో తాత్కాలిక ఆసుపత్రులను ఏర్పాటు చేశామని వెల్లడించారు.
#WATCH | Kerala: Relief and rescue operation underway in Wayanad's Chooralmala after a landslide broke out yesterday early morning claiming the lives of 143 people
— ANI (@ANI) July 31, 2024
(latest visuals) pic.twitter.com/Cin8rzwAzJ
ఇదీ జరిగింది
కేరళలోని వయనాడ్ జిల్లా మెప్పడి, మండక్కై, చూరాల్‌మల, అట్టామల, నూల్‌పుజా గ్రామాల్లో సోమవారం అర్ధరాత్రి 2 గంటల సమయంలో ఒక్కసారిగా కొండ చరియలు విరిగిపడ్డాయి. దీంతో కొండ ప్రాంతం విధ్వంసమై, ఇళ్లన్నీ నేలమట్టమయ్యాయి. బురద మట్టిలో కూరుకుపోయారు. తొలుత మండక్కై ప్రాంతంలో కొండచరియలు విరిగిపడగా, సహాయక సిబ్బంది వెంటనే అక్కడకు వెళ్లి సహాయక చర్యలు చేపట్టారు. కొంత మంది బాధితులను సమీపంలోని చూరాల్‌మలలోని వెల్లారిమల పాఠశాలవద్ద ఏర్పాటు చేసిన సహాయక శిబిరానికి పంపించారు. మంగళవారం తెల్లవారుజామున 4.10 గంటలకు ఈ పాఠశాల సమీపంలో మరోసారి కొండచరియలు విరిగిపడ్డాయి. దీంతో శిబిరంసహా చుట్టుపక్కల ఇళ్లు, దుకాణాలు బురదలో కూరుకుపోయాయి. అనేక వాహనాలు అందులో ఇరుక్కుపోయాయి. మండక్కైలో మంగళవారం మధ్యాహ్నం మరోసారి కొండచరియలు విరిగిపడ్డాయి.
#WATCH | Kerala: Rescue and search operation underway in Wayanad's Chooralmala after a landslide broke out yesterday early morning claiming the lives of 143 people
— ANI (@ANI) July 31, 2024
(latest visuals) pic.twitter.com/aqAG9uZMEP
వయనాడ్ విలయానికి 'అరేబియా' వేడెక్కడమే కారణమా? కేరళలో ఎప్పటికప్పుడు విషాదాలే! - Wayanad landslides