Wayanad Landslides Death Toll : కేరళలో భారీ వర్షాలకు కొండచరియలు విరిగిపడిన ఘటనలో మృతి చెందినవారి సంఖ్య 294కు చేరింది. మండక్కై, చూరాల్‌మల, అత్తమాల, నూల్పుజ ప్రాంతాల్లో సహాయక చర్యలు ముమ్మరంగా కొనసాగున్నాయి. సైన్యం, నేవీ, NDRF, ఇతర సహాయ బృందాలు రెస్క్యూ ఆపరేషన్‌లో నిమగ్నమయ్యాయి. ఇప్పటివరకు వందలాది మందిని కాపాడి సురక్షిత శిబిరాలకు తరలించారు. వర్షాల కారణంగా ప్రతికూల వాతావరణ పరిస్థితులు ఉన్నప్పటికీ వరసగా మూడో రోజు సహాయక చర్యలు కొనసాగుతున్నాయి. బురదలో కూరుకుపోయిన బాధితులను గుర్తించేందుకు ఆర్మీ జాగిలాలతో అన్వేషిస్తున్నారు. కొండచరియలు విరిగిపడిన ఘటనలో 200మందికి పైగా మృతిచెందారని NDRF డీఐజీ మొహసేన్ షాహిదీ తెలిపారు. 234మంది గాయపడి వివిధ ఆస్పత్రుల్లో చికిత్స పొందుతున్నారని చెప్పారు. దాదాపు 200 మంది ఆచూకీ తెలియాల్సి ఉందన్నారు.
#WATCH | Search and rescue operations continue in landslide-affected areas in Kerala's Wayanad; Bailey Bridge is being constructed to facilitate quick evacuation of those stranded in the area. pic.twitter.com/yWqESJ4ixP
— ANI (@ANI) August 1, 2024
కొండచరియలు విరిగిపడిన ఘటనలో సురక్షితంగా బయటపడ్డ కొందరు ప్రజలు ఆ భయానక అనుభవాన్ని పంచుకున్నారు. సోమవారం అర్థరాత్రి ఒకటిన్నర గంటల సమయంలో పెద్ద శబ్దం వినిపించిందని బాధితులు తెలిపారు. కిటికీలోంచి చూడగా పెద్ద ఎత్తున నీరు తమ ఇళ్ల వైపు రావడం కనిపించిందని చెప్పారు. ప్రాణాలు కాపాడుకునేందుకు డాబాలపైకి వెళ్లామనీ అక్కడి నుంచి వేరే ప్రాంతానికి వెళ్లేందుకు గానీ మరొకరిని కాపాడేందుకు గానీ వీలు లేకుండా పోయిందని వివరించారు. సెల్‌ఫోన్లను వదిలి ఇళ్లపై కప్పుల పైకి వెళ్లడం వల్ల ఎవరికీ సమాచారం ఇవ్వలేకపోయామని చెప్పారు.
#WATCH | Kerala | NDRF personnel are engaged in a rescue operation in Wayanad which was struck by landslides triggered by heavy rains
— ANI (@ANI) August 1, 2024
The death toll stands at 167.
(Source: NDRF) pic.twitter.com/5ZXq5BUtoT
కొండచరియలు విరిగిపడిన చూరల్‌మలలో లోక్‌సభలో ప్రతిపక్ష నేత రాహుల్‌గాంధీ, కాంగ్రెస్ ప్రధాన కార్యదర్శి ప్రియాంకాగాంధీ పర్యటించారు. సహాయక చర్యలు జరుగుతున్న తీరును అధికారులను అడిగి తెలుసుకున్నారు. అనంతరం సమీపంలోని సహాయక శిబిరాలు, ఆసుపత్రుల్లో చికిత్స పొందుతున్న బాధితులను పరామర్శించారు.
#WATCH | Kerala: Leader of Opposition in Lok Sabha and former Wayanad MP Rahul Gandhi along with party leader Priyanka Gandhi Vadra at the landslide site in Chooralmala, Wayanad.
— ANI (@ANI) August 1, 2024
A landslide occurred here on 30th July claiming the lives of 167 people. pic.twitter.com/MG6VaUZUIW
కుటుంబ సభ్యులను, ఇళ్లను కోల్పోయిన బాధితుల్ని చూస్తుంటే తనకు ఎంతో బాధ కలుగుతోందని అన్నారు రాహుల్ గాంధీ. బాధితులకు సముచిత సాయం అందేలా చూస్తామని భరోసా ఇచ్చారు. ఈ ఘటనను జాతీయ విపత్తుగా అభివర్ణించారు రాహుల్. "నా దృష్టిలో ఇది జాతీయ విపత్తు. ప్రభుత్వం ఏం చెబుతుందో చూద్దాం." అని వ్యాఖ్యానించారు.
#WATCH | Kerala | On Wayanad landslides, Congress MP & LoP Lok Sabha Rahul Gandhi says, " to me, this is a national disaster for sure. let us see what the government says." pic.twitter.com/OYhzMAVIxY
— ANI (@ANI) August 1, 2024
కేరళ ముఖ్యమంత్రి పినరయి విజయన్ రెస్క్యూ ఆపరేషన్‌పై అధికారులతో ఎప్పటికప్పుడు సమీక్షిస్తున్నారు. సహాయక చర్యల్లో పాల్గొన్న సిబ్బంది సేవల్ని ఆయన కొనియాడారు. మరికొన్ని రోజులు రెస్క్యూ ఆపరేషన్ కొనసాగనున్నట్టు విజయన్ తెలిపారు. సమన్వయంతో పని చేసేందుకు నలుగురు మంత్రులతో కూడిన మంత్రివర్గ ఉపసంఘాన్ని నియమించినట్టు చెప్పారు.
కేరళ విషాదంలో 287 మృత్యువాత - వయనాడ్‌లో పర్యటించనున్న రాహుల్, ప్రియాంక గాంధి - Wayanad Landslide
వయనాడ్‌కు ప్రముఖుల ఆపన్నహస్తం- ఒక్కొక్కరు రూ.5కోట్లు ఇచ్చిన బిజినెస్మెన్