Cleaning Tips For Washing Machine : నేటి ఆధునిక కాలంలో దాదాపు అందరి ఇళ్లల్లో బట్టలు ఉతకడానికి వాషింగ్ మెషిన్ కామన్ అయిపోయింది. అయితే, చాలా మంది దాని శుభ్రత విషయంలో మాత్రం నిర్లక్ష్యంగా వ్యవహరిస్తుంటారు. పైన చూడడానికి శుభ్రంగా కనిపిస్తుందని.. లోపల కూడా బాగానే ఉందనుకుంటారు. దాంతో.. వాషింగ్ మెషిన్ శుభ్రత గురించి పెద్దగా పట్టించుకోరు. ఫలితంగా.. మెషిన్ లోపల దుమ్ము, ధూళి, క్రీములు, బూజు పేరుకుపోయి త్వరగా చెడిపోయే అవకాశం ఉంటుందంటున్నారు నిపుణులు. అంతేకాదు.. శుభ్రంగా లేని వాషింగ్ మెషిన్(Washing Machine) యూజ్ చేస్తే బట్టల మురికి పోవడం అటుంచితే.. త్వరగా బట్టలు ఖరాబు అయ్యే ఛాన్స్ ఉందంటున్నారు. కాబట్టి, ఎప్పటికప్పుడు వాషింగ్ మెషిన్‌ను శుభ్రం చేసుకోవాలని నిపుణులు సూచిస్తున్నారు. అలాగే సులభంగా వాషింగ్ మెషిన్‌ను క్లీన్ చేసుకునే కొన్ని టిప్స్ కూడా సూచిస్తున్నారు. అవేంటో ఇప్పుడు చూద్దాం.
వైట్ వెనిగర్ : మీరు వాషింగ్ మెషిన్ యూజ్ చేస్తున్నట్లయితే.. వైట్ వెనిగర్ మెషిన్ క్లీనింగ్‌కి చాలా బాగా ఉపయోగపడుతుందని నిపుణులు సూచిస్తున్నారు. ఇందుకోసం ముందుగా వెనిగర్ తీసుకుని డిటర్జెంట్ డిస్పెన్సర్లో వేసుకోవాలి. ఆ తర్వాత వాషింగ్ మెషిన్ ఆన్ చేసి కొద్దిసేపు రన్ చేయాలి. అలా చేయడం ద్వారా వెనిగర్ మెషిన్ లోపలి భాగాన్ని చేరుతుంది. ఫలితంగా మురికిమొత్తం బయటికి వచ్చేస్తుంది. దాంతో మీ వాషింగ్ మెషిన్ శుభ్రంగా మారుతుంది. అనంతరం నార్మల్‌గా బట్టలు వాష్ చేసినట్లే నీరు పోసి తిప్పి.. ఆపై మెషిన్లో బట్టలు వేసి ఉతక్కోండి. మీ బట్టల మురికి చాలా చక్కగా పోతుందంటున్నారు నిపుణులు.
వాషింగ్ మెషిన్లో ఎన్ని దుస్తులు వేస్తున్నారు? - ఇలా చేస్తే ప్రాణాలకే ప్రమాదం!
వంటసోడా : మీరు వాషింగ్ మెషిన్ క్లీన్ చేసుకోవడానికి వెనిగర్, బేకింగ్ సోడా మిశ్రమం కూడా చాలా బాగా పనిచేస్తుందని నిపుణులు అంటున్నారు. ఇందుకోసం ముందుగా ఈ రెండింటి మిశ్రమాన్ని తీసుకొని స్పాంజితో మెషిన్ లోపల బాగా స్క్రబ్ చేయాలి. అనంతరం కాస్తా వేడినీరు పోసుకొని శుభ్రం చేసుకోవాలి. ఇలా చేయడం ద్వారా మురికి త్వరగా పోతుందని చెబుతున్నారు నిపుణులు. ఆ తర్వాత మీరు ఒక శుభ్రమైన క్లాత్ తీసుకొని వాషిన్ మెషిన్ లోపల తుడిచి ఆరబెట్టుకుంటే చాలు. మీ వాషింగ్ మెషింగ్ చక్కగా క్లీన్ అవ్వడమే కాకుండా కొత్తదానిలా మెరిసిపోతుందంటున్నారు!
నిమ్మ, టూత్‌పేస్ట్ : మీ వాషింగ్ మెషింగ్ క్లీనింగ్‌లో నిమ్మ, టూత్‌పేస్ట్ కూడా చాలా చక్కగా పనిచేస్తుందంటున్నారు నిపుణులు. ఇందుకోసం మీరు ముందుగా నిమ్మకాయను సగానికి కట్ చేసుకోవాలి. ఆపై నిమ్మ ముక్కకి టూత్‌పేస్ట్‌ను ఆప్లై చేసుకోవాలి. ఆ తర్వాత దాన్ని వాషింగ్ మెషిన్లో వేసి కొన్ని వాటర్ పోసుకోండి. కావాలనుకుంటే మరికొంత టూత్‌పేస్ట్‌ను కూడా వేసుకోండి. అలా వేశాక మెషిన్‌ను కాసేపు రన్ చేయాలి. ఈ ప్రక్రియ తర్వాత మళ్లీ వాటర్ పోసి క్లీన్ చేసుకోండి. అంతే మీ వాషింగ్ మెషిన్ చాలా బాగా క్లీన్ అవుతుందని చెబుతున్నారు నిపుణులు.
ఎన్నిరోజులకోసారి క్లీన్ చేసుకోవాలంటే.. మీరు వాషింగ్ మెషిన్ వాడుతున్నట్లయితే ప్రతి రెండు వారాలకు ఒక సారి తప్పనిసరిగా క్లీన్ చేసుకుంటే మంచిది అంటున్నారు నిపుణులు. ఇలా క్లీన్ చేసుకోవడం మెషిన్ శుభ్రంగా ఉండడమే కాకుండా బట్టలు కూడా చాలా చక్కగా క్లీన్ అవుతాయని చెబుతున్నారు. అదే మీరు శుభ్రం చేసుకోకపోతే బట్టలు వాష్ చేశాక కూడా మురికి పోదంటున్నారు. కాబట్టి, అదే మీరు ఎప్పటికప్పుడు వాషింగ్ మెషిన్‌ను శుభ్రంగా ఉంచుకుంటే బట్టల మురికి సరిగ్గా పోవడంతో పాటు మెషిన్ ఎక్కువ కాలం మన్నికగా ఉంటుందని చెబుతున్నారు నిపుణులు.