Waqf JPC Meeting scuffle : కేంద్రం తీసుకొచ్చిన వక్ఫ్ బిల్లుపై ఏర్పాటైన సంయుక్త పార్లమెంటరీ కమిటీ సమావేశంలో మంగళవారం గందరగోళం నెలకొంది. సమావేశం ప్రారంభమైన కొద్దిసేపటి ఎంపీలు వాగ్వావాదానికి దిగారు. టీఎంసీ ఎంపీ కల్యాణ్ బెనర్జీ- గ్లాస్ వాటర్ బాటిల్‌ను టేబుల్‌కు కొట్టి విసిరేశారు. దీంతో ఆయన చేతికి గాయం అయింది. ఈ కారణంగా కొద్దిసేపు సమావేశం ఆగిపోయింది. వెంటనే కల్యాన్ బెనర్జీకి ప్రథమ చికిత్స చేశారు. ఆ తర్వాత ఆయన్ను ఏఐఎమ్ఐఎమ్ అధినేత అసదుద్దీన్ ఓవైసీ, ఆప్ నేత సంజయ్ సింగ్ సమావేశం జరుగుతున్న గదికి తీసుకెళ్లారు. జగదాంబికా పాల్ నేతృత్వంలోని జేపీసీ- ఒడిశాలోని కటక్‌కు చెందిన జస్టిస్ ఇన్ రియాలిటీ, పంచశాఖ ప్రచార్ ప్రతినిధుల అభిప్రాయాలు, సూచనలు వింటున్న క్రమంలో ఈ ఘటన జరింది. ఈ వ్యవహారాన్ని పార్లమెంటరీ కమిటీ తీవ్రంగా పరిగణించింది. కల్యాణ్ బెనర్జీని ఒకరోజు సస్పెండ్ చేస్తూ కమిటీ నిర్ణయం తీసుకుంది.
VIDEO | TMC MP and parliamentary committee on Waqf (Amendment) Bill member Kalyan Banerjee (@KBanerjee_AITC) being escorted to the meeting following his treatment after he injured himself as he allegedly broke a glass bottle during the meeting.#WaqfAmendmentBill_2024
— Press Trust of India (@PTI_News) October 22, 2024
(Full… pic.twitter.com/a9B8HuOzeZ
Scuffle broke out during the Waqf JPC meeting in Parliament. According to eyewitnesses to the incident, TMC MP Kalyan Banerjee picked up a glass water bottle kept there and hit it on the table and hurt himself by accident: Sources
— ANI (@ANI) October 22, 2024
More details awaited pic.twitter.com/vMOkdZKwKP
కారణం ఇదే!
రిటైర్డ్ జడ్జీలు, సుప్రీం కోర్టు లాయర్లు హాజరైన ఈ సమావేశంలో కల్యాణ్ బెనర్జీ అప్పటికే మూడుసార్లు మాట్లాడారు. మరోసారి మాట్లాడే అవకాశం కావాలని కోరారు. అయితే దీనికి బీజేపీ ఎంపీ అభిజిత్ గంగోపాధ్యాయ అభ్యంతరం తెలిపారు. దీంతో ఇద్దరి మధ్య వాగ్వాదం జరిగింది. ఈ క్రమలో ఎంపీలు దుర్భాషలాడినట్లు సంబంధిత వర్గాలు తెలిపాయి. అక్కడే ఉన్న గ్లాస్ వాటర్ బాటిల్‌ను టేబుల్‌కేసి కొట్టగా బెనర్జీ చేతికి గాయమైంది. అనంతరం పగిలిన బాటిల్‌ను ఛైర్మన్ వైపు విసిరేశారు. ఫలితంగా సమావేశం వాయిదా పడింది.
సోమవారం జరిగిన జేపీసీ సమావేశంలో కూడా సభ్యులు వాగ్వాదానికి దిగారు. విపక్ష సభ్యులు లేవనెత్తిన ప్రశ్నలకు బీజేపీ సభ్యులు కౌంటర్ ఇచ్చారు. వక్ఫ్ బిల్లుపై సంప్రదింపుల ప్రక్రియపై విపక్ష సభ్యులు ప్రశ్నలు సంధించారు. రాజకీయ కారణాలతో ముస్లింలను లక్ష్యంగా చేసుకుని ప్రభుత్వం ఈ బిల్లును ప్రవేశపెడుతోందని ఆరోపించారు. ఈ బిల్లుపై ఏఐఎమ్ఐఎమ్ నేత అసదుద్దీన్ ఓవైసీ దాదాపు గంట పాటు ప్రెజంటేషన్ ఇచ్చారు. బిల్లు వల్ల వచ్చే చిక్కులపై ఆందోళన వ్యక్తం చేశారు. అయికే, వక్ఫ్ ఆస్తి నిర్వహణలో సంస్కరణలు తీసుకురావడానికి, పారదర్శకతకు భరోసా ఇవ్వడానికి ఈ బిల్లు అవసరమని బీజేపీ సభ్యులు వాదించారు.